Yashmeen Chauhan | బాలీవుడ్ తారలకు, ఫోర్బ్స్ సంపన్నులకు ఈమెనే పర్సనల్ ట్రైనర్.. ఇదీ ఆమె జర్నీ!
Yashmeen Chauhan | యాస్మిన్ చౌహాన్.. పేరు వినగానే సిక్స్ ప్యాక్ మగువ కళ్లముందు దర్శనమిస్తుంది. జిమ్‌తో ఆమె అనుబంధానికి పాతికేండ్లు నిండాయి. గురుగ్రామ్‌లోని స్కల్ప్ట్ జిమ్ వ్యవస్థాపకురాలు తను. జాతీయ చానెల్స్‌లో ఫిట్నెస్ గురు హోదాలో పాఠాలు కూడా చెప్పింది.
Yashmeen Chauhan | యాస్మిన్ చౌహాన్.. పేరు వినగానే సిక్స్ ప్యాక్ మగువ కళ్లముందు దర్శనమిస్తుంది. జిమ్‌తో ఆమె అనుబంధానికి పాతికేండ్లు నిండాయి. గురుగ్రామ్‌లోని స్కల్ప్ట్ జిమ్ వ్యవస్థాపకురాలు తను. జాతీయ చానెల్స్‌లో ఫిట్నెస్ గురు హోదాలో పాఠాలు కూడా చెప్పింది. యాస్మిన్ పక్కా మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది. కాలేజీ రోజుల్లో టైఫాయిడ్‌తో ఇబ్బంది పడింది. ఆ తర్వాత బాగా లావైపోయింది. జుట్టు ఊడిపోయింది. ఆ ఆకారం చూసి స్నేహితులు నవ్వేవారు. దీంతో ఫిట్నెస్ కోసం జిమ్‌లో చేరింది. కానీ, నెలనెలా ఫీజు కట్టడం కష్టమయ్యేది.
దీంతో మానెయ్యాలని అనుకుంది. తన పట్టుదల చూసి జిమ్ యజమాని ఓ ఆఫర్ ఇచ్చాడు. ఖాళీ సమయంలో ట్రైనర్‌గా పనిచేయమని సలహా ఇచ్చాడు. ఆ అనుభవంతో ఓ ప్రపంచశ్రేణి జిమ్‌లో ఉద్యోగం వచ్చింది. ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. ప్రస్తుతం ఆమె చాలామంది బాలీవుడ్ తారలకు, ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలోని కుటుంబాలకు వ్యక్తిగత ట్రైనర్. చికెన్ టిక్కా, పాన్ కేక్, రాజ్మా, ఎయిర్ఫ్రైలో ఉడికించిన ఆలూ తనకు ఇష్టమైన రుచులని చెబుతుంది. పోషకాల కోసం విటమిన్ మాత్రల మీద ఆధారపడటం తనకు నచ్చదనీ, కూరగాయలు, తాజా పండ్లను భోజనంలో భాగం చేసుకోవాలని సలహా ఇస్తుంది. ‘భారతదేశంలో తొలి మహిళా జిమ్ ఓనర్ నేనే కావచ్చు’ అంటున్నప్పుడు ఆమె స్వరంలో కించిత్ గర్వం.
Read Today's Latest Success-story News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Urea Fertilizer Sale | ఎరువుల విక్రయంలో వ్యాపారి ఇష్టారాజ్యం.. యూరియాతో పాటు నానో డీఏపీ కొనాల్సిందేనని షరతు!
Bigg Boss 10 | మాజీ కంటెస్టెంట్లతో హౌస్‌లో హీటెక్కిన నామినేషన్లు.. ముకేష్‌పై త్రిగుణ్ ఫైర్, ఈ వారం డబుల్ ఎలిమినేషన్?
Satvika Veeravalli | చూపు తిప్పుకోనివ్వని అందం.. ‘ఆకాశంలో ఒక తార’ హీరోయిన్ సాత్విక వీరవల్లి ఫొటోలు
Congress | కాంగ్రెస్ నేతల దౌర్జన్యం.. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల ఇంటిపై దాడికి యత్నం!
Vote for Note | ఓటుకు నోటు కేసు 25కు వాయిదా
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

