ఒండ్రు మృత్తికలు
-ఈ రకమైన నేలలు నదులు తీసుకువచ్చే ప్రవాహం వల్ల ఏర్పడుతాయి.
-ఇవి రాష్ట్ర నికర సాగుభూమిలో 20 శాతం, దేశ నికర సాగు భూమిలో 23.4 శాతం ఉన్నాయి.
లక్షణాలు : ఇవి నేలలన్నింటిలోకి అత్యంత సారవంతమైనవి. (వ్యవసాయానికి అనుకూలం). గంగాసింధు మైదానం వెంట నవీన ఒండ్రు మృత్తికలను ఖాదర్ అని, పురాతన మృత్తికలను భంగర్ అని, చిత్తడి నేలలను టెరాయి అని పిలుస్తారు.
పంటలు : వరి, గోధుమ, జనుము, చెరుకు
విస్తరణ : బ్రహ్మపుత్ర మైదానం, ఒడిశా మహానది డెల్టా ప్రాంతం, కృష్ణా-గోదావరి, ప్రాణహిత నది డెల్టా ప్రాంతం, కావేరి నది డెల్టా ప్రాంతం, కేరళలోని పశ్చిమకనుమల ప్రాంతం.
జేగురు నేలలు/లాటరైట్ నేలలు
-ఈ రకమైన నేలలు అధిక ఉష్ణోగ్రత వెంబడి అధిక వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఏర్పడుతాయి. (లీచింగ్ ప్రక్రియ)
-ఇవి ముదురు ఎరుపు వర్ణం (ఇటుక రంగు) కలిగి ఉంటాయి. కాబట్టి ఈ నేలలను లాటరైట్ నేలలు అంటారు. లాటరైట్ అంటే లాటిన్ భాషలో ఇటుక అని అర్థం.
-ఈ నేలలు తెలంగాణ నికరసాగు భూమిలో 1 శాతం, దేశ నికర సాగుభూమిలో 4.3 శాతం ఉన్నాయి.
-ఈ నేలల్లో ముఖ్య ఖనిజం బాక్సైట్
లక్షణాలు
-ఇవి నేలలన్నింటిలోకి తక్కువ సారవంతమైనవి.
-ఇవి ప్రపంచ టెర్రరోసా నేలలను పోలి ఉంటాయి.
పండే పంటలు
-తోట పంటలు, నిమ్మజాతి ఫలాలు (నిమ్మ, నారింజ, బత్తాయి, ద్రాక్ష), జీడిమామిడి, ఆలుగడ్డలు.
విస్తరణ
-రాష్ట్రంలో నారాయణఖేడ్, జహీరాబాద్
-పశ్చిమ కనుమలు, ఈశాన్యరాష్ర్టాల పర్వత శిఖర భాగాలు
1. కిందివాటిని జతపర్చండి.
నేల పంట
ఎ. ఒండ్రుమట్టి 1. నూనెగింజలు
బి. ఎర్రమట్టి 2. గోధుమ, వరి
సి. నల్లమట్టి 3. తేయాకు, పోకచెక్క
డి. లాటరైట్నేల 4. పత్తి
1) ఎ-3, బి-2, సి-4, డి-1
2) ఎ-2, బి-3, సి-1, డి-4
3) ఎ-1, బి-3, సి-2, డి-4
4) ఎ-2, బి-1, సి-4, డి-3
2. దేశంలో పత్తిపండే నల్ల మృత్తికలు ఏ సమూహానికి చెందినవి?
1) అలూవియల్ సమూహం
2) లాటరైట్ సమూహం
3) పోడోజోల్ సమూహం
4) చెర్నోజోమ్ సమూహం
3. తెలంగాణ విస్తీర్ణంలో ఎర్రనేల శాతం?
1) 25 2) 48 3) 20 4) 16
4. రాష్ట్ర విస్తీర్ణంలో అత్యధిక పరిమాణంలో ఉన్న నేలలు?
1) నల్లరేగడి నేలలు 2) ఒండ్రు నేలలు
3) ఎర్ర నేలలు 4) లాటరైట్ నేలలు
5. కింది వాటిని జతపర్చండి.
నేలరకం విస్తీర్ణ శాతం
ఎ. ఒండ్రుమట్టి 1. 25
బి. ఎర్రమట్టి 2. 20
సి. నల్లమట్టి 3. 48
డి. లాటరైట్ నేల 4. 1
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-3, సి-1, డి-4
3) ఎ-2, బి-3, సి-4, డి-1
4) ఎ-1, బి-2, సి-4, డి-3
6. నీరు ఉన్నప్పుడు ఉప్పొంగినట్లు ఉండి, నీరులేనప్పుడు పగుళ్లు ఏర్పడే స్వభావం గల నేలలు?
1) పర్వతీయ 2) ఇసుక
3) నల్లరేగడి 4) ఎర్రమట్టి
7. తేలికపాటి మట్టిని కలిగి ఉండి దుమ్మును ఎగబాసినట్లు ఉండే నేలలు అని వేటిని పిలుస్తారు?
1) ఎర్రమట్టి 2) నల్లరేగడి
3) లాటరైట్ 4) ఒండ్రు
8. అత్యంత తీవ్రమైన నల్లరేగడి నేలలు ఏ జిల్లాలో అధికంగా ఉన్నాయి?
1) ఆసిఫాబాద్ 2) నల్లగొండ
3) నిజామాబాద్ 4) రంగారెడ్డి
9. పప్పుధాన్యాలు, నూనెగింజలు, పసుపు మొదలైన పంటలకు అనుకూలమైన నేలలు?
1) నల్లమట్టి 2) ఎర్ర మట్టి
3) ఒండ్రుమట్టి 4) లాటరైట్
10. జలదాన శక్తి ఎక్కువగా ఉండే నేల?
1) ఎర్రనేల 2) నల్లరేగడి నేల
3) ఒండ్రు నేల 4) లాటరైట్ నేల
11. దక్కన్ పీఠభూమి ప్రాంతంలో అధికంగా ఉండే నేలలు?
1) ఎర్ర 2) నల్లరేగడి 3) ఒండ్రు 4) లాటరైట్
12. నేల లేదా మృత్తికలో ఉండే పొరలను ఏమంటారు?
1) పెడకల్స్ 2) ప్రొపైల్
3) హార్డ్ జోన్స్ 4) హురైజన్స్
13. పెడాలజి అనేది దేని అధ్యయన పద్ధతి?
1) భూసారం 2) జంతువుల గమనశక్తి
3) శిలలు 4) పంట తెగులు
14. లీచింగ్ అనే ప్రక్రియవల్ల ఏర్పడే నేలలు?
1) నల్లరేగడి 2) ఎర్ర నేలలు
3) లాటరైట్ నేలలు 4) ఒండ్రు మట్టి
15. ఇనుము ఆక్సైడ్ వల్ల ఏర్పడే నేల రకం?
1) రేగర్ 2) ఎర్రమట్టి 3) భంగర్ 4) ఆల్కలైన్
16. అడవులు నాశనం కావడంవల్ల కలిగే నష్టం?
1) వృక్షసంపాదన నశించడం 2) నేల క్రమక్షయం 3) వర్షపాతం తగ్గడం 4) మూలకాలు తొలగిపోవడం
17. ప్రపంచ పృథ్వీ దినం?
1) ఏప్రిల్ 22 2) మార్చి 21
3) ఫిబ్రవరి 21 4) జనవరి 22
18. నల్లరేగడి నేలలు అధికంగా ఉన్న రాష్ట్రం?
1) అసోం 2) మహారాష్ట్ర 3) బీహార్ 4) పంజాబ్
19. అధిక వర్షపాతంతోపాటు అధిక ఉష్ణోగ్రత కలిగి ఉండే ప్రాంతాల్లో ఏర్పడే నేలలు?
1) ఎర్ర నేలలు 2) పర్వతీయ
3) లాటరైట్ 4) నల్లరేగడి
20. నదులు తీసుకువచ్చిన సారవంతమైన మట్టివల్ల ఏర్పడే నేలలు?
1) జేగురు 2) ఎర్ర 3) నల్లరేగడి 4) ఒండ్రు
21. నేలలన్నింటిలో అత్యంత సారవంతమైన నేలలు?
1) ఒండ్రు 2) జేగురు
3) పర్వతీయ 4) నల్లరేగడి
22. నేల సహాయం లేకుండా మొక్కలు పెంచే విధానాన్ని ఏమంటారు?
1) హైడ్రాలజి 2) పొమాలజి
3) హైడ్రోఫోనిక్స్ 4) పాథాలజి
23. జేగురు నేలలోని ముఖ్య ఖనిజం?
1) ఐరన్, కార్బన్ 2) బాక్సైట్
3) ఫెర్రస్ ఆక్సైడ్ 4) కార్బొనేట్లు
24. ప్రపంచ మెట్ట భూముల దినోత్సవం?
1) ఫిబ్రవరి 28 2) ఫిబ్రవరి 29
3) ఫిబ్రవరి 2 4) ఫిబ్రవరి 14
25. కిందివాటిని జతపర్చండి.
క్రమక్షయం లక్షణం
ఎ. పటక్రమక్షయం 1. నేల పొరలు, పొరలుగా కొట్టుకుపోవడం
బి. వంక క్రమక్షయం 2. లోతైన గాడులను ఏర్పర్చడం
సి. అవనాళికా క్రమక్షయం 3. చేతివేళ్ల ఆకారంలో
1) ఎ-1, బి-2, సి-3 2) ఎ-1, బి-3, సి-2
3) ఎ-2, బి-3, సి-1 4) ఎ-3, బి-2, సి-1
26. కింది వాటిలో ఏ పంటను ఎర్రనేలల్లో పండిస్తారు?
1) పత్తి 2) పొగాకు 3) పసుపు 4) అరటి
27. కిందివాటిని సరిగా జతపర్చండి.
నేలరకం విస్తరించిన ప్రాంతాలు
ఎ. ఎర్రమట్టి 1. ఆదిలాబాద్
బి. నల్లమట్టి 2. నల్లగొండ
సి. ఒండ్రుమట్టి 3. నారాయణఖేడ్, జహీరాబాద్
డి. లాటరైట్ మట్టి 4. ప్రాణహిత, కృష్ణా, గోదావరి డెల్టా
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-2, బి-1, సి-3, డి-4
4) ఎ-1, బి-3, సి-2, డి-4
28. ఎర్ర నేలల్లో ఇసుకశాతం ఎక్కువగా ఉన్నవాటిని రాష్ట్రంలో ఏమని పిలుస్తారు?
1) చెల్కనేలలు 2) దుబ్బ నేలలు
3) ఇసుక నేలలు 4) పర్వతీయ నేలలు
29. నల్లరేగడి నేలలకు సంబంధించి కింది వాటిలో సరైనది?
1) తనను తాను దున్నుకునే నేలలు
2) రేగర్ నేలలు
3) కాలిఫోర్నియాలో అరిజోనా నేలలు
4) పైవన్నీ