దర్శకుడిదే భారం
‘సీరియల్స్' అంటేనే పుట్టెడు కష్టాలు, బకెట్లకొద్దీ కన్నీళ్లు. ఆ పాత్రల్లో నటించడం మరీ కష్టం. కానీ, ‘ఇష్టమైన పనేదీ కష్టం కాదండోయ్' అంటున్నారు చిన్నతెర నటి మౌనిక.
‘సీరియల్స్’ అంటేనే పుట్టెడు కష్టాలు, బకెట్లకొద్దీ కన్నీళ్లు. ఆ పాత్రల్లో నటించడం మరీ కష్టం. కానీ, ‘ఇష్టమైన పనేదీ కష్టం కాదండోయ్’ అంటున్నారు చిన్నతెర నటి మౌనిక. కెరీర్ కోసం ఏకంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాన్నే వదిలిపెట్టిన ఈ తళుకుల తార జెమినీ టీవీలో ఈ నెల 25 నుంచి ప్రసారం కానున్న ‘చి.ల.సౌ. స్రవంతి’ సీక్వెల్లో టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఆ ముచ్చట్లు..
నేను అచ్చమైన తెలుగమ్మాయిని. హైదరాబాద్‌లో చదువుకున్నాను. వెస్ట్రన్ డ్యాన్స్ అంటే ఇష్టం. స్కూల్ డేస్ నుంచి కాలేజ్ లైఫ్ వరకు.. ఏ కల్చరల్ ఈవెంట్ జరిగినా నా ప్రోగ్రామ్ ఉండాల్సిందే. బీటెక్ చదువుతున్నప్పుడే ఒక షార్ట్ ఫిల్మ్‌లో అవకాశం వచ్చింది. తెలిసిన వాళ్లు అడిగితే కాదనలేక పోయాను. నటిస్తూ నటిస్తూ యాక్టింగ్ నేర్చుకున్నాను. ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకపోయినా.. ఎలాగోలా ఒప్పించాను. మొత్తానికి స్క్రీన్ మీద మెరిశాను. ఇంజినీరింగ్ తర్వాత, ధైర్యంగా ఈ ఫీల్డ్‌లోకి వచ్చాను. కొన్ని సీరియల్స్ చేసినా.. పెద్దగా బ్రేక్ రాలేదు. దీంతో, క్యాంపస్ ప్లేస్మెంట్లో కొలువు సాధించి.. ఉద్యోగం చేస్తూనే సీరియల్స్‌లో నటించాను. నాకంటూ ఓ గుర్తింపు వచ్చాక సాఫ్ట్వేర్ జాబ్‌కు రిజైన్ చేశాను.
ప్రతి పాత్రా కీలకమే
పెద్ద పెద్ద డైలాగులు చెప్పడం కష్టమేం కాదు. కొన్నిసార్లు, అనుభవానికి మించిన బాధలు, ఊహలకు అందని కష్టాలు సీరియల్స్‌లో ఉంటాయి. ఆ బాధలేవీ నా జీవితంలో లేవు. కానీ, అంతకు రెట్టింపు కష్టాలు అనుభవిస్తున్నవారిని చూశాను. వాళ్లే నాకు స్ఫూర్తి. షూటింగ్ విషయానికి వచ్చేసరికి భారమంతా దర్శకులపైనే వేస్తాను. వాళ్లు చెప్పినట్టే చేస్తాను.
ప్రతి పాత్రా నాకు ప్రత్యేకమే. ఒక్కోసారి నా పాత్ర మీద నాకే సానుభూతి కలుగుతుంది. చిన్నతెర నటులకు కూడా వెండితెర స్టార్స్‌తో సమానమైన గ్లామర్ ఉంది. ఎక్కడికెళ్లినా జనం గుర్తిస్తారు. ‘ఫలానా సీరియల్లో చేశారు కదూ!’ అంటూ అభిమానంతో పలకరిస్తారు. ప్రస్తుతం నేను నటిస్తున్న ‘చి.ల.సౌ. స్రవంతి’ సీక్వెల్లోనూ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అన్ని ఉద్వేగాలూ ఉన్నాయి. అప్పట్లో ఈ సీరియల్ ఘన విజయం సాధించింది. టైటిల్ రోల్ లభించడం నిజంగా నా అదృష్టం.
Read Today's Latest Success-story News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

