RCB vs CSK | టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్.. అందరి కళ్లన్నీ శాంసన్‌పైనే ..!
RCB vs CSK : ఈ సీజన్లో రెండు ఓటముల నుంచి తేరుకొని బోణీ కొట్టాలనే కసితో ఉన్న సీఎస్కే బౌలింగ్ ఎంచుకుంది. గత మూడు మ్యాచుల్లో చెన్నైని ఓడించిన ఆర్సీబీ నాలుగో విజయంపై కన్నేసింది.
RCB vs CSK : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ రెండో డబుల్ హెడర్ రెండో మ్యాచ్‌కు వేళైంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఈ సీజన్లో రెండు ఓటముల నుంచి తేరుకొని బోణీ కొట్టాలనే కసితో ఉన్న సీఎస్కే బౌలింగ్ ఎంచుకుంది. గత మూడు మ్యాచుల్లో చెన్నైని ఓడించిన ఆర్సీబీ నాలుగో విజయంపై కన్నేసింది. చిన్న బౌండరీలుండే చిన్నస్వామిలోనైనా సంజూ శాంసన్ చెలరేగాలని సీఎక్కే ఆశిస్తోంది.
ఐపీఎల్ తొలినాళ్లలో సీఎస్కే దెబ్బకు ఆర్సీబీ వణికిపోయేది. ఇప్పటివరకూ 34సార్లు ఇరుజట్లు తలపడగా.. 21 విజయాలతో చెన్నై ఆధిపత్యం చెలాయించింది. కానీ, గత మూడు మ్యాచుల్లో ఆర్సీబీ పైచేయి సాధించింది. హ్యాట్రిక్ విజయాలతో మమ్మల్ని తేలికగా తీసుకోవద్దని హెచ్చరికలు పంపింది. నిరుడు చిన్నస్వామిలో 2 పరుగుల తేడాతో, చెపాక్‌లో 50 రన్స్‌తో… 17వ సీజన్లో 27 పరుగుల తేడాతో చెన్నైని ఆర్సీబీ ఓడించింది.
Captains ready. Squads ready. Are you ready? 🍿
The stage is set for the ultimate SUNDAY BLOCKBUSTER 🔥
Updates ▶️ https://t.co/PkhPvxcU44#TATAIPL | #KhelBindaas | #RCBvCSK pic.twitter.com/9RxvM52iEp
— IndianPremierLeague (@IPL) April 5, 2026
అసలే ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఆడుతున్న రజత్ పాటిదార్ బృందం కసితో ఆడుతోంది. ధోనీ దూరమవ్వడం, సంజూ శాంసన్ వైఫల్యంతో ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో బ్యాటర్ల వైఫల్యం.. రెండో మ్యాచుల్లో బౌలర్ల వైఫల్యంతో పరాజయం పాలైన సీఎస్కే బోణీ కొట్టాలంటే బెంగళూరును ఓడించాల్సిందే.
ఆర్సీబీ తుది జట్టు : ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేశ్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్, అభినందన్ సింగ్, జాకబ్ డఫ్ఫీ.
సీఎస్కే తుది జట్టు : సంజూ శాంసన్(వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), ఆయుశ్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివం దూబే, ప్రశాంత్ వీర్, జేమీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, మ్యాట్ హెన్రీ, ఖలీల్ అహ్మద్.
ఇంప్యాక్ట్ సబ్స్ – సీఎస్కే : మాథ్యూ షార్ట్, అకీల్ హొసేన్, కార్తిక్ శర్మ, రామక్రిష్ణ ఘోష్, గుర్జన్‌ప్రీత్ సింగ్.
ఆర్సీబీ : సుయాశ్ శర్మ, జాకబ్ బెథెల్, రసిక్ సలాం దార్, కనిష్క్ చౌహన్, వెంకటేశ్ అయ్యర్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

