వాషింగ్టన్: ఈ ఏడాది జూన్, జూలైలో యూఎస్ఏ, కెనడా, మెక్సికో ఆతిథ్యమివ్వనున్న ఫుట్బాల్ ప్రపంచకప్లో ఫైనల్ మ్యాచ్కు నాలుగు ప్రత్యేక టికెట్లకు ఫిఫా రికార్డు ధరను నిర్ణయించింది. నాలుగు స్పెషల్ సీట్లలో ఒక్కో దానిని రూ. 21 కోట్లు (2.3 మిలియన్ డాలర్లు) గా నిర్ణయించింది. ఫైనల్ మ్యాచ్ జరుగనున్న న్యూజెర్సీలోని మెట్లైఫ్ స్టేడియంలో గోల్ పోస్ట్ వెనుక భాగంలోని లోయర్ డెక్లోని బ్లాక్-124 లైన్-45లో 33-36 నంబర్ గల సీట్ల ధరను రూ. 21 కోట్ల (ఒక్కోటి)గా నిర్ణయించింది. వీటితో పాటు స్టేడియంలో మిగిలిన సీట్ల ధరలనూ వెల్లడించిన ఫిఫా.. లోయెస్ట్ టికెట్ ధరను రూ. 10 లక్షలుగా నిర్ణయించింది. టికెట్ల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయంతో తమ సభ్య దేశాల్లో ఫుట్బాల్ క్రీడాభివృద్ధికి వినియోగిస్తామని ఫిఫా తెలిపింది.