పుస్తక సమీక్ష
ప్రపంచ చరిత్రలో ఎందరో చక్రవర్తులు, మేధావులు పుట్టారు. కానీ, మానవాళిని అంధకారపు అగాధాల నుంచి వెలుగుబాటలోకి నడిపించి, అల్లాహ్ ఆరాధన వైపు మళ్లించిన మహనీయుడు ఒక్కరే. వారు సకల లోకాలకు కారుణ్యంగా వచ్చిన అంతిమ ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ ముస్తఫా (సల్లల్లాహు అలైహి వసల్లం). అటువంటి మహోన్నత వ్యక్తిత్వ జీవిత చరిత్రను అత్యంత సరళంగా, హృద్యంగా పరిచయం చేసే గ్రంథం ‘విశ్వ కారుణ్యమూర్తి’.
- మానవజాతికి దిశానిర్దేశం
ప్రపంచ చరిత్రలో ఎందరో చక్రవర్తులు, మేధావులు పుట్టారు. కానీ, మానవాళిని అంధకారపు అగాధాల నుంచి వెలుగుబాటలోకి నడిపించి, అల్లాహ్ ఆరాధన వైపు మళ్లించిన మహనీయుడు ఒక్కరే. వారు సకల లోకాలకు కారుణ్యంగా వచ్చిన అంతిమ ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ ముస్తఫా (సల్లల్లాహు అలైహి వసల్లం). అటువంటి మహోన్నత వ్యక్తిత్వ జీవిత చరిత్రను అత్యంత సరళంగా, హృద్యంగా పరిచయం చేసే గ్రంథం ‘విశ్వ కారుణ్యమూర్తి’. సుప్రసిద్ధ పండితులు సయ్యద్ సులేమాన్ నద్వీ రాసిన మూల గ్రంథానికి, ముహమ్మద్ అజీజుర్రహ్మాన్ చేసిన తెలుగు అనువాదం పాఠకులకు ఒక వరం. ఈ అనువాదం ఎంతో చక్కగా, సరళమైన భాషలో సాగింది. మూలంలోని భావం ఏమాత్రం చెదరకుండా, తెలుగు పాఠకులకు చేరువయ్యేలా సాగిన ఈ కృషి అభినందనీయం. భాషలో ఉండే హుందాతనం, శైలిలో ఉండే ప్రవాహం పాఠకుడిని పుస్తకంతో మమేకం చేస్తాయి.
పుస్తకంలోని విశేషాలు:
తౌహీద్-దారిచూపే దీపం: అల్లాహ్ ఏకత్వాన్ని చాటిచెప్పే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జీవన గమనాన్ని అత్యంత ప్రభావవంతంగా చిత్రించారు.
నైతిక సౌధం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అఖ్లాఖ్ (నైతికత), మానవీయ విలువలు, సామాజిక బాధ్యతలు, శత్రువుల పట్ల చూపిన క్షమాగుణం వంటి అంశాలు చదువరులను పునీతం చేస్తాయి.
ప్రేరణాత్మక ఘట్టాలు: వలస, యుద్ధాలు, త్యాగాలు ఈ పుస్తకంలో పాఠకులకు ఒక కొత్త శక్తిని, ఈమాన్ (విశ్వాసం)ను ప్రసాదిస్తాయి.
నేటి యాంత్రిక జీవనంలో, విలువలు మంటగలుస్తున్న తరుణంలో, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చూపిన ‘కారుణ్య’ మార్గం మనకు దిక్సూచి. మీరు విద్యార్థి అయితే జ్ఞాన సముపార్జనలో, ఉపాధ్యాయులు అయితే బోధనలో, వ్యాపారి అయితే నిజాయితీలో, నాయకులు అయితే న్యాయం అందించడంలో ప్రవక్త జీవితం నుంచి ఎలా ప్రేరణ పొందాలో ఈ పుస్తకం కళ్లకు కడుతుంది.
మిలాద్-ఉన్-నబీ సందర్భంగా, ఆయాత్ ఇస్లామిక్ పబ్లికేషన్స్ వారు ఈ అపురూప గ్రంథంపై 50 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నారు!
విశ్వ కారుణ్యమూర్తి (సల్లల్లాహు అలైహి వ సల్లం)
పేజీలు: 176, ధర: రూ. 260
ప్రతులకు: 78428 55736
-ముహమ్మద్ ముజాహిద్, 96406 22076
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

