Thungaturthi | నూతన రోడ్డును మంజూరు చేయాలని మోకాళ్లపై నిలబడి నిరసన
బండరామారం నుంచి గుండెపురి వరకు రోడ్డు పనులను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఆదివారం మోకాళ్లపై నిలబడి వినూత్న నిరసన చేపట్టారు.
తుంగతుర్తి : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని బండరామారం నుంచి గుండెపురి వరకు రోడ్డు పనులను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఆదివారం మోకాళ్లపై నిలబడి వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ రోడ్డు మొత్తం గుంతలమయంగా మారి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలోనే ప్రతిపాదనలు పంపినా ప్రస్తుత ఎమ్మెల్యే మందుల సామేల్ నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు.
జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు వెంటనే నిధులు కేటాయించి రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఆకారపు భాస్కర్, కొల్లూరి మహేందర్, కోతమర్తి సైదులు, కోరుకొప్పుల వెంకన్న, కోరుకొప్పుల ఉప్పలయ్య, భైరోజు సోమనర్స, గడ్డం సూరయ్య, పొదిలి కిష్టయ్య, యమా రవి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Suryapet News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

