నచ్చని వాళ్లే విమర్శిస్తారు
‘జాతిరత్నాలు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆరడుగుల సుందరి ఫరియా అబ్దుల్లా. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్నది.
‘జాతిరత్నాలు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆరడుగుల సుందరి ఫరియా అబ్దుల్లా. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్నది. తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసే ఈ హైదరాబాదీ బ్యూటీ సందీప్ కిషన్‌తో కలిసి ‘సిగ్మా’లో మెరిసింది. ఈ చిత్రం ఇటీవల విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకున్న సందర్భంగా చిట్టి పంచుకున్న కార్వాన్ కబుర్లివి.
‘సిగ్మా’ పక్కా కమర్షియల్ సినిమానే అయినప్పటికీ కొత్తగా నిర్మించారు. తమిళ్లో నేనే డబ్బింగ్ చెప్పడం కొత్త అనుభూతినిచ్చింది. తమన్ మ్యూజిక్ అద్భుతం. డైరెక్టర్ సంజయ్ డిఫరెంట్ థింకర్. సందీప్‌తో కలిసి నటించడం సరదాగా అనిపించింది.
అల్లు అర్జున్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. నాకు మంచి జరిగినా, చెడు జరిగినా ఆయనతోనే పంచుకోవడానికి ఇష్టపడతాను. ఆయన నన్నెప్పుడూ మోటివేట్ చేస్తూ గైడ్ చేసే వ్యక్తి. మేమిద్దరం కలిసి సినిమా చేయలేదు కానీ, ఓ కార్యక్రమంలో మా మధ్య పరిచయం మొదలైంది.
ప్రతి ఒక్కరికీ భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఇటీవల సోషల్ మీడియాలో నాపై ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. నేను కూడా వాటిపై వివరణ ఇచ్చాను. మనం 2026లో జీవిస్తున్నాం. కానీ, చాలామంది పాతకాలం వాళ్లలా ఆలోచిస్తున్నారు. నేనెప్పుడూ అభ్యుదయ భావాలతోనే ఆలోచిస్తాను. నా పద్ధతులు నచ్చిన వాళ్లు ఫాలో అవుతారు, నచ్చని వాళ్లు విమర్శిస్తారు. అందరి ఆలోచనలను గౌరవిస్తాను.
‘హనుమాన్’ సినిమాను రిజెక్ట్ చేయడమే.. నా జీవితంలో చాలా రిగ్రెట్ అయిన విషయం. డైరెక్టర్ కథ చెప్పినప్పుడు నా బ్రెయిన్ పనిచేయలేదు. బుద్ధిలేక నో చెప్పాను. ఆ స్క్రిప్ట్‌ను అంచనా వేయలేకపోయాను. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పటికీ తేజ సజ్జా, ప్రశాంత్ వర్మని కలిసినప్పుడల్లా ఆ విషయం గుర్తుకు వస్తుంటుంది.
ఒకవేళ సినిమాల్లోకి రాకపోయి ఉంటే ఏదైనా పెద్ద క్రూయిజ్‌షిప్‌లో షెఫ్‌గా స్థిరపడేదాన్ని లేదంటే ఈవెంట్ మేనేజర్‌గా పనిచేసేదాన్ని. నాకు ప్రయాణాలంటే చాలా ఇష్టం. ట్రావెల్ వ్లాగర్‌గా కెరీర్ డిజైన్ చేసుకునేదాన్ని.
నా దృష్టిలో ప్రేమ, పెండ్లి అనేవి రెండు వేర్వేరు అంశాలు. మనల్ని ఎవరైనా ప్రేమిస్తున్నారు అనే భావన మనసుకు ఎంతో అద్భుతంగా ఉంటుంది. జీవితానికి తోడు అనేది కచ్చితంగా అవసరమే. పెండ్లి వల్ల ఒక మనిషి తనను తాను పూర్తిగా మార్చుకునే అవకాశం ఉంటుంది. కానీ, దురదృష్టవశాత్తూ ప్రస్తుత తరం పెండ్లి అనే బంధంపై ఆసక్తిని కోల్పోతున్నది.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సద్దుల పొద్దు.. పూల సద్దు!
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

