నీలా బతికే.. బలమివ్వు!

వ్యక్తిత్వ వికాస పుస్తకాలతో పన్లేదు.
కౌన్సెలర్ల అపాయింట్మెంట్ అవసరం లేదు.
ఆధునిక గురు పరంపర చుట్టూ ప్రదక్షిణల ప్రయాసే వద్దు.
పీవీ జీవితం ఒక్కటి చాలు. ఆయనెలా జీవించారో
తెలుసుకోగలిగితే.. పరిపూర్ణంగా బతికేయవచ్చు.
వంగరలోని చెక్క కుర్చీ, పీఎంవోలోని ప్రధాని పీఠం..
రెండూ ఒకటే ఆయనకు.
తెలంగాణ మాండలికాన్ని ఎంతగా ప్రేమించారో,
కీట్స్ కవిత్వాన్నీ అంతే ఇష్టపడ్డారు.
పదవి వచ్చిననాడు పొంగి పోలేదు.
పీఠం దిగిననాడు కుంగి పోలేదు.
విశ్వభాషలు తెలిసిన మౌని.
ప్రపంచం పోకడ ఎరిగిన జ్ఞాని.
తామరాకుమీద నీటిబిందువు.
బిందువులా కనిపించే అపార సింధువు.
పుస్తక ప్రియుడు. నడిచే గ్రంథాలయం.
అంతర్ముఖుడు. బహుముఖ ప్రజ్ఞావంతుడు.
రచయిత. తానే ఓ గెలుపు కథ.
‘ఓ కర్మయోగీ..
ఆర్థిక సంస్కరణలతో ఉద్యోగాలు..
గ్లోబలైజేషన్‌తో సాంకేతికత..
అందించిన ఆ చేతులతోనే
నీలోని నిరాడంబరత..
నీదైన నిశ్చలతత్వం..
మాకూ ప్రసాదించు!
నీలా బతికే బలమివ్వు
మళ్లీ పుడతానన్న అభయమివ్వు!’
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

