సాధారణంగా మిస్ ఇండియా (Miss India competitions) పోటీల్లోకానీ, ఇతర అందాల పోటీల్లో కానీ విజేతగా నిలిచిన వారిలో చాలా మంది సినీ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటారు. అందాల పోటీల్లో నెగ్గి సిల్వర్ స్క్రీన్‌పై మెరిసిన వారిలో సుస్మితాసేన్, ఐశ్వర్యారాయ్, మానుషిఛిల్లార్తోపాటు ఇంకా చాలా మందే ఉన్నారు. ఇపుడీ ఈ జాబితాలో మరో భామ చేరిపోనుందా..? అంటే అవుననే అంటున్నారు సినీ జనాలు. ఇంతకీ ఎవరి కోసం ఈ టాపిక్ తెరపైకి వచ్చిందనే కదా మీ డౌటు.
ఇంకెవరూ..ఇటీవలే (ఫెమినా మిస్ ఇండియా-2022) మిస్ ఇండియా పోటీల్లో విజేతగా నిలిచింది బెంగళూరు సుందరి సిని శెట్టి (Sini Shetty). మిస్ ఇండియా కిరీటాన్ని పెట్టుకుని..ఓవర్ నైట్ సెన్సేషన్ అయిపోయింది సిని శెట్టి. ఈ భామకు హీరోయిన్ అయ్యే అవకాశం పుష్కలంగా ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదని చాలా మంది ట్రేడ్ పండితులు తెగ చర్చించుకుంటుండగానే క్రేజీ న్యూస్ ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
కన్నడతోపాటు తెలుగు ఫిల్మ్ మేకర్స్ (Telugu Filmmakers) సినిమా ఆఫర్లతో సినీ శెట్టిని సంప్రదించారన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. సినీ శెట్టి సినిమాల్లో ఎంట్రీ ఇస్తుందా..? ఒకవేళ వస్తే ఎలాంటి సినిమాతో ఆడియెన్స్ ను పలుకరించబోతుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.