రాయ్‌పూర్ : బౌలింగ్‌లో లైన్, లెంగ్త్ అందిపుచ్చుకుంటే యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తాడని సీనియర్ పేసర్ మహ్మద్ షమి కితాబిచ్చాడు. జమ్ము-కశ్మీర్‌కు చెందిన ఉమ్రాన్ మాలిక్150 కి.మీ. వేగంతో బంతులు సంధిస్తూ చూపరులను ఆకట్టుకుంటున్నాడు. అయితే ఖచ్చితత్వం విషయంలో ఉమ్రాన్ నిలకడ ప్రదర్శించలేకపోతున్నాడు. దీనిపై షమి మాట్లాడుతూ ఉమ్రాన్ వేగంగా బంతులు వేస్తున్నాడని, అతడిని ఎదుర్కోవడం కష్టమేనని, అయితే అతడు లైన్ అండ్ లెంగ్త్‌ను పాటించాల్సి ఉందన్నాడు. శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో మహ్మద్ సిరాజ్, షమి న్యూజిలాండ్ బ్యాటింగ్‌ను కకావికలం చేశారు. దేశానికి ఆడుతున్నపుడు ఒత్తిడికి లోను కాకూడదని, మన నైపుణ్యాలపై నమ్మకం ఉంచాలని షమి అన్నాడు. పిచ్ ఎలా స్పందిస్తున్న దానిని అనుసరించి బంతులు వేయాలని సూచించాడు.