హెల్త్ బిట్స్
జుట్టు నుంచి జీర్ణవ్యవస్థ వరకు ఉసిరి లాభాలే వేరు. చర్మానికి కూడా ఉసిరి గొప్ప మేలు చేస్తుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. యాంటీఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలతోపాటుగా మెలనిన్ను అదుపు చేసే తత్వం ఉసిరిని చర్మసౌందర్య సిరిగా చేశాయి.
ఆరోగ్యసిరి.. ఉసిరి
జుట్టు నుంచి జీర్ణవ్యవస్థ వరకు ఉసిరి లాభాలే వేరు. చర్మానికి కూడా ఉసిరి గొప్ప మేలు చేస్తుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. యాంటీఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలతోపాటుగా మెలనిన్ను అదుపు చేసే తత్వం ఉసిరిని చర్మసౌందర్య సిరిగా చేశాయి. ఉసిరి రసం, తేనె, పసుపు – ఈ మూడింటి కలయికతో తయారుచేసుకునే ఫేస్ ప్యాక్ మొటిమలు మచ్చలు పోయేందుకు సాయపడుతుంది. ఉసిరిలోని విటమిన్-సి, తేనెలోని యాంటీఆక్సిడెంట్స్, పసుపులోని కర్క్యుమిన్ నల్లటి మచ్చలను కలిగించే హైపర్ పిగ్మంటేషన్ని అదుపుచేస్తాయి. చర్మం మెరిసేలా, మొటిమలు తగ్గేలా దోహదపడతాయి. ఉసిరి, టమాట గుజ్జు చర్మానికి కాంతినిస్తాయి. టమాటాలోని బీటా కెరోటిన్, లైకోపీన్ స్వేద రంధ్రాలను శుద్ధి చేస్తాయి. రోజ్ వాటర్లో కలిపిన ఉసిరి రసం జిడ్డు చర్మానికి మేలు.
ఎన్నో లాభాల.. ఎల్లో టీ
‘గ్రీన్ టీ’ తెలుసు. మరి.. ఎల్లో టీ గురించి విన్నారా? రాబోయే రోజుల్లో ఇదే ఓ ట్రెండ్ కావచ్చు. ఎందుకంటే, గ్రీన్ టీకి ఉన్న ఆరోగ్య గుణాలన్నీ ఇందులోనూ ఉన్నాయి. చైనాలో ప్రాచుర్యం పొందిన ఈ ఎల్లో టీలో జున్షాన్, హొషాన్ లాంటి స్థానిక మూలికలు ఉంటాయి. పేరుకు తగిన రంగులో మెరిసిపోయే ఎల్లో టీలోని యాంటీఆక్సిడెంట్స్.. శరీరంలో ఉన్న ప్రీ రాడికల్స్ అనే ప్రమాదకరమైన కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. వయసుతోపాటు వచ్చే సమస్యల్ని దూరంగా ఉంచుతాయి. ఎల్లో టీలోని పాలిఫినాల్స్ గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడమే కాకుండా, హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కటెచిన్స్ అనే రసాయనాలు అధిక కొవ్వును కరిగించి ఊబకాయాన్ని తగ్గిస్తాయి. థియానిన్ అనే అమైనో యాసిడ్ వల్ల ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. టానిన్స్ అనే రసాయనం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఇంతేకాదు! ఎల్లో టీ వల్ల పళ్ల నుంచి చర్మం వరకు శరీరం మొత్తానికీ మేలు జరుగుతుందని చెబుతున్నారు.
కీళ్లవాతానికి ఆహారం
ఆర్థరైటిస్కు, ఆహారానికి దగ్గర సంబంధం ఉందని పరిశోధనలు తేల్చి చెప్పాయి. పాలకూర లాంటి ఆకుకూరల్లో సమృద్ధిగా లభించే యాంటీ ఆక్సిడెంట్లకు, వాపును తగ్గించే గుణం ఉంటుంది. స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీ లాంటి బెర్రీలకూ కీళ్లను ఆరోగ్యంగా ఉంచే లక్షణం ఉంది. పసుపులోని కర్క్యుమిన్ అనే రసాయనానికి వాపునే కాదు, నొప్పిని తగ్గించే శక్తి కూడా ఉంది. అల్లం కూడా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. బాదంపప్పులు, వాల్నట్స్, చియా గింజలు లాంటి వాటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలం. ఇవి కీళ్లనొప్పులకు ఔషధంలా పనిచేస్తాయి. ఆలివ్ ఆయిల్లోని ఒలెకెంథాల్… నొప్పి మాత్ర బ్రూఫిన్తో సరిసమానంగా పనిచేస్తుంది. పాలిఫినాల్స్, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా కలిగిన గ్రీన్ టీతో వాపు, నొప్పి తగ్గుతాయి. పైనాపిల్లోని బ్రొమ్లైన్ అనే రసాయనం కూడా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

