Rural Development | ప్రగతిపథంలో భారత గ్రామీణాభివృద్ధి
– స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి భారతదేశంలో 70శాతంకంటే ఎక్కువ మంది గ్రామాల్లోనే నివసిస్తున్నారు. అసలు భారతదేశమే గ్రామాల్లో నివసిస్తుందని, గ్రామీణ ప్రజలు పేదరికం, నిరుద్యోగం, దారిద్య్రంతో బాధపడుతున్నారని చెప్పవచ్చు. దేశాభివృద్ధి గ్రామీణాభివృద్ధిపైన, గ్రామీణాభివృద్ధి పల్లె ప్రజల ఆర్థిక అభివృద్ధిపైన ఆధారపడి ఉంటుంది.
– కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రగతిపథంలో ఔత్సాహిక ఙల్లాల రూపాంతరం అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. అత్యంత వెనుకబడిన 100 జిల్లాలను అభివృద్ధి పథాన నడుపగలిగితే దేశం మొత్తం అభివృద్ధి చెందుతుందని ప్రధాని నరేంద్రమోదీ ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ నూత న పథకం అమలుకు కేంద్ర రాష్ట్ర పథకాలను ఉమ్మడిగా అమలుపర్చటం, సంబంధిత కేంద్ర రాష్ట్ర అధికారులు కలిసికట్టుగా గ్రామీణ పథకాల అమలును పర్యవేక్షించడం ప్రధానాంశం.
– జిల్లాస్థాయి సంఘం కార్యక్రమ అమలు గురించి ఒక నివేదిక తయారుచేసి అందుబాటులో ఉన్న వనరుల ఆధారంగా 2022 నాటికి అమలుకోసం ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తారు. దేశంలో గుర్తించిన 115 ప్రగతిశీల జిల్లాల్లో తెలంగాణలోని భూపాలపల్లి, కొమురంభీం, ఖమ్మం జిల్లాలు, ఏపీలోని విజయనగరం, విశాఖపట్నం, కడప జిల్లాలు ఉన్నాయి.
వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ
– భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ ప్రధానంగా వ్యవసాయాధారితమైంది. దేశంలో 60శాతం ప్రజలు ప్రత్యక్షంగా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. గతంలో ప్రభుత్వాలు వ్యవసాయంపై దృష్టిపెట్టినా కోట్లాదిమంది వ్యవసాయదారులు పేదరికం, సౌకర్యాల లేమితో సతమతం అవుతూనే ఉన్నా రు. గ్రామీణ సాంఘిక మౌళిక సౌకర్యాల అభివృద్ధిని సరైన విద్యా, వైద్య సదుపాయాలతో బలోపేతం చేయవలసి ఉంది. దేశంలో వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయటానికి సరైన మార్గంలో దృష్టిపెట్టారు.
– 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న ప్రధాని కలను సాకారం చేసే దిశగా ఆర్థిక వ్యవసాయదారులు తక్కువ పెట్టుబడితో అధికాదాయం పొందేలా చేయటంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. అందుకోసం రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాల్సి ఉంటుంది. గ్రామాల కొనుగోలుశక్తి పెరిగినప్పుడు మాత్రమే గ్రామీణ పారిశ్రామికోత్పత్తి వృద్ధిబాటపట్టి జీడీపీ అధికమవుతుంది.
– వ్యవసాయంతోపాటు అనుబంధరంగాలకు నూతనోత్తేజం తీసుకురావడం ద్వారా గ్రామాలను బాగుచేయవచ్చని కేంద్రం గ్రహించింది. తదనుగుణంగా 2017-18 నుంచి 2028-29 వరకు గ్రామీణ అభివృద్ధి నిధి ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇదే కాకుండా వయవసాయ మార్కెట్ల అనుసంధానాన్ని కూడా బలోపేతం చేయాలి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పరిపుష్టిని కల్పించటం, గ్రామాల్లో మౌళిక వసతులు పెంచటంద్వారా వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధికి పుష్టి కలుగుతుంది.
– పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు. గ్రామ స్వరాజ్యం సాధించినప్పుడే దేశాభివృద్ధి సాధ్యం అవుతుంది. ఈ నినాదానికి కేంద్ర బడ్జెట్ నిర్ణయాలు మద్దతు ఇచ్చాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం ప్రాధాన్యాంశాలుగా నిలిచాయి. దీంతో రైతుల ఆదాయం రెట్టింపై, పెట్టుబడులకు ప్రోత్సా హం కలుగుతుంది. వ్యవసాయ ఉత్పత్తుల ధర- సరఫరాల్లోని వ్యత్యాసాలను తొలగించి అందరికి అందుబాటులోకి తేవటానికి ఆపరేషన్ గ్రీన్స్ పథకాన్ని ప్రకటించారు.
సాగులో సాంకేతికత
– దీర్ఘ కాలంలో ఆర్థిక వ్యవస్థ విస్తరణకు భారీ పెట్టుబడులు కేటాయించి శాస్త్రసాంకేతిక విజ్ఞానాభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారు. వ్యవసాయ ఉత్పాదన కీలకమైన నీటిపారుదల, విద్యుచ్ఛక్తి, భారీ పరిశ్రమలు, విద్య, వైద్యరంగాల అభివృద్ధికి కృషి చేశారు. ఐసీఏఆర్ వ్యవసాయ విద్య, పరిశోధన, విస్తరణ, అభివృద్ధికి వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని స్థాపించి మేలురకం విత్తనాలు, పంటల సంరక్షణ, పంటల దిగుబడి పెంచటానికి రసాయన ఎరువులు వాడకం, నూతన ఉత్పాదనలపై పరిశోధనలు చేపట్టారు. వీటి సమాంతర కేంద్రాలుగా సమాచార బదిలీకి అవకాశం కల్పించారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే కొత్త యోచనలు బలంగా ఉన్నాయి. 62శాతం జనావళికి జీవికగా ఉన్న సేద్యరంగాన్ని శాస్త్రసాంకేతికతలనే జోడెడ్లతో బడుగు రైతులకు లాభాల భరోసా ఇచ్చేలా తీర్చిదిద్దటమే లక్ష్యంగా సాగిన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సాంకేతిక శిఖరాగ్ర సదస్సు స్ఫూర్తిమంతంగా ముగిసింది. ప్రపంచంలోని అత్యుత్తమ విధానాలు, సాంకేతిక ఆవిష్కరణలను పూర్తిస్థాయిలో అందిపుచ్చుకోవాలనే ఆలోచనలకు అద్దంపట్టింది. రైతులకు అవసరమైన సమాచారం అంతా వారి ఇంటివద్దకే చేర్చాలన్న ధోరణికి కేంద్ర ప్రభుత్వం మద్దతు పలికింది.
– చిన్నచిన్న కమతాల రైతులను బృందాలుగా ఏర్పాటుచేసి వేల ఎకరాల్లో సమాజిక సాగును ప్రోత్సహిస్తే ఖర్చు గణనీయంగా తగ్గి రైతులకు భారీగా లాభాలు చేకూరుతాయి. వ్యవసాయంలో ఆధునిక పద్ధతుల ఆవిష్కరణల వినియోగ అవసరాన్ని ప్రస్తావిస్తూనే, మేలిమి విత్తనాల ప్రాధాన్యాన్ని ప్రపంచ సాంకేతిక దిగ్గజం బిల్గేట్స్ సూటిగా ప్రశ్నించారు. థాయ్లాండ్, మలేషియా వంటి దేశాల్లో అధిక ఉత్పాదకత సాధ్యపడుతుందని, డీఎన్ఎ పరిజ్ఞానం అనుసంధానాన్ని సమ్మిళిత సమీకృత వ్యవసాయం ద్వారా ఆర్థిక ప్రగతి సాధించటానికి అవకాశం ఉన్నదని ఆయా దేశాలు నొక్కిచెప్పాయి.
– వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, సాగునీటిరంగాలకు ఈ ఏడాది బడ్జెట్లో ప్రాధాన్యమిచ్చారు. రైతు కుటుంబాల ఆదాయంపై దేశంలో ఆంధ్రప్రదేశ్ 21వ స్థానంలో ఉన్నదన్న వాస్తవాన్ని గుర్తించి అన్నదాతల రాబడి పెంపుదలకు సాంకేతిక పరిష్కారాన్ని వేగవంతంగా అన్వేషిస్తున్నది. సేద్యంలో సౌలభ్యాన్ని శాస్త్రీయతను పెంచేలా రైతులకు బాసటగా 259 కొత్త సాంకేతిక ఆవిష్కరణలకు విశాఖ సదస్సు వేదికైంది.
పాడిపరిశ్రమ పాత్ర
– భారతదేశం పాల ఉత్పత్తిలో ముందంజలో ఉన్నది. కేంద్ర ప్రభుత్వం పాలడైరీ మౌళిక సదుపాయాల కోసం నిధిని ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించింది. ఆపరేషన్ ఫ్లడ్ పథకం కింద రూ.10,881 కోట్లతో పాల ఉత్పత్తులకు కావాల్సిన మౌళిక సదుపాయాలను ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ నిధిని ఖర్చు చేసి కొత్త పాలశుద్ధి కేంద్రాలను విరివిగా ఏర్పాటు చేస్తామని తెలిపింది.
– ఇటీవల ఐరోపా సమాఖ్య వ్యవసాయ దృక్పథం 2019 పేరుతో విడుదల చేసిన నివేదికలో 2030 నాటికి సార్క్, ఉత్తర ఆఫ్రికా, చైనా, మధ్యప్రాచ్య దేశాలు ఏటా నాలుగు కోట్ల టన్నుల పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకొనే స్థాయికి చేరుతాయని అంచనా వేసింది. ఈ పరిణామం భారత రైతుల ఆదాయం పెంచటానికి ఒక మంచి అవకాశంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి.
– గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలన్నింటిని జీవనోపాధి అభివృద్ధి, వైవిద్యీకరణతో అనుసంధానం చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మన్నికైన ఆస్తులు, నీటి సంరక్షణపై దృష్టి సారించి వ్యవసాయ చెరువులు, తవ్విన బావులు, బర్రెలు, మేకలు తదితర పశుశాలలలు, కోళ్ల షెడ్లు, గృహనిర్మాణం వంటి జీవనోపాధి కల్పించే వ్యక్తిగత ప్రయోజనాలకు కూడా సహకారం అందించింది. ఈ విధంగా గ్రామీణాభివృద్ధిలో జీవనోపాధి కల్పించే వ్యవసాయం, దాని అనుబంధ పాడి పరిశ్రమ, కోళ్ల పరిశ్రమకు సబ్సిడీ కార్యక్రమాలతో అనుసంధానం చేయటం వల్ల మెరుగైన ఆదాయానికి దోహదం చేస్తాయి.
– పండ్లు, కూరగాయల ఉత్పత్తుల పెరుగుదల, పాడి, కోళ్ల పరిశ్రమ వంటి వ్యవసాయ అనుబంధ కార్యక్రమాల ద్వారా గత నాలుగేండ్లుగా గ్రామీణ జీవనోపాధి వైవిధ్యతపై దృష్టి సారించటం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన, పేదల ఆదాయం వృద్ధికి కారణమైంది.
డిజిటలైజేషన్
– తమిళనాడు వ్యవసాయశాఖ రూపొందించిన ఉళవన్ (రైతు) యాప్ రైతులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. రాయితీ పథకాల వివరాలు తెలుసుకోవటానికి, దరఖాస్తులకు, పంటలబీమాకు, వ్యవసాయ అధికారుల వివరాలు తెలుసుకొనేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. 70 లక్షల రైతుల సమాచారం, భూముల విస్తీర్ణం, భూసార పరిస్థితి, ఎరువులు, విత్తనాలు, బ్యాంకుల వివరాలు ఇందులో ఉన్నాయి.
– గ్రామీణ రైతులకు మేలు చేసేలా సమాచారం డిజిటలైజేషన్ చేసి చట్టపరమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా, రైతుకు రుణాలు ఇవ్వాలన్నా, మార్కెట్ ధరలు నిర్ణయించాలన్నా పంటల దిగుబడిమీద ఆధారపడి ఉంటాయని, దాన్ని కాపాడుకుంటూనే రైతుల నేపథ్యంలో సమగ్రంగా డేటాను సేకరించాల్సిన అవసరం ఉందని ప్రపంచబ్యాంకు, పంటలబీమా, బిగ్డాటా నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆ అంచనాలకు తగ్గట్టుగా దిగుబడి రావాలంటే భూమి, వాతావరణం, ఇతర పరిస్థితులమీద కచ్చితమైన సమాచారం అవసరం అని ప్రపంచవ్యాప్తంగా రైతులు నమ్ముతున్న నేపథ్యంలో సమగ్ర డాటావల్లనే పురోగతి ఉంటుందని వ్యవసాయశాఖ తెలిపింది.
– ఐవోటీ, శాటిలైట్ చిత్రాల ద్వారా భూగర్భ పొరల్లోని నీటి వివరాలను తెలుసుకొని రైతులు సులభంగా బోర్లు వేసుకొనే వీలవుతుంది. ఉగాండాలాంటి దేశాల్లో కచ్చితమైన డాటా ఉండటంవల్లనే రైతులకు ఇచ్చే పెట్టుబడులను షేర్మార్కెట్లో పెట్టే విధానం అమల్లోకి వచ్చింది. ఈ సమగ్ర డాటా వల్ల ప్రపంచవ్యాప్తంగా రైతుల పురోగతి సాధ్యమవుతుంది. ఎగుమతులకు ప్రోత్సాహం ఉంటుంది. లక్ష గ్రామాల డిజిటల్ అనుసంధానం, 32 కోట్ల జన్ధన్ఖాతాల విప్లవం, ఈనామ్తో 470 వ్యవసాయ మార్కెట్ల అనుసంధానం, ఆరుకోట్ల మందిని డిజిటల్ అక్షరాస్యులుగా తీర్చిదిద్దే యజ్ఞం నడుస్తున్నాయి.

Read Today's Latest Study-material Study-material News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

