WPL 2023 | హర్మన్‌ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీ.. ముంబై ఇండియన్స్ స్కోర్ ఎంతంటే..?
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీ బాదింది. ఈ లీగ్‌లో తొలి ఫిఫ్టీ నమోదు చేసింది. 22 బంతుల్లో అర్ధ శతకానికి చేరువైంది. 15.3 ఓవర్లు పూర్తయ్యేసరికి ముంబై ఇండియన్స్ స్కోర్.. 154/3
WPL 2023 : మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీ బాదింది. ఈ లీగ్‌లో తొలి ఫిఫ్టీ నమోదు చేసింది. 22 బంతుల్లో అర్ధ శతకానికి చేరువైంది. మోనికా పటేల్ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు కొట్టింది. ముంబై కెప్టెన్ గ్యాప్స్‌లో బౌండరీలు కొడుతూ గుజరాత్ జెయింట్స్ బౌలర్లపై విరుచుకు పడింది. అమేలియా కేర్‌తో కలిసి నాలుగో వికెట్‌కు యాభైకి పైగా పరుగులు జోడించింది. ఓపెనర్ హేలీ మ్యాథ్యూస్ హాఫ్ సెంచరీకి ముందు (47) ఔట్ అయింది. 15.3 ఓవర్లు పూర్తయ్యేసరికి ముంబై ఇండియన్స్ స్కోర్.. 154/3.
69 పరుగుల వద్ద నాట్ సీవర్ బ్రంట్ (23) రెండో వికెట్‌గా వెనుదిరిగింది. నాట్ సీవర్ బ్రంట్, హేలీ మ్యాథ్యూస్ ధాటిగా రెండో వికెట్‌కు 54 రన్స్ చేశారు. ఓపెనర్ యస్తి భాటియా(1)ను తనుజా కన్వార్ మూడో ఓవర్లోనే ఔట్ చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

