రోజుకొక ఫ్యాషన్ మార్కెట్లోకి వచ్చి హల్చల్ చేస్తుంటుంది. అలాంటి ఫ్యాషన్ ట్రెండ్‌ని ఫాలో అవుతూ, స్నేహితుల మధ్య గొప్పగా ఫీలవుతుంటుంది యువత. తాజాగా ప్యాంట్లలో కొన్నిరకాల ప్యాటర్న్లు దూసుకెళ్తున్నాయి. సాధారణంగా ప్యాంట్లలో హుందాతనంతో కూడిన లుక్ రావాలంటే, సాదా షర్ట్, సాదా ప్యాంట్ వేసుకోవాలనుకుంటారు. కానీ ప్రింటెడ్ ప్యాంట్స్లోనూ హుందాతనాన్ని తీసుకొస్తున్నారు యువతీయువకులు.

ఈ డిజైన్‌లో అడ్డం, నిలువు గీతల ప్యాటర్న్స్ ఉంటాయి. అలాగే ఈ ప్లెయిడ్ ప్యాంట్లనే స్కాటిష్ కిల్ట్ లేదా పంక్ రాకర్స్ ప్యాంట్స్ అని కూడా అంటారు. దీనికి ప్లెయిడ్ అనే పేరు రావడానికి కారణం, స్కాట్లాండ్ దేశంలో సంప్రదాయ చద్దరిని ప్లెయిడ్ అనడం. అదే డిజైన్‌లో ఉండటంవల్ల ఈ ప్యాంట్‌ను ప్లెయిడ్ అని పిలుస్తున్నారు. ఈ రకం ప్యాంట్లకు మ్యాచింగ్ షర్ట్ వేసుకుంటే, చాలా అందంగా, హుందాతనంగా ఉంటుంది. వీటిని ఎక్కువగా ఉన్నితో ఇంట్లోనే నేసి డై వేసి తయారు చేస్తారు.

ఏ డిజైన్ షర్ట్ మీదకైనా ఈ స్ట్రైప్డ్ ప్యాంట్ నప్పుతుంది. నిలువు చారలతో ట్రెండ్ సృష్టిస్తున్న ఈ ప్యాంట్లు అందర్నీ ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల కాలంలోనే ఈ ైస్టెల్లో షర్ట్స్ కూడా బాగా అమ్ముడుపోయాయి. ఇప్పుడు ప్యాంట్లు మార్కెట్లోకి వచ్చాయి. రంగురంగుల ప్యాంట్లపై, వేర్వేరు రంగుల్లోని నిలువు చారలు అందంగా కనిపిస్తాయి. ముఖ్యంగా వీటితో యువత ఫార్మల్ పార్టీలకూ వెళ్తున్నది. సస్పెండర్ల మోడళ్లలో వచ్చే స్ట్రైప్ ప్యాంట్లకు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు.

పూల డిజైన్‌తో ఉన్న షర్ట్లు వేసుకోవడం చాలామందికి అలవాటు. అందుకే పూల చొక్కా అని సరదాగా ఆటపట్టిస్తుంటారు కూడా. అయితే ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలోకి వచ్చి అందర్నీ ఆకట్టుకుంటున్నాయి పూల ప్రింటెడ్ ప్యాంట్లు. పూలపూల డిజైన్లతో వస్తున్న ప్యాంట్లను అమ్మాయిలతో పాటు అబ్బాయిలూ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వాటిపైకి పూల డిజైన్ షర్ట్స్‌తో పాటు ప్లెయిన్‌వి కూడా నప్పుతున్నాయి. యువకులు ఫ్లోరల్ డిజైన్గల బ్లేజర్స్, అమ్మాయిలు ఫ్లోరల్ స్కర్ట్స్ వేసుకుని ఆఫీసులకూ వెళ్తున్నారు.

ఈ డిజైన్‌లో రకరకాల ఆకారాలు, గణిత శాస్ర్తానికి సంబంధించిన వస్తువులు, చిత్రాలు ఉంటాయి. ఉదాహరణకు చతురస్రాకారాలు, త్రిభుజాకారాలతో కూడిన డిజైన్లు ఆకర్షణీయంగా ఉంటాయి. రకరకాల ఆకారాలను కలుపుతూ, వంపులతో భలే అందంగా తయారు చేస్తున్నారు డిజైనర్లు. వీటికి ప్రత్యేకించి ఒక ఫ్యాన్‌బేస్ ఉంటుంది. ఒకప్పుడు ఇవి ఎక్కువగా చీరలు, పురుషుల చొక్కాలపై ఉండేవి. ఇప్పుడు అవే ప్యాంట్ల మీదకు వచ్చి ట్రెండ్ సృష్టిస్తున్నాయి.