WPL 2023 : మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మూడు వికెట్లు కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న ఓపెనర్ హేలీ మ్యాథ్యూస్ హాఫ్ సెంచరీకి ముందు (47) ఔట్ అయింది. షాట్‌కు ప్రయత్నించి గార్డ్నర్ బౌలింగ్‌లో బౌల్డ్ అయింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (12), అమేలియా కేర్ (1) క్రీజులో ఉన్నారు. 11 ఓవర్లు పూర్తయ్యేసరికి ముంబై ఇండియన్స్ మూడు వికెట్ల నష్టానికి 87 రన్స్ చేసింది.
అంతకుముందు ఓవర్లో నాట్ సీవర్ బ్రంట్ (23)ఔట్ అయింది. జార్జియా వారేహమ్ ఓవర్లో లాంగాఫ్‌లో షాట్ ఆడింది. స్నేహ్ రానా సూపర్ క్యాచ్ అందుకోవడంతో బ్రంట్ వెనుదిరిగింది. దాంతో, 69 పరుగుల వద్ద రెండో వికెట్ పడింది. నాట్ సీవర్ బ్రంట్, హేలీ మ్యాథ్యూస్ (42) ధాటిగా ఆడుతూ ఫిఫ్టీ పార్ట్నర్షిప్ నిర్మించారు. రెండో వికెట్‌కు ఈ ఇద్దరూ 54 రన్స్ చేశారు. ఓపెనర్ యస్తి భాటియా(1)ను తనుజా కన్వార్ మూడో ఓవర్లోనే ఔట్ చేసింది.