న్యూయార్క్: త్వరలో మొదలుకానున్న యూ ఎస్ ఓపెన్‌లో విలియమ్స్ సిస్టర్స్ (వీనస్, సెరెనా)కు ఉమెన్స్ డబుల్స్‌లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ దక్కింది. 2022 తర్వాత తొలిసారిగా యూఎస్ ఓపెన్ బరిలో నిలిచిన ఈ అక్కాచెల్లెళ్లు.. గతంలో ట్రోఫీల పంట పండించిన ఈ టోర్నీలో ఏ మేరకు రాణిస్తారో చూడాలి. ఇప్పటికే సెరెనా.. మిక్స్డ్ డబుల్స్‌లో యువ సంచలనం కార్లొస్ అల్కరాజ్తో కలిసి మిక్స్డ్ డబుల్స్‌లో ఆడుతున్నది. తొలిరౌండ్లో నెగ్గిన ఈ జోడీ.. క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది.