Wimbledon : టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఒకటైన వింబుల్డన్ (Wimbledon)లో నవశకం మొదలవ్వనుంది. యూఎస్ ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్‌లో అమలులో ఉన్న వీడియో రివ్యూ వ్యవస్థ (Video Review System) ఈ టోర్నమెంట్లోనూ రాబోతోంది. దాంతో, చైర్ అంపైర్ తప్పుడు నిర్ణయాలను క్రీడాకారులు సవాల్ చేసే అవకాశం లభించనుంది. ఈ ఏడాది నుంచి వింబుల్డన్‌లో వీఆర్ఎస్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ విషయాన్ని శనివారం ఆల్ ఇంగ్లండ్ లాన్ టెన్నిస్ క్రొకెట్ క్లబ్ (AELTC) ధ్రువీకరించింది.
వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో కొత్తగా వీడియో రివ్యూ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నారు. ఆటగాళ్ల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ కొత్త సిస్టమ్‌ను తీసుకొస్తున్నారు. ఇప్పటికే యూఎస్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో విజయవంతమైన ఈ వ్యవస్థను వింబుల్డన్‌లోనూ కనిపించనుంది. ఈ ఏడాది నుంచే ఆరు కోర్టుల్లో ఈ వ్యవస్థను పాటించనున్నారు. సెంటర్ కోర్ట్, నంబర్ 1 కోర్టుతో పాటు చుట్టుపక్కల ఉండే షో కోర్టులో జరిగే మ్యాచ్‌లకు వీఆర్ఎస్ వర్తించనుంది.
🖥️ For the first time, a video review system will be used at Wimbledon this year.
The oldest Grand Slam tennis tournament will allow players to review specific calls made by the chair umpire, such a double bounces. pic.twitter.com/AQZsrLtKQO
— DW Sports (@dw_sports) March 21, 2026
‘ఇకపై టెన్నిస్ ప్లేయర్లు చైర్ అంపైర్ తీసుకునే కొన్ని నిర్ణయాలను సవాల్ చేయవచ్చు. నాట్ అప్, ఫౌల్ షాట్, టచ్ వంటి వాటిని వారు సమీక్షించవచ్చు. ఇవే కాకుండా పాయింట్ ఎండ్ కాల్ ఇవ్వడం, ప్లేయర్ హఠాత్తుగా ఆడడం మానేసినా లేదా పాయింట్ పూర్తి కాగానే ఆట ఆపేసినా వీడియో రివ్యూ సిస్టమ్‌ను ఉపయోగించి న్యాయం పొందవచ్చు.
మ్యాచ్ సమయంలో ఎన్ని వీడియో రివ్యూలైనా తీసుకోవచ్చు. నిరుడు ప్రవేశపెట్టిన లైవ్ ఎలక్ట్రానిక్ లైన్ కాలింగ్ వ్యవస్థ తర్వాత వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా వీఆర్ఎస్ తీసుకురావాలని నిర్ణయించాం’ అని ఇంగ్లండ్ లాన్ టెన్నిస్ క్రొకెట్ క్లబ్ (AELTC) వెల్లడించింది. ఈ ఏడాది జూన్ 29 నుంచి జూలై 12వ తేదీ వరకు వింబుల్డన్ జరుగనుంది.
Wimbledon to introduce video review technology for umpire calls, system to operate on six show courtshttps://t.co/lXbqHkpmcP
— The Telegraph (@ttindia) March 21, 2026