Nargis fakhri | నటించిన సినిమాలు తక్కువే అయినా.. ‘నర్గీస్ ఫఖ్రీ’ క్రేజ్ మాత్రం తగ్గలేదు. కారణం.. మత్తెక్కించే ఆమె అందం, ఆకట్టుకునే అభినయం! ఆ అర్హతతోనే క్రిష్ దర్శకత్వంలో టాలీవుడ్లో అడుగుపెడుతున్నది ఫఖ్రీ. ‘హరిహర వీరమల్లు’లో పవన్ కల్యాణ్‌తో జత కట్టనున్నది. షాజహాన్ కూతురిగా, మొఘల్ అందాల యువరాణిగా.. వజ్రాల దొంగ (హరిహర వీరమల్లు) మనసును దోచుకోనున్నది. ఆ ముచ్చట్లన్నీ ఆమె మాటల్లోనే..
అనారోగ్యంతోనే నేను బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పానని చాలామంది అనుకుంటారు. అదేం లేదు. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. వరుస సినిమాలతో కొంచెం ఇబ్బంది పడ్డానంతే! మనసుకు, శరీరానికి విశ్రాంతి అవసరమనిపించి న్యూయార్క్ వెళ్లాను. కొంతకాలం కుటుంబంతో సరదాగా గడిపాను. ముఖ్యంగా కరోనా సమయంలో అమ్మకు దగ్గరగా ఉన్నాను.అభిమానులకు మాత్రం ఎప్పుడూ దూరంగా లేను.
ఓ మనిషిగా.. తోటివారితో స్నేహంగా ఉండటం, కుటుంబానికి విలువ ఇవ్వడం, స్నేహితులను కలుపుకొనిపోవడం చాలా ముఖ్యం. అనుకోకుండా న్యూయార్క్ వెళ్లడానికి ఇదో కారణం. ముంబైలో ఉన్నంతకాలం అమ్మకు, స్నేహితులకు దూరంగా ఉన్నాను. ఆ బంధాలను దూరం చేసుకోవద్దనే నేను యూఎస్ వెళ్లాను. ఆ సమయంలో నా కుటుంబంతో గడిపిన ప్రతిక్షణం మధురమైనదే.
నేను సృజనాత్మకతను కోరుకుంటాను. చదవడం, రాయడం ఇష్టం. పెయింటింగ్స్ వేయడం ఇంకా ఇష్టం. ఫైన్ ఆర్ట్స్‌లో కోర్సు కూడా చేశాను. ఆధ్యాత్మికంగా చాలాదృఢంగా ఉంటాను. ఇప్పుడిప్పుడే వ్యాపారంలో అడుగుపెడుతున్నాను. నేనెప్పుడూ, ఇష్టంలేని వ్యవహారాల్లో తలదూర్చను. నాకు సంతోషం కలిగించే పనులే చేస్తాను.
పనినే నమ్ముకున్న వ్యక్తిని నేను. అందుకే, బాలీవుడ్లో బిజీ కావాలని అనుకుంటున్నా. మంచి కథల కోసం ఎదురుచూస్తున్నా. అది ఓటీటీ అయినా ఫర్వాలేదు. ఎందుకంటే నా వృత్తి.. నటన మాత్రమే. మాధ్యమం ఏదైతేనేం. ఇక, ఉదయ్ చోప్రాతో డేటింగ్ అనేది పాత మాట. ఇప్పుడు ఇద్దరం మంచి స్నేహితులుగా ఉన్నాం. ఎలా బతకాలో మా ఇద్దరికీ ఓ క్లారిటీ ఉంది. అందుకేనేమో బ్రేకప్ తప్పలేదు.
వ్యాపారవేత్త టోనీబేగ్తో రిలేషన్షిప్ గురించి ఎంతోమంది ఎన్నో విధాలుగా మాట్లాడుతున్నారు. ఏ సంబంధమైనా ఎంత ముందుకు వెళ్లాలనేది ఇద్దరి మనసులతో ముడిపడి ఉంటుంది. డేట్ తర్వాత పెండ్లి చేసుకొని చాలామంది సుఖంగా ఉంటున్నారు. అభిప్రాయాలు నచ్చనివారు విడిపోతున్నారు. వాటి గురించి బహిరంగంగా మాట్లాడకూడదు. నాకు అండగా ఉంటూ, నా కలలకు మద్దతుగా నిలిచే వ్యక్తికే జీవిత భాగస్వామిగా ప్రాధాన్యం ఇస్తాను.
తెలుగులో పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నేనూ భాగం కావడం గర్వంగా ఉంది. ఇది పాన్ ఇండియా మూవీ. దీంతో దక్షిణాదిలో కచ్చితంగా నిలదొక్కుకుంటాను. పైగా నా
రీఎంట్రీకి ఇదే సరైన సినిమా. అందులో నాది మొఘల్ యువరాణి పాత్ర. పవన్‌తో నా సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఇప్పటివరకూ చెయ్యని ఓ కొత్త క్యారెక్టర్ ఇది. ఇంతకుమించి ఏమీ చెప్పలేను.
బాలీవుడ్లో ఉన్నది కొద్దికాలమే కాబట్టి, అతికొద్దిమంది స్నేహితులే ఉన్నారు. తెలిసినవాళ్లు చాలామందే ఉన్నా, వాళ్లంతా చాలా బిజీ. వాళ్లతో స్నేహం చాలా కష్టం. వరుణ్ ధావన్, లియినా డి క్రూజ్, హుమా ఖురేషీతో చాలా సన్నిహితంగా ఉండేదాన్ని. బాలీవుడ్లో నా బెస్టీస్ వాళ్లే!
గ్యాప్ ఇస్తే ప్రెగ్నెంట్ అని తేల్చేస్తారా.. నర్గీస్ ఫక్రీ సెన్సేషనల్ కామెంట్స్”
Nargis Fakhri | మెరిసే డ్రెస్‌లో నర్గీస్ ఫక్రీ అందాల ఆరబోత..”
“Nargis Fakhri | వాళ్లతో పడుకోలేదనే ఆఫర్లు లేకుండా చేశారు”
Nidhhi Agerwal | హరిహరవీరమల్లు స్టోరీ లైన్ రివీల్ చేసిన నిధి అగర్వాల్”