Kavya Thapar | తన నటనకు ఫిదా!
‘ఈ మాయ పేరేమిటో’ అంటూ తెరంగేట్రం చేసి.. కుర్రకారును తన మాయలో పడేసుకున్నది హాట్‌బ్యూటీ కావ్య థాపర్. ‘ఏక్ మినీ కథ’తో టాలీవుడ్లో పెద్ద మార్కులే కొట్టేసింది. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ హీరోయిన్గా మారిపోయింది. రవితేజతో కలిసి ‘ఈగల్'గా దూసుకురాబోతున్న ఈ ముంబై ముద్దుగుమ్మతో మాటాముచ్చట!
Kavya Thapar | ‘ఈ మాయ పేరేమిటో’ అంటూ తెరంగేట్రం చేసి.. కుర్రకారును తన మాయలో పడేసుకున్నది హాట్‌బ్యూటీ కావ్య థాపర్. ‘ఏక్ మినీ కథ’తో టాలీవుడ్లో పెద్ద మార్కులే కొట్టేసింది. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ హీరోయిన్గా మారిపోయింది. రవితేజతో కలిసి ‘ఈగల్’గా దూసుకురాబోతున్న ఈ ముంబై ముద్దుగుమ్మతో మాటాముచ్చట!
భాష ఏదైనా.. నటనను ప్రేమిస్తా. ఇప్పటిరకూ ఐదు భాషల్లో నటించా. మిగిలిన అన్ని భారతీయ భాషల్లోనూ నటించాలని అనుకుంటున్నా.
ఒకవేళ నేను నటిని కాకపోయినా.. ఏదో ఒక క్రియేటివిటీ ఫీల్డ్‌లో ఉండేదాన్ని. ఆర్టిస్ట్‌గానో, ఇంటీరియర్ డిజైనర్గానో, జువెలరీ డిజైనర్గానో సెటిల్ అయ్యేదాన్ని.
జూనియర్ ఎన్టీఆర్ నటన చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన డ్యాన్స్ మైండ్ బ్లోయింగ్! ఇక రామ్‌చరణ్, మహేశ్‌బాబు, అల్లు అర్జున్ అంటే అభిమానం. నిజానికి టాలీవుడ్లో ప్రతిహీరోకూ.. తమదైన ప్రత్యేకత ఉంది. అదే సమయంలో క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తారు. ప్రొఫెషనలిజం అపారం. ఎవరి క్రేజ్ వారిదే!
ఫిట్నెస్ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటా. నిమ్మకాయ రసంతోనే రోజును ప్రారంభిస్తా. అలా అని కడుపు కట్టేసుకునేరకం కాదు. నేను మంచి ఫుడీ! అయితే, పూర్తి శాకాహారిని. వెజ్ దమ్ బిర్యానీ చాలా ఇష్టంగా తింటా.
నాకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. గురూజీ బోధనలు వింటాను. ఆయన మాటల ప్రభావంతోనే మాంసాహారాన్ని విడిచిపెట్టాను. మనం తినేందుకు ఆ దేవుడు ఎన్నో ఇచ్చాడు. అలాంటప్పుడు.. ఒక ప్రాణిని చంపడం ఎందుకు? శాకాహారంలోనూ మాంసాహారానికి మించిన పోషకాలు ఉంటాయి. రుచికి బానిసగా మారి.. ఒక జీవిని చంపడం మహాపాపం అని నా అభిప్రాయం.
ఈ ఏడాది వరుసగా సినిమాలు ఉన్నాయి. విరామం లేకుండా పనిచేస్తున్నా. వచ్చే నెల ‘ఈగల్’తోపాటు ‘ఊరిపేరు భైరవకోన!’ విడుదల కానుంది. ఆ తర్వాత తెలుగులోనే ఇంకో సినిమా రాబోతున్నది.
రవితేజ ఎనర్జిటిక్ హీరో! ఆయనతో కలిసి పనిచేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. ఈగల్ కోసం నన్ను సంప్రదించగానే.. నా కల నిజమైందని మురిసిపోయా. వెంటనే ఒప్పేసుకున్నా! కేవలం స్క్రీన్ షేర్ చేసుకోవడమే కాదు.. రవితేజ నుంచి ఎన్నో విషయాలు తెలుసుకున్నా! పని ఒత్తిడికి గురికావద్దనీ, దేన్నీ సీరియస్‌గా తీసుకోవద్దనీ ఆయన్ను చూసే నేర్చుకున్నా!
‘రంగస్థలం’ తర్వాత రామ్‌చరణ్‌కు పెద్ద అభిమానిగా మారిపోయా.ఆ సినిమాలో ఆయన నటనకు ఫిదా అయిపోయా. రామ్‌చరణ్‌తో కలిసి నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. రాజమౌళి దర్శకత్వంలో పనిచేయాలని ఉంది.
నా ఎనర్జీనే నా బలం. అయితే కొన్నిసార్లు అదే నాకు ఇబ్బందుల్ని తెచ్చిపెట్టేది. చిన్నప్పడు నేను హైపర్ యాక్టివ్‌గా ఉండేదాన్ని. ఎదుటివాళ్లు ఏ చిన్న తప్పు చేసినా.. వాళ్లపై అరిచేసేదాన్ని. ఆ తర్వాత.. బాధపడేదాన్ని.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dada | బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. ‘దాదా’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఖరారు,ఎప్పుడంటే?
Hanuman Ansh | ఓటీటీలోకి రూ.440 కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు!
Revanth Reddy | రేవంత్‌ను కలిసిన ఆంధ్రా అభిమాని.. ఏపీకి నీళ్లు వదిలినందుకు కృతజ్ఞతగా వచ్చాడని సెటైర్లు
Voter List | తెలంగాణ ఓటర్లకు ఎన్నికల సంఘం మరో ఛాన్స్.. ఓటు కోసం ఈ తేదీలోగా దరఖాస్తు చేసుకోండి!
IND vs NZ 2nd ODI | వర్షం కారణంగా 47 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గిల్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

