Naya Mall | సోషల్ మీడియా విశృంఖలత్వం నుంచి పిల్లల్ని కాపాడుకోవడం నేటితరం తల్లిదండ్రులకు పెద్ద సవాలు. చదువంతా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లలో జరుగుతున్న కాలంలో వాటికి దూరంగా పెంచడం కూడా సాధ్యంకాని పనే. అందుకే బాటు టెక్ సంస్థ ‘ఎనేబుల్ ట్యాబ్’ పేరిట పిల్లల కోసం ప్రత్యేకంగా సరికొత్త ట్యాబ్లెట్స్ రూపొందించింది. ఇవి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేస్తాయి. ఆన్లైన్ సెర్చ్ చేస్తున్నప్పుడు ఏదైనా పిచ్చి కంటెంట్ కనిపిస్తే వెంటనే పెద్దవాళ్లకు హెచ్చరికలు పంపుతాయి. పిల్లలు ఏమేం చూస్తున్నారు, ఎంతసేపు స్క్రీన్ చూస్తున్నారు.. తదితర సమాచారం యాప్ ద్వారా అందిస్తాయి. అంతేకాదు, ఆత్మహత్య ఆలోచనలు, కుంగుబాటు లక్షణాలు ఉన్నా కూడా పెద్దల్ని అప్రమత్తం చేస్తాయి. వీటి సాయంతో పిల్లలు ఆరోగ్యకరంగా చదువుకునే, నేర్చుకునే అవకాశం లభిస్తుంది. వివరాలకు.. baatu.mobi/product/baatu-enable-tab. వెల రూ.15,999.
ఎరుపు ఎక్కడున్నా ఇట్టే ఆకర్షిస్తుంది. అందులోనూ చీరంతా కుచ్చులు వచ్చే రఫుల్ శారీలు మరింతగా కట్టిపడేస్తాయి. కాకపోతే, వాటికి ‘బో బ్లౌజ్’ జతకూడాల్సిందే. డిజైనర్ భూమిక శర్మ పొగడ వన్నె చీరకు అచ్చం అలాంటి రవికనే జత చేశారు. జార్జెట్ మెత్తదనాన్ని కుచ్చుల చీరకు కుదిర్చి, రెపరెపలాడే ఆర్గంజా రవికకు అద్దాలూ పూసలూ అమర్చారు. అదే జాకెట్‌కు ముందు భాగాన రిబ్బన్ ముడివేసినట్టు ఉండే బోల్డ్ బో డిజైన్‌ను చేర్చి… మొత్తంగా ‘శారీ సూపర్’ అనిపించేలా తీర్చిదిద్దారు. ogaan.comలో దొరికే ఈ సెట్ ధర 42 వేల రూపాయలు.
హ్యాండ్ బ్యాగ్‌తో అలంకరణకు అదనపు హంగు సమకూరుతుంది. ఆ తరహా డిజైనింగ్‌లో అందెవేసిన చేయి.. ఇటాలియన్ బ్రాండ్ రొసాంటికా. ఆర్ట్ పీస్‌ను మలిచినంత ముచ్చటగా హ్యాండ్‌బ్యాగులను తీర్చిదిద్దడం దీని ప్రత్యేకత. ఈ సంస్థ ఇటీవల ‘మాంటే బియాంకో’ పేరిట ఒక ధగ ధగలాడే బ్యాగును తీసు కొచ్చింది. చలికాలంలో స్కీయింకు వెళ్లే ఆటగాళ్లు, వాళ్లను తీసుకెళ్లే కార్చెయిర్లను ప్రతిబింబించేలా దీన్ని రూపొందించింది. రంగురంగుల రాళ్లు, క్రిస్టల్స్‌తో బంగారు వన్నెలో మెరిసిపోయే ఈ బ్యాగు ఇట్టే ఆకట్టుకుంటుంది. ఈ లిమిటెడ్ ఎడిషన్‌ను rosantica.com ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు. ధర సుమారు లక్షా ఎనభైవేల రూపాయలు.
రోజువారీ పనులు, ఒత్తిళ్ల నుంచి శరీరం ఎప్పుడో ఒకసారి కాస్తంత విశ్రాంతిని కోరుతుంది. అందులోనూ, నిత్యం కంప్యూటర్ల ముందు తిష్ఠ వేసేవారికి తలనొప్పి, మెడ నొప్పి, కళ్ల సమస్యలు సహజమైపోయాయి. అలాంటి సందర్భాల్లో మనకు కాస్త రిలాక్సేషన్ అందించేందుకు ఉపయోగపడుతుంది.. ‘జెక్ సెరెబ్రో హెడ్ అండ్ ఐ మసాజర్’. కిలో బరువుండే ఈ పరికరాన్ని తలకు పెట్టుకుంటే చాలు.. కళ్లు, నుదురు, తల వెనుక, మెడ భాగాల్లో మసాజ్ చేస్తుంది. పదిహేను నిమిషాల పాటు సాగే మర్దనలో రిలాక్స్, డైనమిక్, స్లీప్, రెజువెనేట్ మోడ్ ఉంటాయి. మన ఇష్టాన్ని బట్టి వీటిని సెట్ చేసుకోవచ్చు. బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయ్యేలోపలి స్పీకర్లు మృదువైన సంగీతాన్ని వినిపిస్తాయి. దీని మీద ఉండే ఎల్ఈడీ స్క్రీన్ కనెక్టివిటీకి సంబంధించిన సమాచారం చూపిస్తుంది. ఒకసారి చార్జింగ్ పెడితే ఆరు సార్లు ఉపయోగించుకోవచ్చు. ఈ మసాజర్ ధర రూ.15,999. xech.com ద్వారా ఖరీదు చేయొచ్చు.