Inspiration | డిగ్రీ పట్టా కూడా లేదు.. కానీ ఆమె వాదిస్తే న్యాయవాదులు నీళ్లు నమలాల్సిందే
Inspiration | సత్వీందర్ కౌర్.. ‘అబాండెన్డ్ బ్రైడ్స్ బై ఎన్ఆర్ఐ హజ్బెండ్స్ ఇంటర్నేషనల్లీ’ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకురాలు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే పంజాబ్‌లో ఎన్ఆర్ఐ పెండ్లికొడుకుల అరాచకాలు ఎక్కువ. ఎక్కడి నుంచో ఊడిపడతారు. గొప్పలు చెప్పుకొంటారు.
Inspiration | సత్వీందర్ కౌర్.. ‘అబాండెన్డ్ బ్రైడ్స్ బై ఎన్ఆర్ఐ హజ్బెండ్స్ ఇంటర్నేషనల్లీ’ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకురాలు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే పంజాబ్‌లో ఎన్ఆర్ఐ పెండ్లికొడుకుల అరాచకాలు ఎక్కువ. ఎక్కడి నుంచో ఊడిపడతారు. గొప్పలు చెప్పుకొంటారు. అమాయకులైన ఆడపిల్లలను కట్టుకుని వెళ్లిపోతారు. లేదంటే మోజు తీర్చుకుని మాయమైపోతారు. లూధియానాకు చెందిన సత్వీందర్ కౌర్ కూడా అలా మోసపోయిన అమ్మాయే.
ఉక్రెయిన్‌లో ఉద్యోగం చేస్తున్నానంటూ ఓ ప్రబుద్ధుడు ఆమె తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పాడు. కొంతకాలం కాపురం చేసి .. తిరిగొస్తానంటూ వెళ్లిపోయాడు. ఐదేండ్ల తర్వాత కానీ అతని అసలు స్వరూపం తెలియలేదు. పోలీసుల చుట్టూ, ఉమెన్స్ సెల్ చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. ఆ చేదు అనుభవమే ఆమెను ఉద్యమకారిణిగా మార్చింది. కౌర్ ఇప్పటి వరకూ ఏడొందల మంది మహిళలకు అండగా నిలిచారు. విడాకులు, నష్టపరిహారం ఇప్పించారు. జీవనభృతి అందేలా కృషి చేశారు. ‘ఇలాంటి మోసాలు దేశవ్యాప్తంగా అనేకం జరుగుతున్నాయి.
మహిళల అమాయకత్వమే ఆ మేకవన్నె పులులకు బలాన్ని ఇస్తున్నది. కన్నవాళ్లు కూడా విదేశీ సంబంధం అనగానే.. కళ్లు మూసుకుని ఖాయం చేసుకోవడం మానేయాలి’ అని సలహా ఇస్తారు కౌర్. పట్టభద్రురాలు కూడా కాని ఆ మహిళ ఇప్పుడు, చకచకా చట్టాలు వల్లెవేస్తారు. న్యాయవాదులు సైతం నీళ్లు నమిలేలా వాదిస్తారు.
Read Today's Latest Success-story News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | మెదక్ జిల్లాలో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో మంజీరా నదిలో దూకి తల్లి ఆత్మహత్య
Venu Udugula | తెలంగాణ సంస్కృతిని కేవలం ప్లేట్లలో, గ్లాసుల్లో వెతకకండి: దర్శకుడు వేణు ఉడుగుల!
Chandrababu | ఆర్నబ్ తుఫాన్ కారణంగా జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలి : సీఎం చంద్రబాబు
Jio IPO | స్టాక్ మార్కెట్లలోకి ఘనంగా జియో ప్లాట్‌ఫామ్స్ ఎంట్రీ.. 21.36 శాతం ప్రీమియంతో లిస్టింగ్..!
Trivikram | శ్రీనిధి శెట్టి పాదాలకు త్రివిక్రమ్ నమస్కారం.. ‘ఆదర్శ కుటుంబం’ వేడుకలో అసలేం జరిగింది?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

