MI vs UPW : ముంబై ఇండియన్స్(Mumbai Indians) తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ యస్తికా భాటియా(21) ఔటయ్యింది. అంజలీ సర్వానీ వేసిన ఐదో ఓవర్లో రెండో బంతికి కిరణ్ నవగిరేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. దాంతో, 31 రన్స్ వద్ద ముంబై మొదటి వికెట్ పడింది. హేలీ మాథ్యూస్ (10), నాట్ సీవర్ బ్రంట్(5) క్రీజులో ఉన్నారు. ధాటిగ ఆడిన యస్తిక, రాజేశ్వరీ గైక్వాడ్ వేసిన మూడో ఓవర్లో పాయింట్ యస్తిక రెండు బౌండరీలు కొట్టింది. ఐదు ఓవర్లకు ముంబై వికెట్ నష్టానికి 37 రన్స్ చేసింది.