WPL 2024 Final | ఈ సాలా కప్ ఆర్సీబీదే.. బెంగళూరు ట్రోఫీ ‘బెంగ’ తీర్చిన అమ్మాయిలు.. మళ్లీ తడబడిన ఢిల్లీ
WPL 2024 Final | విరాట్ కోహ్లీ, అనిల్ కుంబ్లే, ఏబీ డివిలియర్స్, ఫాఫ్ డుప్లెసిస్ వంటి దిగ్గజాలకు సాధ్యం కానిది ఆర్సీబీ అమ్మాయిలు చేసి చూపించారు. ఆర్సీబీ అభిమానుల దశాబ్దంన్నర కలను నిజం చేశారు. 16 ఏండ్లుగా అబ్బాయిలు సాధించలేకపోతున్న ట్రోఫీ కలను.. డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసి నిజం చేశారు.
WPL 2024 Final | 17 సంవత్సరాల కల నెరవేరింది. బెంగళూరు బెంగ తీరింది. 2008లో ఐపీఎల్ మొదలైన నాటి నుంచి గత సీజన్ వరకూ ట్రోఫీ కోసం పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడుతున్న ఆ జట్టుకు ఎట్టకేలకు ‘ఛాంపియన్’ హోదా దక్కింది. కీలక మ్యాచ్‌లలో ఓటములను అలవాటుగా చేసుకుని సమిష్టితత్వాన్ని డ్రెస్సింగ్ రూమ్‌లో వదిలిపెట్టి అభిమానుల ఆశలను అడియాసలు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు ఆ జట్టు ఫ్యాన్స్ సగర్వంగా కాలర్ ఎగరేసే ప్రదర్శన చేసింది. ఐపీఎల్లో ప్రతి సీజన్ మొదలయ్యే ముందు ‘ఈ సాలా కప్ నమ్దే’ అంటూ హంగామా చేసి తీరా కీలక మ్యాచ్‌లలో ఓడిపోతూ ఉత్తచేత్తో వెనుదిరిగే పురుషుల జట్టుకు అందని ద్రాక్షగా ఉన్న ‘టైటిల్ విజేత’ కలను ఉమెన్స్ ప్రీమియర్ల లీగ్ (డబ్ల్యూపీఎల్)లో అమ్మాయిలు నెరవేర్చారు. తొలి సీజన్లో పురుషుల జట్టు మాదిరిగానే విఫలమైనా రెండో సీజన్లో మాత్రం విజేతగా నిలిచారు. డబ్ల్యూపీఎల్ – 2024 ఫైనల్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించిన ఆర్సీబీ ఛాంపియన్స్‌గా తొలి ట్రోఫీని సొంతం చేసుకుంది.
ఢిల్లీని కూల్చిన స్పిన్ త్రయం..
ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముగిసిన ఫైనల్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 18.3 ఓవర్లలో 113 పరుగులకే కట్టడి చేసిన ఆర్సీబీ తర్వాత లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ ఓడి మొదట బౌలింగ్ చేసిన బెంగళూరు.. ఢిల్లీ క్యాపిటల్స్‌ను స్పిన్‌తో తిప్పేసింది. ఆర్సీబీ స్పిన్ త్రయం శ్రేయాంక పాటిల్ (4/12), సోఫీ మొలినెక్స్ (3/20), ఆశా శోభన (2/14)లు కట్టడిచేయడంతో ఢిల్లీ మొదట 113 పరుగులకే ఆలౌట్ అయింది. షఫాలీ వర్మ (27 బంతుల్లో 44, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా మెగ్ లానింగ్ (23), రాధా యాదవ్ (12), అరుంధతి రెడ్డిలు (10)లు మినహా మిగిలినవారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
స్పల్ప ఛేదనలో..
స్వల్ప ఛేదనలో ఆర్సీబీ ఏమాత్రం హర్రీబెర్రీ లేకుండా ఆడింది. ఓపెనర్లు స్మృతి మంధాన (39 బంతుల్లో 31, 3 ఫోర్లు), సోఫీ డెవిన్ (27 బంతుల్లో 32, 5 ఫోర్లు, 1 సిక్సర్) లు 8 ఓవర్లలో 49 పరుగులు జోడించారు. శిఖా పాండే.. డెవిన్‌ను ఔట్ చేసి ఢిల్లీకి తొలి బ్రేక్ ఇచ్చింది. కానీ.. ఎల్లీస్ పెర్రీ (35 బంతుల్లో 37 నాటౌట్, 4 ఫోర్లు), మంధానలు రెండో వికెట్‌కు 33 పరుగులు జోడించారు. ఈ ఇద్దరూ ఆచితూచి ఆడుతూ ఆ జట్టును విజయం వైపు నడిపించారు. ఆర్సీబీ విజయానికి మరో 32 పరుగులు అవసరమనగా మంధాన ఔట్ అయినా.. పెర్రీ ఆ జట్టును విజయతీరాలకు చేర్చింది. ఆఖరి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీకి ఓటమి తప్పలేదు. రిచా ఘోష్ (14 బంతుల్లో 17 నాటౌట్, 2 ఫోర్లు) గెలుపు పరుగులు చేసింది.
Ee Sala Cup N̶a̶m̶d̶e̶ Namdu! 🏆🥹#PlayBold #ನಮ್ಮRCB #SheIsBold #WPL2024 #WPLFinal #DCvRCB pic.twitter.com/jkubj1MRy6
— Royal Challengers Bangalore (@RCBTweets) March 17, 2024
ఆర్సీబీ తొలిసారి..
ఐపీఎల్లో ఆరంభ సీజన్ (2008) నుంచి ఆడుతున్నా ఆర్సీబీ ఇంతవరకూ ట్రోఫీని నెగ్గలేదు. 2009, 2011, 2016లలో ఆ జట్టు ఫైనల్ చేరినా ట్రోఫీ నెగ్గలేకపోయింది. దిగ్గజ క్రికెటర్లు ఆడిన ఆర్సీబీకి పురుషుల ఇంతవరకూ కప్ నెగ్గకపోయినా అమ్మాయిలు మాత్రం రెండో ప్రయత్నంలోనే ఆ కల తీర్చారు.
ఢిల్లీకి రెండో‘సారీ’..
ఢిల్లీ కూడా పురుషుల ఐపీఎల్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు అనుబంధ ఫ్రాంచైజీనే.. ఈ జట్టు సైతం 2008 నుంచే ఐపీఎల్ (ఢిల్లీ డేర్ డెవిల్స్) లో ఉన్నా మధ్యలో పేర్లు మార్చుకున్నా ఆ జట్టు కూడా ట్రోఫీ నెగ్గలేదు. డబ్ల్యూపీఎల్‌లో రెండుసార్లు ఫైనల్ చేరినా తుదిపోరులో ఢిల్లీ రెండుసార్లూ రన్నరప్‌గానే నిలిచింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

