ఆంత్రాక్స్‌తో నొప్పి మాయం

ఆంత్రాక్స్… ఎంతటివారినైనా వణికించే బ్యాక్టీరియా. దీన్ని జీవాయుధంగా కూడా ప్రయోగించేవారు. అలాంటి ఆంత్రాక్స్ వల్ల ప్రయోజనం కూడా ఉందంటే నమ్మగలమా! హార్వర్డ్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తల పరిశోధనల గురించి తెలిస్తే నమ్మక తప్పదనిపిస్తుంది. సాధారణంగా హానికారక బ్యాక్టీరియా మీద ప్రయోగాలు చేసేటప్పుడు, అది ఎలా పనిచేస్తుంది, దాన్ని ఎలా నిరోధించాలి… అన్న ప్రశ్నలే లక్ష్యంగా ఉంటాయి. కానీ ఈ పరిశోధనలో ఆంత్రాక్స్ రసాయనాలు మనకు నొప్పి కలిగించే కణాల మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆంత్రాక్స్ చాలా సులువుగా జంతువులకు అంటుకుంటుంది కాబట్టి, ఎలుకల మీద ఈ ప్రయోగం చేశారు. ఆశ్చర్యకరంగా, అవి నొప్పిని నిలువరిస్తున్నట్టు తేలింది. ప్రస్తుతానికి నొప్పిని తగ్గించేందుకు పెయిన్ కిల్లర్స్ లేదా ఓపియాడ్స్ వాడుతున్నారు. పెయిన్ కిల్లర్స్ దుష్ఫలితాలు అందించగా, ఓపియాడ్స్ ఓ వ్యసనంగా మారతాయి. అందుకు విరుద్ధంగా ఆంత్రాక్స్లో భాగమైన కొన్ని రసాయనాలు.. వెన్నెముక ద్వారా నొప్పిని తెలియచేసే నాడీవ్యవస్థను అదుపుచేసినట్టు తేలింది.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

