Mrunal Thakur | ఇండస్ట్రీలో ఎక్కువకాలం ఉండాలంటే అలా చేయాల్సిందే : మృణాల్ ఠాకూర్
Mrunal Thakur | ‘సీతారామం’తో తెలుగు తెరపై తళుక్కుమన్నది మరాఠీ ముద్దుగుమ్మ.. మృణాల్ ఠాకూర్! మొదటి సినిమాతోనే.. ఏదో మ్యాజిక్ చేసేసింది. హోమ్లీ లుక్స్ - యాక్టింగ్ స్కిల్స్‌తో వరుస ఆఫర్లు దక్కించుకుంటున్నది. దక్షిణాది - ఉత్తరాది తేడా లేకుండా.. రెండు ఇండస్ట్రీలలోనూ దుమ్మురేపుతున్నది. బుల్లితెరపై సీరియళ్లతో కెరీర్ మొదలుపెట్టి.. వెండితెరను ఏలుతున్న ఈ నయా ‘యష్ణ’తో మాటాముచ్చట!
Mrunal Thakur |‘సీతారామం’తో తెలుగు తెరపై తళుక్కుమన్నది మరాఠీ ముద్దుగుమ్మ.. మృణాల్ ఠాకూర్! మొదటి సినిమాతోనే.. ఏదో మ్యాజిక్ చేసేసింది. హోమ్లీ లుక్స్ – యాక్టింగ్ స్కిల్స్‌తో వరుస ఆఫర్లు దక్కించుకుంటున్నది. దక్షిణాది – ఉత్తరాది తేడా లేకుండా.. రెండు ఇండస్ట్రీలలోనూ దుమ్మురేపుతున్నది. బుల్లితెరపై సీరియళ్లతో కెరీర్ మొదలుపెట్టి.. వెండితెరను ఏలుతున్న ఈ నయా ‘యష్ణ’తో మాటాముచ్చట!
చిత్ర పరిశ్రమలో ఎక్కువ రోజులు కొనసాగాలంటే.. గ్లామర్ మెయింటెయిన్ చేయాల్సిందే! అందుకోసం అందరిలాగే నేను కూడా బ్యూటీ టిప్స్ ఫాలో అవుతాను! ముఖానికి పసుపు రాసుకుంటా. తాజా పండ్లతో ఫేస్‌ప్యాక్ వేసుకుంటా. ముఖం కాంతిమంతంగా ఉండేందుకు బియ్యం కడిగిన నీళ్లను ముఖంపై స్ప్రే చేసుకుంటా! ఇదో కొరియన్ చిట్కా!
‘కేన్స్’లో రెడ్ కార్పెట్‌పై నడవడం నటులకు ఒక కల. 2022లో కేన్స్ ఫెస్టివల్ సమయంలో నేను షూటింగ్లో ఉన్నా. వచ్చే ఏడాది ఎలాగైనా.. కేన్స్ ఫెస్టివల్లో పాల్గొనాలని నాకు నేనే ఒక ప్రామిస్ చేసుకున్నా! అనుకున్నట్టు గానే.. 2023లో కేన్స్‌లో సందడి చేశా!
టీవీ నటులకు సినీ పరిశ్రమలో అవకాశాలు చాలా తక్కువగా వస్తుంటాయి! వచ్చినా.. చిన్నచిన్న క్యారెక్టర్లకే అవి పరిమితం. ఇక్కడ నిలదొక్కుకోవడం కూడా కష్టమే! అయితే, ప్రతిభకు అదృష్టం కూడా తోడైతే.. ఎక్కడైనా రాణించవచ్చు. దానికి నేనే మంచి ఉదాహరణ! బుల్లితెర నటీనటులు బాలీవుడ్లో రాణించలేరనే అపోహను చెరిపేశా!
నాన్నే నా జీవితానికి మూలస్తంభం. ఆయనే నా ఇన్స్పిరేషన్. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం.. ఆయన నేర్పించిన విలువలే! చిన్నప్పటి నుంచీ ఒక్కటే చెప్పేవారు.. ‘ఎన్ని సమస్యలు ఎదురైనా
జీవితాన్ని హాయిగా నవ్వుతూగడపాలి!’. ఆ ఫిలాసఫీని పాటించడం వల్లే.. నేను ఇక్కడిదాకా రాగలిగాను.
బుల్లితెరతో ప్రారంభమై వెండితెర వరకూ వచ్చిన ఈ ప్రయాణం.. ఎంతో అందమైంది, అనూహ్యమైంది! ఎన్నో అడ్డంకులు దాటుకొని, స్వయంకృషితో ఇక్కడిదాకా వచ్చా! పరిశ్రమలో ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలి. మంచి సినిమాలు, మంచిమంచి పాత్రలు చేయాలి.
ప్రేక్షకులకు నా పేరు గుర్తురాక పోయినా ఫర్వాలేదు. కానీ, నన్ను చూడగానే.. సీత, యష్ణ ఇలా సినిమాల్లో నేను చేసిన పాత్రలు వారి మదిలో మెదిలితే చాలు! అందుకోసం ఎంత కష్టపడటానికైనా నేను సిద్ధమే!
రోజులు చాలా బిజీగా గడుస్తున్నాయి. నాకోసం నేనే సమయాన్ని కేటాయించుకోలేక పోతున్నా! చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా.. విశ్రాంతి తీసుకోలేక పోతున్నా! ఈ బిజీలైఫ్ కోసమే నేను ఎన్నో ఏళ్లు ఎదురుచూశా!
‘రోజూ పనికి వెళ్లాలి. నేను ఇష్టపడే పనినే చేయాలి!’ ఇదే నా ఫిలాసఫీ.
ఫ్యాషన్‌లో ప్రయోగాలు నాకిష్టం. నా లుక్స్‌కు, ఈవెంట్స్‌కు తగ్గట్టుగా కొత్తకొత్త ట్రెండ్స్ట్రై చేస్తుంటా! అయితే, ఆ ఫ్యాషన్ డిజాస్టర్ కాకుండా చూసుకుంటా! ఎన్ని వచ్చినా.. చీరకట్టులోనే నేను కంఫర్ట్‌గా ఉంటా! అదే నా ఫేవరేట్ ఫ్యాషన్!
సీతారామం, హాయ్ నాన్న.. తర్వాత నన్ను మరిన్ని వైవిధ్యమైన పాత్రల్లో చూడాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. వారిని అలరించడానికి నా మనసుకు దగ్గరైన క్యారెక్టర్లు, సినిమాలు చేయడంపై దృష్టిట్టాను. అలాంటి మంచి కథలు ఎప్పుడైనా, ఎక్కడైనా తలుపు తట్టొచ్చు. రాగానే.. వాటిని వెంటనే అందిపుచ్చుకోవాలి.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

