Sara Lee | 30 ఏళ్లకే డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ రెజ్లర్ సారా లీ హఠాన్మరణం
WWE Tough Enough Winner Sara Lee | అతి చిన్న వయసులోనే డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ రెజ్లర్ సారా లీ (30) హఠాన్మరణం చెందింది. అక్టోబర్ 6న సారా మృతిచెందినట్లు ఆమె తల్లి టెర్రీ లీ సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించింది.
WWE Tough Enough Winner Sara Lee | అతి చిన్న వయసులోనే డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ రెజ్లర్ సారా లీ (30) హఠాన్మరణం చెందింది. అక్టోబర్ 6న సారా మృతిచెందినట్లు ఆమె తల్లి టెర్రీ లీ సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించింది.
బరువెక్కిన గుండెతో ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నా. నా కూతురు సారా ఈ లోకాన్ని విడిచి శాశ్వతంగా వెళ్లిపోయింది. తన మరణంతో మేమంతా షాక్‌లో ఉన్నాం. ఇంకా ఆమె అంత్యక్రియలు కూడా పూర్తికాలేదు. అంటూ ట్విటర్ వేదికగా తెలియజేసింది. ఈ విషాద సమయంలో తమ కుటుంబానికి ప్రైవసీ ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. అయితే సారా లీ మరణానికి గల కారణాన్ని మాత్రం ఆమె వెల్లడించకపోవడం గమనార్హం. సారా లీ మృతి పట్ల డబ్ల్యూడబ్ల్యూఈ కూడా స్పందించింది. ట్విట్టర్ వేదికగా తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. సారా లీ మరణ వార్త తెలిసి ఎంతగానో చింతిస్తున్నాం. టఫ్ విన్నర్‌గా ఆమె ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిందని కొనియాడింది.
సారా లీ 1992 జూన్ 7న అమెరికాలోని మిచిగాన్‌లో జన్మించింది. 2015లో డబ్ల్యూడబ్ల్యూఈలో కెరీర్‌ను మొదలుపెట్టింది. కేవలం ఒకే ఒక్క ఏడాది మాత్రం డబ్ల్యూడబ్ల్యూఈ ఆడిన సారా.. తన మార్క్‌ను చూపించింది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది. 2017లో డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ రెజ్లర్ వెస్లే బ్లేక్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ముగ్గురు సంతానం ఉన్నారు. ఏదేమైనా కేవలం 30 ఏళ్లకే సారా లీ కన్నుమూయడం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెజ్లింగ్ ఫ్యాన్స్ విషాదంలో మునిగిపోయారు.
Read More :
Arun Bali: బాలీవుడ్ నటుడు అరుణ్ బాలీ కన్నుమూత
Khushboo Sundar | ఆస్పత్రి పాలైన సినీ నటి ఖుష్బూ.. కారణం ఎంటంటే?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

