వాళ్లే ఫస్ట్ మోడలింగ్ చేయమని సలహా ఇచ్చారు.. అసలు విషయం చెప్పిన మిస్ ఇండియా సినీ శెట్టి
Miss India 2022 Sini Shetty | ఈ ఏడాది మిస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకున్న కన్నడ సోయగం.. సినీశెట్టి. రాబోయే మిస్ వరల్డ్ పోటీల్లోనూ మెరిసేందుకు సిద్ధమవుతున్నది ఆ ఆరడుగుల అందగత్తె. సినీశెట్టి త్వరలోనే వెండితెరపైనా అభిమానులను అలరించనున్నది. జీవితంలో అనుకున్నది సాధించాలంటే లక్ష్యం, కుటుంబం, వ్యక్తిత్వం.. ఈ మూడూ తప్పనిసరి అంటూ అనేక ముచ్చట్లు చెప్పిందా సొగసుల గని.

స్కూల్‌డేస్‌లో చదువు మినహా మరే విషయం మీదా ఆసక్తి ఉండేది కాదు. కానీ, కాలేజీకి వచ్చేసరికి చాలామంది స్నేహితులు. పొడుగ్గా ఉన్నానని మోడలింగ్ ప్రయత్నించమంటూ సలహా ఇచ్చారు. అప్పట్లో పెద్దగా పట్టించుకోలేదు. కానీ, కొన్నాళ్లకు ‘ఎందుకు చేయకూడదు?’ అని నన్ను నేను ప్రశ్నించుకున్నా.

ప్రతి అమ్మాయికీ ఒక కల ఉంటుంది. ఒక లక్ష్యం ఉంటుంది. దాన్ని నెరవేర్చుకునేందుకు అనేక మార్గాలు ఉంటాయి. దేన్ని ఎంచుకుంటున్నాం? అన్నదే కీలకం. ప్రతి అమ్మాయికి ఆర్థిక స్వేచ్ఛ అవసరం. ఆ విషయంలో నా కుటుంబం అన్నివేళలా అండగా నిలిచింది. డ్యాన్స్ వర్క్‌షాప్స్ నిర్వహిస్తూ, కార్పొరేట్ సంస్థల్లో పనిచేసుకుంటూ అందాలపోటీలకు సిద్ధ
మయ్యాను. అన్నిటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగితేనే విజయం సాధిస్తాం. కుటుంబ ప్రోత్సాహం తోడైతే ఏ మహిళ అయినా తన లక్ష్యాన్ని చేరుకుంటుంది.

విద్యార్థి దశ ప్రతి ఒక్కరి జీవితంలోనూ చాలా ముఖ్యమైన మలుపు. నేను చదువునెప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. నా నిర్ణయం ఇంట్లో చెప్పినప్పుడు పూర్తి మద్దతు లభించింది. అయితే చదువు పూర్తయిన తర్వాతే మోడలింగ్ మీద దృష్టి పెట్టాలన్నారు. అమ్మ ప్రోత్సాహంతోనే ఈ స్థాయిలో ఉన్నాన్నేను. పదహారేండ్ల వయసులో నా భరతనాట్య సాధన మొదలైంది. నా నడక, నడత, వ్యక్తిత్వం అన్నీ నా ప్రస్థానంలో భాగమే. నా కలలకు తగినట్లు నన్ను నేను మలుచుకున్నా.

అందం అనేది వ్యక్తిత్వంలో ఉంటుంది.. రంగులో కాదు. ఒంటి కొలతలతో వచ్చే సౌందర్యం శాశ్వతం కాదని బలంగా నమ్ముతాన్నేను. ప్లస్ సైజ్ మహిళలు కూడా అన్ని రంగాలలో సత్తా చాటుకుంటున్నారు. ఒకరిని ఫాలో కాకూడదు. మనల్ని మనం ఇష్టపడాలి. నచ్చింది తిని, నచ్చిన పనుల్ని చేస్తే సంతోషంగా బతకొచ్చు. ఇతరుల పెదవులపై చిరునవ్వులు
మొలిపించడమే.. అసలైన అందం.

నటిగా నా ప్రయాణంలో కుటుంబసభ్యులతో పాటు తోటి నటులు కూడా ఎంతో అండగా ఉన్నారు. మా మధ్య పోటీ కంటే స్నేహమే ఎక్కువ. టాలెంట్ రౌండ్లో నా డ్యాన్స్ చూసి ‘మీ కళ్లలో గెలవాలనే ఫైర్ కనపడింది’ అని చెప్పారు చాలామంది. నా తదుపరి లక్ష్యం మిస్ వరల్డ్. సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. నన్ను నేను నిరూపించుకొనే ప్రయత్నంలో.. ఏ అవకాశాన్నీవృథా చేసుకోను.
Read More :
“మిస్ ఇండియా కిరీటం దక్కించుకున్న సినీ శెట్టి ఏ ఫుడ్ తీసుకుంటుందో తెలుసా !!”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

