వాట్సాప్ 2.0 – సిద్ధంగా నయా ఫీచర్లు
పలకరింపునే ‘హాయ్.. నుంచి వాట్సాప్ డ్యూడ్'గా మార్చేసిన ఘనత వాట్సాప్‌ది. మెసేజ్ బ్యాలెన్స్ వేసుకొని పొదుపుగా సందేశాలు పంపుతూ సంతృప్తిపడే తరానికి వాట్సాప్ ఓ సంచలనం. ఓ సందేశాల పరంపర! ఫొటోలు అటాచ్ చేసే సదుపాయం వచ్చాక మరింత మురిసిపోయారు. వాయిస్ మెసేజ్‌లు, ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ ఇలా అన్ని రకాల కమ్యూనికేష్లకూ వాట్సాప్ వేదికైంది.
పలకరింపునే ‘హాయ్.. నుంచి వాట్సాప్ డ్యూడ్’గా మార్చేసిన ఘనత వాట్సాప్‌ది. మెసేజ్ బ్యాలెన్స్ వేసుకొని పొదుపుగా సందేశాలు పంపుతూ సంతృప్తిపడే తరానికి వాట్సాప్ ఓ సంచలనం. ఓ సందేశాల పరంపర! ఫొటోలు అటాచ్ చేసే సదుపాయం వచ్చాక మరింత మురిసిపోయారు. వాయిస్ మెసేజ్‌లు, ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ ఇలా అన్ని రకాల కమ్యూనికేష్లకూ వాట్సాప్ వేదికైంది. ఇప్పుడు ఇదే వాట్సాప్ మరిన్ని కొత్త సొబగులు అద్దుకుంటున్నది. పూటకో మార్పుతో యూజర్లను కొత్తగా పలకరిస్తున్న నయా విశేషాలేంటంటే..
చాటింగ్‌కు, వీడియో కాల్స్ మాత్రమే కాదు రెగ్యులర్ ఫోన్‌కాల్స్‌కు కూడా వాట్సాప్ వాడేస్తున్నాం. ఈ క్రమంలో ఇప్పటికీ ఓ సమస్య యూజర్లకు ఎదురవుతున్నది. అదేంటంటే.. ఏదైనా ఫోన్ నెంబర్ని సరాసరి వాట్సాప్ నుంచే సేవ్ చేయలేకపోవడం. ముందు ఫోన్ కాంటాక్ట్స్‌లోకి వెళ్లి నెంబర్ సేవ్ చేయాలి. అప్పుడే ఆ కాంటాక్ట్ వాట్సాప్‌లోకి సింక్ అయ్యేది. ఇకపై అలాంటి సమస్య లేదు. వాట్సాప్ కొత్త అప్డేట్తో కాంటాక్ట్‌లను సులభంగా మేనేజ్ చేసుకోవచ్చు. ఇకపై మీరు ఫోన్ నెంబర్ సేవ్ చేయాలంటే వాట్సాప్ ‘కాల్స్’ని ట్యాప్ చేయండి. దాంట్లో ప్లస్ గుర్తుతో ఓ ఫోన్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే కాంటాక్ట్ లిస్ట్‌తో పాటు ‘న్యూ కాంటాక్ట్’ పేరుతో ఆప్షన్ కనిపిస్తుంది. సెలెక్ట్ చేసి కొత్త కాంటాక్ట్‌ను సేవ్ చేయొచ్చు. ఇలా సేవ్ చేసిన కాంటాక్ట్‌లు ఫోన్‌బుక్ లోనూ, క్లౌడ్ స్టోరేజ్లోనూ భద్రంగా ఉంటాయి. ఒకవేళ కాంటాక్ట్‌లకు సంబంధించి ఏదైనా అదనపు సమాచారం జోడించాలంటే ‘యాడ్ ఇన్ఫర్మేషన్’ ఆప్షన్‌తో చేయొచ్చు.
పీసీల నుంచీ కూడా..
మరో కొత్త అప్డేట్తో త్వరలోనే ‘వాట్సాప్ వెబ్’ నుంచి కూడా కాంటాక్ట్‌లను సేవ్ చేసుకునే అవకాశం రానుంది. డెస్క్‌టాప్, ల్యాపీల నుంచి కూడా కాంటాక్ట్‌లను సేవ్ చేసుకునేందుకు వీలుంటుంది. ఇలా సేవ్ చేసినవి ఆటోమేటిక్‌గా అన్ని డివైజ్‌లలో సింక్ అవుతాయి. కావాలంటే వాట్సాప్‌లో సేవ్ చేసిన నెంబర్‌ను యాప్ వరకే పరిమితం చేయొచ్చు కూడా! ఇక్కడ వాట్సాప్ అందిస్తున్న మరో సౌలభ్యం ఏంటంటే.. అక్కడ సేవ్ చేసిన కాంటాక్ట్‌లు ఆటోమేటిక్‌గా రీస్టోర్ అవుతాయి. అంటే.. ఎప్పుడైనా ఫోన్ పోగొట్టుకున్నా, మరో ఫోన్లో మీ వాట్సాప్ వాడాల్సి వచ్చినా.. కాంటాక్ట్‌లు చిటికెలో రీస్టోర్ అవుతాయన్నమాట. అంతేకాదు.. భవిష్యత్తులో వాట్సాప్‌లోని కాంటాక్ట్‌లు కేవలం యూజర్ నేమ్ మాదిరిగానే కనిపిస్తాయ్. అంటే.. ఇప్పటి వరకూ వాట్సాప్‌లో కాంటాక్ట్ ఉందంటే కచ్చితంగా నెంబర్ కనిపిస్తుంది. ఇకపై ఎవరైనా కొత్త వ్యక్తి మీకు వాట్సాప్‌లో ఏదైనా పంపాలంటే.. మీ నెంబర్ వారికి తెలియాల్సిన అవసరం లేదు. మీ కాంటాక్ట్ క్యూఆర్ కోడ్‌ను చూపిస్తే చాలు. దాన్ని స్కాన్ చేయగానే మీ వాట్సాప్ అకౌంట్ యూజర్ నేమ్‌లా ఇతరుల ఫోన్లో సేవ్ అవుతుంది. నెంబర్ మాత్రం కనిపించదు. దీంతో మీ ప్రమేయం లేకుండా మీ నెంబర్ ఇతరులకు చిక్కే అవకాశమే ఉండదు. అంటే.. గ్రూపుల్లో ఎవరైనా మిమ్మల్ని యాడ్ చేస్తే.. మీ యూజర్ నేమ్ మాత్రమే కనిపిస్తుంది. సో.. ఇదో ‘ఎక్స్ట్రా డిగ్రీ ఆఫ్ ప్రైవసీ’ అన్నమాట. కొత్త కాంటాక్ట్‌ని సేవ్ చేసేందుకు కాల్స్‌లోకి వెళ్లనక్కర్లేదు. ‘న్యూ మెసేజ్’ ఐకాన్ మీద ట్యాప్ చేసి కూడా చేయొచ్చు. ‘న్యూ గ్రూప్’, ‘న్యూ కమ్యూనిటీ’తోపాటు ‘న్యూ కాంటాక్ట్’ కూడా కనిపిస్తుంది.
‘లింక్’ని వాడుతున్నారా?
ఆఫీస్ పని నిమిత్తం జూమ్‌లో వర్చువల్ మీటింగ్ లింక్‌ని క్రియేట్ చేస్తుంటాం. ఆ లింక్‌ని కొలీగ్స్‌కి షేర్ చేస్తుంటాం. వాళ్లందరూ లింక్‌పై క్లిక్ చేసి మీటింగ్‌లో జాయిన్ అవుతారు. ఇదే మాదిరిగా వాట్సాప్‌లోనూ వీడియో మీటింగ్ లింక్‌ని క్రియేట్ చేయొచ్చు! అదెలాగంటే… వాట్సాప్‌లోని ‘కాల్స్’ లోకి వెళ్లి అక్కడ కనిపించే ఫోన్ సింబల్‌తో కూడిన ఐకాన్ని సెలెక్ట్ చేయాలి. వచ్చిన ఆప్షన్స్ లోని ‘న్యూ కాల్ లింక్’ని ట్యాప్ చేయాలి. దీంతో వీడియో మీటింగ్‌కి సంబంధించిన యూఆర్ఎల్ క్రియేట్ అవుతుంది. తర్వాత ‘కాల్ టైప్’ని (వీడియో, వాయిస్) ఎంచుకోవాలి. తర్వాత ఆ లింక్‌ని వాట్సాప్ నుంచే షేర్ చేయొచ్చు. లేదంటే.. ‘కాపీ లింక్’ని సెలెక్ట్ చేసి మెసేజ్ రూపంలో పంపొచ్చు. మెయిల్ లేదా ఇతర సర్వీసుల నుంచి షేర్ చేయాలనుకుంటే ‘షేర్ లింక్’ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరైతే మీటింగ్‌లో జాయిన్ అవ్వాలనుకున్నారో.. వారికి లింక్ పంపాలన్నమాట. సదరు వ్యక్తులు ఆ లింక్‌పై క్లిక్ చేసి మీటింగ్‌లో పాల్గొనొచ్చన్నమాట.
స్టేటస్ మారుతున్నది..
వాట్సాప్‌లో స్టేటస్‌లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సందర్భానికి తగ్గ స్టేటస్ పెట్టడానికి నానా తంటాలు పడుతుంటారు. కావాల్సిన పాటనో, సన్నివేశాన్నో డౌన్లోడ్ చేయడం, ఎడిటింగ్ యాప్‌లు ఇన్స్టాల్ చేసుకొని దాన్ని నచ్చినట్టుగా ఎడిట్ చేయడం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ జతకలపడం ఇలా స్టేటస్ కోసం చెమటోడుస్తారు. మన స్టేటస్ క్రేజీ అలా ఉంటుంది మరి. ఇలాంటి క్రేజీ ఫెలోస్ కోసమే స్టేటస్‌ని మరింత వినూత్నంగా మార్చేందుకు వాట్సాప్ సిద్ధమవుతున్నది. అదేంటంటే.. స్టేటస్‌కి చక్కని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ట్రాక్ పెట్టుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ మాదిరిగా అన్నమాట. నచ్చిన మ్యూజిక్ ట్రాక్స్, పాటల్ని వెతుక్కుని స్టేటస్‌కి నేరుగా యాడ్ చేయొచ్చు. అందుకు తగినట్టుగా స్టేటస్ అప్డేట్ స్క్రీన్‌లో Music button కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసి search songs or artists నుంచి కావాల్సిన వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం డెవలపింగ్ మోడ్‌లో ఉన్న ఈ ఫీచర్ బీటా వెర్షన్ త్వరలోనే లాంచ్ కానుంది.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Traffic Challan | ఫుట్‌పాత్‌పై బైక్ నడిపితే రూ.5 వేలు.. వన్‌వేలో వెళ్తే రూ.10 వేల ఫైన్? బెంగళూరులో కఠినంగా ట్రాఫిక్ రూల్స్!!
Bigg Boss 10 | త్రిగుణ్‌కు అదిరిపోయే గిఫ్ట్.. ముఖేష్, వంశీ మధ్య తీవ్ర వాగ్వాదం
Census 2027 | దేశవ్యాప్తంగా జనగణనకు ముహూర్తం ఖరారు.. జనవరి 25 నుంచి ఇంటింటికీ లెక్కింపు!
Aurangzeb Tomb | ఔరంగజేబు సమాధి తొలగింపునకు డెడ్‌లైన్ ఫిక్స్.. సంచలన ప్రకటన చేసిన మహారాష్ట్ర మంత్రి!
Panchayat Raj | ఆరు నెలలకో అధికారి.. పీఆర్ఆర్డీలో మూడేండ్లలో ఆరుగురు స్పెషల్ సీఎస్ల బదిలీ
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

