SRH Captain | హైదరాబాద్‌కు ఆస్ట్రేలియా కెప్టెన్లతో విడదీయలేని అనుబంధం.. కమిన్స్ ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తాడా..?
SRH Captain | కమిన్స్ సన్‌రైజర్స్‌కు సారథిగా నియమితుడవడంతో హైదరాబాద్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆస్ట్రేలియా కెప్టెన్లతో హైదరాబాద్ ఫ్రాంచైజీకి విడదీయరాని అనుబంధం ఉంది. ఐపీఎల్లో ఇంతవరకు హైదరాబాద్‌కు రెండు సార్లు ట్రోఫీని అందించింది ఆసీస్ ఆటగాళ్లే..
SRH Captain | రాబోయే ఐపీఎల్ సీజన్‌కు గాను సన్ రైజర్స్ హైదరాబాద్.. కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ వేలంలో ఏకంగా రూ. 20.50 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన పాట్ కమిన్స్‌ను సారథిగా నియమించింది. దక్షిణాఫ్రికాలో సన్ రైజర్స్ అనుబంధ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ ఈస్ట్రన్ కేప్‌కు బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీలను అందించిన మార్క్రమ్ను ఐపీఎల్లో సారథిగా తప్పించి కమిన్స్‌కు పగ్గాలు అప్పగించింది. కమిన్స్ సన్‌రైజర్స్‌కు సారథిగా నియమితుడవడంతో హైదరాబాద్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆస్ట్రేలియా కెప్టెన్లతో హైదరాబాద్ ఫ్రాంచైజీకి విడదీయరాని అనుబంధం ఉంది. ఐపీఎల్లో ఇంతవరకు హైదరాబాద్‌కు రెండు సార్లు ట్రోఫీని (ఒకసారి డెక్కన్ ఛార్జర్స్, మరోసారి సన్ రైజర్స్) అందించింది ఆసీస్ ఆటగాళ్లే..
ఐపీఎల్ ప్రారంభమైన కొత్తలో ఈ లీగ్‌లో భాగమైన డెక్కన్ ఛార్జర్స్‌కు సారథిగా ఆస్ట్రేలియా సారథి ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఉండగా.. 2009లో హైదరాబాద్ ట్రోఫీని నెగ్గింది. ప్రస్తుతం టీమిండియా సారథి రోహిత్ శర్మ అప్పుడు డెక్కన్ ఛార్జర్స్ టీమ్ మెంబర్. ఆ సీజన్ తర్వాత హైదరాబాద్ అభిమానులు ఐపీఎల్ ట్రోఫీ కోసం ఏడేండ్లు వేచి చూడాల్సి వచ్చింది.
ఏడేండ్ల ఎదురుచూపులకు మరో ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ తెరదించాడు. 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ (డెక్కన్ ఛార్జర్స్ అప్పటికే ఈ లీగ్ నుంచి వైదొలిగింది) కు సారథిగా నియమితుడైన వార్నర్ భాయ్.. ఆ ఏడాది ఐపీఎల్ ట్రోఫీపై భాగ్యనగరం పేరును సువర్ణాక్షరాలతో లిఖించాడు. వార్నర్ అయితే హైదరాబాద్ అభిమానుల ఆరాధ్య ఆటగాడు అయ్యాడు. మనదేశం కాకపోయినా వార్నర్‌ను ఇక్కడి ఫ్యాన్స్ అంతా వార్నర్ భాయ్ అని ప్రేమగా పిలిచేవారు. అతడు కూడా అంతే ప్రేమ చూపించేవాడు.
Adam Gilchrist won IPL in 2009.
David Warner won IPL in 2016.Pat Cummins…🔜 👀 pic.twitter.com/h5G1QcX1af
— ^ (@RebelStrFan) March 4, 2024
వార్నర్ తర్వాత హైదరాబాద్‌కు మళ్లీ ఆస్ట్రేలియా ఆటగాడు కమిన్స్ సారథిగా నియమితుడవడంతో అతడు కూడా గిల్‌క్రిస్ట్, వార్నర్ ల మ్యాజిక్‌ను రిపీట్ చేస్తాడని హైదరాబాద్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి కమిన్స్ గిల్లీ, వార్నర్ భాయ్‌ల బాటలో నడుస్తాడా..? అనేది త్వరలోనే తేలనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
Kenya | స్వర్గం పేరుతో 190 మంది పిల్లలకు ఆకలి చావులు.. కెన్యాలో మత గురువు మూఢ బోధనలు
TGSRTC | తిరుగు ప్రయాణమూ భారమే..! ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల్లో చార్జీల మోత
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

