Yashasvi Jaiswal: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన యశస్వి జైస్వాల్
Yashasvi Jaiswal: ఐపీఎల్లో ఒక్క సీజన్లో అత్యధిక రన్స్ చేసిన అన్క్యాప్డ్ బ్యాటర్‌గా యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. 15 ఏళ్ల క్రితం నాటి రికార్డును అతను బ్రేక్ చేశాడు. షాన్ మార్ష్ పేరిట ఉన్న రికార్డును జైస్వాల్ తిరగరాశాడు.
హైదరాబాద్: ఐపీఎల్లో యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) సరికొత్త చరిత్ర సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్‌కు ఆడుతున్న ఆ యువ బ్యాటర్ సంచలనాలు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. ఓ ఐపీఎల్ సీజన్లో అత్యధిక రన్స్ చేసిన అన్క్యాప్డ్ ప్లేయర్‌గా నిలిచాడతను. ఐపీఎల్ 2023 సీజన్లో అతను 14 మ్యాచుల్లో 48.07 సగటుతో 625 రన్స్ స్కోర్ చేశాడు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించని క్రీడాకారుల్ని అన్క్యాప్డ్ ప్లేయర్లుగా గుర్తిస్తారు.
రాజస్థాన్ రాయల్స్‌కు ఆడుతున్న ఈ 21 ఏళ్ల ఓపెనర్.. ఐపీఎల్లో కొత్త మైలురాయిని లఖించాడు. ధర్మశాలలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కేవలం 36 బంతుల్లోనే జైస్వాల్ హాఫ్ సెంచరీ చేశాడు. ఈ సీజన్లో అతను ఒక సెంచరీ, అయిదు హాఫ్ సెంచరీలు స్కోర్ చేశాడు. అతని బెస్ట్ స్కోర్ 124. ఈ సీజన్లో అతను 163.61 స్ట్రయిక్ రేట్‌తో పరుగులు సాధించాడు.
15 ఏళ్ల క్రితం నమోదు అయిన ఐపీఎల్ రికార్డును జైస్వాల్ బ్రేక్ చేశాడు. 2008 ఐపీఎల్ సీజన్లో ఆస్ట్రేలియా బ్యాటర్ షాన్ మార్ష్ .. అన్క్యాప్డ్ బ్యాటర్‌గా అత్యధిక రన్స్‌ను స్కోర్ చేశాడు. ఆ సీజన్లో షాన్ మార్ష్ 11 మ్యాచుల్లో 616 రన్స్ చేశాడు.
ఆ జాబితాలో మూడవ ప్లేయర్‌గా ఇషాన్ కిషణ్ ఉన్నాడు. 2020 సీజన్లో 516 రన్స్ చేశాడు. 2018 సీజన్లో సూర్యకుమార్ యాదవ్ 512 రన్స్ స్కోర్ చేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajkumar Periyasamy | అది సీక్వెల్ కాదు, అక్కడితోనే క్లోజ్.. ధనుష్ ‘ఓం’ సినిమాపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!
Srinivas Goud | రైతాంగానికి ఎకరాకు రూ. 25 వేల నష్టపరిహారం చెల్లించాలి: మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
KTR | పబ్లిక్ గొంతు నొక్కడం ఏ రకమైన పబ్లిక్ హియరింగ్ అవుతుంది : కేటీఆర్
Culinary Medicine | ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం పొందుతున్న క్యులినరీ మెడిసిన్.. అసలేమిటి.. ఏం చేస్తుంది..?
Electric Shock | దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతం..భార్యభర్తలు మృతి
ట్రెండింగ్ వార్తలు
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!

