మంచు మిఠాయి… మస్తుగుందోయి!
ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ ఇండస్ట్రీలో వస్తున్న కొత్త ప్రయోగాలు, సోషల్ మీడియా ట్రెండ్స్, యువత అభిరుచులు కలిసి ఐస్‌క్రీమ్ ప్రపంచాన్నే మార్చేస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ ఇండస్ట్రీలో వస్తున్న కొత్త ప్రయోగాలు, సోషల్ మీడియా ట్రెండ్స్, యువత అభిరుచులు కలిసి ఐస్‌క్రీమ్ ప్రపంచాన్నే మార్చేస్తున్నాయి. ఇప్పుడు ఇది ఒక ఎక్స్‌పీరియెన్స్ ఫుడ్‌గా మారింది. రోల్ తరహావీ, పొగలు కక్కేవీ, మంచు తురుముతో చేసేవీ… ఇలా విభిన్నవెరైటీలు అంతర్జాతీయ హద్దులను చెరిపేస్తూ ఫుడ్ లవర్స్‌కి దగ్గరవుతున్నాయి.
రోల్ రోల్ చిల్…
ఐస్‌క్రీమ్ రుచిలోనే కాదు ఆకృతిలోనూ విభిన్నతను కోరుకుంటున్నారు నేటి జనం. అందుకే థాయ్‌లాండ్‌లో పుట్టిన రోల్ ఐస్‌క్రీమ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యువతకు ఫేవరెట్. చల్లటి స్టీల్ ప్లేట్‌పై పాలు, క్రీమ్, ఫ్లేవర్స్ పోసి వేగంగా కలుపుతూ ఐస్‌క్రీమ్ తయారు చేస్తారు. తరువాత దాన్ని పలుచగా పరచి చిన్న చిన్న రోల్స్‌గా మడతపెడతారు. ఈ తయారీ ప్రక్రియను చూస్తూ వీడియోలు తీసి నెట్టింట్లో పెట్టి తెగ ఖుషీ అవుతున్నారు సోషల్ మీడియా అభిమానులు. ఒరియో, కిట్‌క్యాట్, బ్రౌనీ, మామిడి, డ్రాగన్ ఫ్రూట్, నట్స్, క్యాండీలు.. ఇలా ఎన్నో టాపింగ్స్‌తో దీనిని ప్రత్యేకంగా తయారు చేస్తారు.
పొగలు కక్కే ఐస్‌క్రీమ్!
ఐస్‌క్రీమ్ తినడంలో సరికొత్త అనుభూతి కావాలనుకునే వారిని ఏమాత్రం నిరుత్సాహపరచని వెరైటీ.. లిక్విడ్ నైట్రోజన్ ఐస్‌క్రీమ్. లిక్విడ్ నైట్రోజన్‌తో తయారయ్యే ఈ ఐస్‌క్రీమ్ చూడటానికి సైన్స్ ఎక్స్‌పెరిమెంట్‌లా ఉంటుంది. ఐస్‌క్రీమ్ తింటున్నప్పుడు నోట్లోంచి పొగ రావడం పిల్లలు, యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్నది. డ్రాగన్ బ్రెత్ అనే పేరుతో కూడా ఇవి ఫేమస్. సాధారణ ఐస్‌క్రీమ్ మిశ్రమంలోకి -196 డిగ్రీ టెంపరేచర్ లిక్విడ్ నైట్రోజన్‌ను పోస్తారు. దీంతో క్షణాల్లో ఐస్‌క్రీమ్ సిద్ధమైపోతుంది. కస్టమర్ ఎదుటే తయారు చేయడం వల్ల ఇది ఫుడ్ షోలా అనిపిస్తుంది. ఫుడ్ ఫొటోగ్రఫీ, ఇన్స్టారీల్స్ కోసం ఈ వేరైటీకి డిమాండ్ పెరిగింది.
బింగ్సు… ద కొరియన్!
కొరియాలో ప్రసిద్ధి చెందిన బింగ్సు ఒక విభిన్న రకమైన ఐస్‌క్రీమ్. మంచును తురిమి దానిపై ఫ్రూట్స్, ఐస్‌క్రీమ్, కండెన్స్డ్ మిల్క్, చాక్లెట్, నట్స్ వేసి అందంగా సర్వ్ చేస్తారు. చూడటానికే కళాఖండంలా ఉండే దీన్ని తినడం మొదలుపెడితే మాత్రం మంచు మబ్బుల్లో తేలుతున్న అనుభూతి కలుగుతుంది. సాధారణ ఐస్‌క్రీమ్ కంటే బింగ్సులో టెక్స్చర్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇది గట్టిగా ఉండదు. నోట్లో పెట్టుకుంటే వెంటనే కరిగిపోతుంది. దీని అందమైన ప్రజెంటేషన్ యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్నది. ఇందులో రకరకాల ఫ్లేవర్స్ అందుబాటులో ఉన్నాయి. మ్యాంగో బింగ్సు, చీజ్ కేక్ బింగ్సు, ఓరియో బింగ్సు ఇప్పుడు కేఫ్‌లలో ఫొటోలకు హాట్ ఫేవరెట్‌గా మారాయి.
నమిలి తినే మోచి
సాధారణంగా ఐస్‌క్రీమ్ అంటే చప్పరించేదే అని తెలుసు. కానీ, కాస్త నమిలి తినే వెరైటీ కూడా దొరుకుతున్నది. జపాన్‌కు చెందిన మోచి ఐస్‌క్రీమ్ బయట బియ్యపు పిండితో చేసిన మృదువైన నమిలే పొర, లోపల చల్లటి క్రీమీ ఐస్‌క్రీమ్ కలయిక. ఒకేసారి రెండు వేర్వేరు అనుభూతులు ఇచ్చే ఈ డెజర్ట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది. జపాన్ సంప్రదాయ మిఠాయి మోచికి ఆధునిక ఐస్‌క్రీమ్‌ను జతచేసి రూపొందించిన ఈ ఫ్యూజన్ డెజర్ట్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు పెరుగుతున్నారు. మాచా, రెడ్ బీన్, మామిడి, స్ట్రాబెర్రీ, బ్లాక్ సెసమీ వంటి ఆసియన్ ఫ్లేవర్లు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

