ఆమె జ్ఞాపకం.. గిటారై ఎదిగింది!
తాజ్‌మహల్ నిర్మించి ముంతాజ్ పట్ల షాజహాన్ ప్రేమను చాటుకున్నాడు. నీతా ముచ్చట తీర్చడానికి ముఖేష్ అంబానీ యాంటిలా కట్టించాడు. అర్జెంటీనాకు చెందిన రైతు పెడ్రో మార్టిన్ ఉరెతా తన భార్యకు ప్రేమతో పెంచిన గిటార్ వనం ఇది!
తాజ్‌మహల్ నిర్మించి ముంతాజ్ పట్ల షాజహాన్ ప్రేమను చాటుకున్నాడు. నీతా ముచ్చట తీర్చడానికి ముఖేష్ అంబానీ యాంటిలా కట్టించాడు. అర్జెంటీనాకు చెందిన రైతు పెడ్రో మార్టిన్ ఉరెతా తన భార్యకు ప్రేమతో పెంచిన గిటార్ వనం ఇది! తన భార్యకు ఇష్టమైన గిటార్‌తో ప్రేమను చాటుతూ ఆమె జ్ఞాపకాలను శాశ్వతం చేయడానికి రైతు ఆవిష్కరించిన సతత హరిత కళాఖండం ఇది.
లోపల కలియతిరిగితే చిట్టడవిలో ఉన్నట్టే ఉంటుంది. ఆకాశంలోంచి చూస్తే అదే ఒక గిటార్‌లా కనిపిస్తుంది. ల్యాండ్ ఆర్ట్‌లో మాస్టర్ పీస్‌గా చెప్పుకొనే ఈ హరిత కళాఖండం వంటిది మరెక్కడా లేదు! ఇంతకూ ఇదెక్కడ ఉందంటే..అర్జెంటీనా దేశం కార్డోబా ప్రావిన్స్ లేవల్లే పట్టణ శివారులోని పంపాస్లో ఉంది.
చెదిరిన జీవితం..
పంపాస్ పల్లపు ప్రాతం. ఇక్కడి భూములు సారవంతమైనవి. పంటలు చక్కగా పండుతాయి. తన వ్యవసాయ క్షేత్రంలో పంటలు పండిస్తూ పెడ్రో మార్టిన్ భార్యాపిల్లలతో సంతోషంగా ఉండేవాడు. ఒకానొక రోజున తన భార్య గ్రేసిలా మెదడులో రక్తనాళాలు ఉబ్బి చనిపోయింది. 1977లో చనిపోయేనాటికి గ్రేసిలా వయసు పాతిక సంవత్సరాలే. చిన్న వయసులోనే భార్యను కోల్పోయిన పెడ్రో మార్టిన్ ఒంటరి జీవితంలో భార్య జ్ఞాపకాలతో బతుకుతున్నాడు. అప్పటికే వాళ్లకు ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ పిల్లల బాగోగులు చూసుకుంటూ, వ్యవసాయ పనులు చేసుకుంటూ పెడ్రో మార్టిన్ బతుకు వెళ్లదీస్తున్నాడు.

చెరగని జ్ఞాపకం
భార్య చనిపోయి రెండేళ్లు గడిచినా పెడ్రో మార్టిన్ ఆలోచనల్లోంచి గ్రేసిలా జ్ఞాపకాలు చెరిగిపోలేదు. ఆమె ప్రేమకు కృతజ్ఞతగా ఓ అందమైన స్మారకాన్ని నిర్మించాలని కోరుకున్నాడు. అది రాయి, సిమెంట్, చెక్కతో కాదు. అందమైన ఉద్యానవనంలా ఉండాలనుకున్నాడు. అర్బన్ ఫారెస్ట్, ఉద్యాన వనాలకు భిన్నంగా తన భార్యకు ఇష్టమైన గిటారు రూపంలో దానిని తీర్చిదిద్దాలని భావించాడు. గ్రేసిలాకు సంగీతం అంటే ఇష్టం. సంగీత వాద్యాలలో గిటార్ ఆమెకు ప్రత్యేక అభిమానం. అందుకే, గిటారు ఆకారం ఏర్పడేలా తన వ్యవసాయ క్షేత్రంలో ఏడు వేల మొక్కలు నాటాడు. గిటారులో ఉండే బాడీ రూపం కోసం సైప్రస్ మొక్కలు (అశోక) నాటాడు.
నెక్ మీద వంపులేకుండా పొడవుగా ఉండే తంత్రుల్లా యూకలిప్టస్ (దేవదారు) చెట్లు పెంచాడు. ఈ చెట్లు నిటారుగా పెరిగినా కొమ్మలు విస్తరించకుండా ఉంటాయి. అందువల్ల యూకలిప్టస్ వల్ల నెక్‌పై తంత్రులు స్పష్టంగా కనిపించేలా ఈ వనం రూపొందింది. ఆకాశంలోని నక్షత్రాల మధ్య ఉన్న తన ప్రియురాలికి గుర్తుగా నిర్మించిన ఈ గిటారు మధ్యలో ఉండే సౌండ్హోల్ నక్షత్రాకారంలో కనిపించేలా శ్రద్ధ తీసుకున్నాడు.
స్వర్గానికి ప్రేమ సందేశం!
ప్రేమ వనం పెరిగి పెద్దదైంది. 1.07 కిలోమీటర్ల పొడవున పెంచిన చెట్ల వరుసలతో రూపొందిన గిటార్ వనం ఓ అబ్బురంగా మారిపోయింది. భూమిపై ఉన్న విరిసిన ఈ వనం తన ప్రేమను స్వర్గంలో ఉన్న భార్యకు చేరవేస్తుందని పెడ్రో మార్టిన్ ఆశ. మార్టిన్ మనోవ్యథకు ఈ వనం సాంత్వన చేకూర్చింది. కానీ, అంత ప్రేమతో పెంచిన గిటారు వనం రూపాన్ని ఆకాశంలోంచి ఆయన ఎప్పుడూ చూడలేదు. అతనికి విమానయానం అంటే భయం. ఆయన స్నేహితులు తీసిన చిత్రాలలోనే తను పెంచిన వనం ఆకారాన్ని చూసి అబ్బురపడిపోతుంటాడు.

నాసా(అమెరికా), మెటి (జపాన్) కలిసి ప్రయోగించిన టెర్రా శాటిలైట్ తీసిన హైరెజల్యూషన్ ఫొటోలో పెర్డో మార్టిన్ వ్యవసాయ క్షేత్రం ఇలా కనిపిస్తోంది.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
Hyderabad | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై యాక్సిడెంట్.. ఒకదానికొకటి ఆరు కార్లు ఢీ
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

