IPL 2025 | ఐపీఎల్ 2025 సీజన్‌పై కీలక ప్రకటన చేసిన రాజీవ్ శుక్లా..!
IPL 2025 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌పై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కీలక సమాచారం అందించారు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఆలస్యంగా ప్రారంభమవుతుందని వెల్లడించారు.
IPL 2025 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌పై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కీలక సమాచారం అందించారు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఆలస్యంగా ప్రారంభమవుతుందని వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం మార్చి 14న ప్రారంభం కావాల్సి ఉండగా.. ఆలస్యంగా మార్చి 23 నుంచి ప్రారంభవుతుందని, మే 25న ఫైనల్ ఉంటుందని పేర్కొన్నారు. అయితే, ప్లేఆఫ్, ఫైనల్ మ్యాచ్ తేదీలపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కొత్త షెడ్యూల్‌కు సంబంధించిన పనులు త్వరలోనే షురూ కానున్నాయి. బీసీసీఐ ప్రత్యేక సమావేశం జరిగింది. ఇందులో ఐపీఎల్ 18వ ఎడిషన్ ప్రారంభంపై చర్చించారు. లీగ్‌లో మొదటి మ్యాచ్‌ను ఏ జట్లు ఆడతాయనే దానిపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకే ఎజెండాతో సమావేశం జరిగిందని.. అది కార్యదర్శి నియామకానికి సంబంధించిందేనన్నారు. ఈ సందర్భంగా ఐపీఎల్ కమిషనర్‌ను సైతం ఏడాది కాలానికి యిమించినట్లు తెలిపారు. దాంతో పాటు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌పై స్పందించారు. లీగ్ వేదికలను నిర్ణయించామని.. త్వరలోనే ప్రకటిస్తామన్నారు.
ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కీలక అంశాలపై చర్చించారు. మళ్లీ ఈ నెల 18, 19న సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. భేటీలో ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ప్రదర్శనపై సైతం చర్చించినట్లు తెలుస్తున్నది. అలాగే, ఐపీఎల్ విషయంలోనూ చర్చ జరిగింది. ఈ సందర్భంగా మార్చి 14 నుంచి 23కి మార్చారు. అయితే, ఐపీఎల్ తేదీలను ఎందుకు మార్చారన్న విషయంలో స్పష్టత లేదు. ప్రస్తుతం షెడ్యూల్‌ను తయారీ చేస్తుండగా.. త్వరలోనే వివరాలను బీసీసీఐ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించి ఇప్పటికే మెగా వేలం ముగిసింది. జెడ్డా వేదికగా వేలం నిర్వహించింది. ఈ వేలంలో టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్‌కు రూ.27కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ సొంతంచేసుకుంది.
#WATCH | Mumbai: BCCI Vice President Rajeev Shukla says, “Devajit Saikia elected new BCCI secretary and Prabhtej Singh Bhatia elects as BCCI treasurer…IPL is going to start from 23rd March…” pic.twitter.com/Jd6x7U8Hou
— ANI (@ANI) January 12, 2025
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

