వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
ఫోర్లు, సిక్సర్ల మోత మోగుతూ భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో భారత్‌పై వెస్టిండీస్‌దే పైచేయి. శుక్రవారం రాంచీలో జరిగిన రెండో టీ20లో పవర్ఫుల్ హిట్టర్లతో కూడిన ఆ జట్టు.. 250 పరుగుల లక్ష్యాన్ని మరో 9 బంతులు మిగిలుండగానే బాదేసి ఆరు వికెట్ల తేడాతో రికార్డు విజయాన్ని అందుకుంది.
- రెండో టీ20లో రికార్డు విజయం
- హోప్ అజేయ శతకం
- శాంసన్ మెరుపులు వృథా
టీ20 ఫార్మాట్లో వెస్టిండీస్ ఎంత డేంజరో మరోసారి నిరూపితమైంది. కరీబియన్ హిట్టర్లు కసిగా కొడితే ఎదురుగా ఏ జట్టు ఉన్నా.. లక్ష్యం ఎంత పెద్దదైనా చిన్నబోవడం ఖాయమని ఇంకోసారి ప్రపంచానికి తెలిసింది. రాంచీలో భారత బౌలర్లను రఫ్ఫాడించిన విండీస్ వీరులు.. 250 పరుగులు లక్ష్యాన్ని 9 బంతులు మిగిలుండగానే అలవోకగా ఊదేశారు. తొలి నాలుగు బంతులకే రెండు వికెట్లు కోల్పోయి ఓటమి తప్పదనుకున్న వేళ ఆతిథ్య బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ కెప్టెన్ షై హోప్, షెర్పెన్ రూథర్‌ఫర్డ్ ఓ రేంజ్లో విజృంభించడంతో రెండో టీ20లో విండీస్ అద్భుత విజయం అందుకుంది. దాంతో టీ20ల్లో వరుసగా పది విజయాల భారత జైత్రయాత్రకు బ్రేక్ పడింది. ఫలితం ఎలా ఉన్నా రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 501 పరుగులు నమోదైన రాంచీ పోరు అభిమానులకు అసలైన టీ20 మజాను అందించింది.
రాంచీ : ఫోర్లు, సిక్సర్ల మోత మోగుతూ భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో భారత్‌పై వెస్టిండీస్‌దే పైచేయి. శుక్రవారం రాంచీలో జరిగిన రెండో టీ20లో పవర్ఫుల్ హిట్టర్లతో కూడిన ఆ జట్టు.. 250 పరుగుల లక్ష్యాన్ని మరో 9 బంతులు మిగిలుండగానే బాదేసి ఆరు వికెట్ల తేడాతో రికార్డు విజయాన్ని అందుకుంది. వన్డే సిరీస్‌లో రెండు సెంచరీలతో జబర్దస్త్ ఫామ్‌లో ఉన్న కెప్టెన్ షై హోప్ (45 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్స్‌లతో 102 నాటౌట్) టీ20ల్లోనూ అదే జోరును కొనసాగిస్తూ అజేయ శతకంతో రెచ్చిపోగా షెర్ఫెన్ రూథర్‌ఫర్డ్ (37 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 84) వీరవిహారం చేయడంతో ఈ ఫార్మాట్లో కరీబియన్ జట్టు అత్యధిక ఛేదనను విజయవంతంగా పూర్తిచేసి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. మొదట సంజూ శాంసన్ (41 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 82) మెరుపులకు తోడు తిలక్ వర్మ (18 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 44 నాటౌట్), ఇషాన్ కిషన్ (43) రెచ్చిపోవడంతో భారత్ నిర్ణీత ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 249 పరుగుల భారీ స్కోరు సాధించింది. హోప్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇరు జట్ల మధ్య మూడో టీ20 ఆదివారం ఇండోర్‌లో జరుగుతుంది.
రూథర్‌ఫర్డ్ వీరవిహారం
5/2. కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు క్రీజులోకి వచ్చిన విండీస్ స్కోరిది. తొలి ఓవర్లోనే మయాంక్ మ్యాజిక్ చేయడంతో కమిల్ (4)తో పాటు ప్రమాదకర హిట్మయర్ వికెట్లను కోల్పోయిన విండీస్ అద్భుతంగా పుంజుకుంది. కెప్టెన్ షై హోప్ బౌండరీలతో విరుచుకుపడగా పావెల్ (24) సైతం వేగంగా ఆడి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. అక్షర్ ఓవర్లో 4, 6, 4తో హోప్ రెచ్చిపోతే అర్ష్‌దీప్ ఓవర్లో పావెల్ రెండు ఫోర్లు బాదాడు. ఈ క్రమంలో సెకండ్ స్పెల్‌కు వచ్చిన మయాంక్.. 149.5 కిలోమీటర్ల వేగంతో వేసిన బంతి పావెల్ ఆఫ్‌స్టంప్‌ను ఎగురగొట్టింది. కానీ అతడి స్థానంలో వచ్చిన రూథర్‌ఫర్డ్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. కెప్టెన్‌తో కలిసి దొరికిన బంతిని దొరికనట్టు బాదడంతో లక్ష్యం కరిగిపోయింది. రావడం రావడమే రెండు బౌండరీలు, 92 మీటర్ల భారీ సిక్స్ బాదిన అతడు పరుగుల వేటను ధాటిగా ఆరంభించాడు. మరో ఎండ్‌లో హోప్ కూడా దూబే 9వ ఓవర్లో సిక్స్‌తో సిరీస్‌లో వరుసగా రెండో అర్ధశతకాన్ని సాధించాడు. క్రీజులో కుదురుకున్న రూథర్‌ఫర్డ్.. అక్షర్ వేసిన 12వ ఓఓవర్లో 6, 4, 4, 6 బాదడంతో విండీస్ స్కోరు 150 పరుగుల మార్కును దాటేసింది. 24 బంతుల్లోనే అతడి ఫిఫ్టీ సైతం పూర్తయింది.
ముగించిన కెప్టెన్
రూథర్‌ఫర్డ్, హోప్ దూకుడుతో 14 ఓవర్లకు 178/3తో లక్ష్యం దిశగా సాగిన వెస్టిండీస్‌కు కుల్దీప్ షాకిచ్చాడు. 15వ ఓవర్లో బంతినందుకున్న అతడు.. తొలి బంతికి రూథర్‌ఫర్డ్‌ను ఔట్ చేసి మ్యాచ్‌లో అయ్యర్ సేనను మళ్లీ పోటీలోకి తెచ్చాడు. హోప్, రూథర్‌ఫర్డ్ నాలుగో వికెట్‌కు 54 బంతుల్లోనే 120 రన్స్ జతచేయడం విశేషం. అయితే రూథర్‌ఫర్డ్ నిష్క్రమించినా షెఫర్డ్ (13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34 నాటౌట్) అండతో సారథి గెలుపు బాధ్యతను తీసుకున్నాడు. కుల్దీప్ వేసిన 17వ ఓవర్లో రెండు సిక్స్‌లు బాదగా షెఫర్డ్ సైతం 6, 4తో విండీస్ విజయం దాదాపుగా ఖాయమైంది. అక్షర్ ఓవర్లో 2 సిక్స్‌లతో సెంచరీతో పాటు మ్యాచ్ ముగించాడు.

శాంసన్ దంచినా..
భారత ఇన్నింగ్స్‌లో ఓపెనర్ సంజూ ఆటే హైలైట్. టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన జట్టుకు మెరుపు ఆరంభం ఇచ్చిన అతడు జట్టు భారీ స్కోరుకు బాటలు పరిచాడు. మరో యువ ఓపెనర్ అభిషేక్ (20) ఉన్నంతసేపు దూకుడుగా ఆడాడు. తొలి ఓవర్లోనే సిక్స్ కొట్ట్టిన అతను షెఫర్డ్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు రాబట్టాడు. మరోవైపు అకీల్ హుస్సేన్ వేసిన మూడో ఓవర్లో ఫోర్ కొట్టిన వెంటనే శాంసన్ ఇచ్చిన క్యాచ్‌ను పూరన్ వదిలేశాడు. దీనికి విండీస్ భారీ మూల్యమే చెల్లించుకుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సంజూ తర్వాతి బంతినే సిక్స్‌గా మలిచాడు. ఛేజ్ బౌలింగ్‌లో అభి ఔటయ్యాక శాంసన్ ఒక్కసారిగా రెచ్చిపోయాడు. తన మార్కు పవర్ఫుల్ షాట్లతోఅకీల్ వేసిన ఐదో ఓవర్లో వరుసగా 4, 6, 6, 4తో స్టేడియాన్ని హోరెత్తించాడు.
42 పరుగుల వద్ద మరో క్యాచ్ డ్రాప్‌తో బతికిపోయిన అతను వరుసగా రెండు ఫోర్లతో 21 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఇంకో ఎండ్‌లో వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ ఇషాన్ కూడా ధాటిగా ఆడటంతో స్కోరుబోర్డు జెట్ స్పీడ్‌లో దూసుకెళ్లింది. షమార్ జోసెఫ్ బౌలింగ్‌లో సంజూ ఫోర్ కొడితే ఇషాన్.. 6, 4, 4 బాదడంతో సగం ఓవర్లకే భారత్ 127/1తో నిలిచింది. ఈ దశలో విండీస్ బౌలర్లు పుంజుకున్నారు. అర్ధ శతకం ముంగిట ఇషాన్‌తో పాటు శివం దూబే (7)ను ఛేజ్ వరుస ఓవర్లలో బౌల్డ్ చేశాడు. సెంచరీ చేస్తాడని అనుకున్న శాంసన్ కూడా వెనుదిరగడంతో భారత జోరుకు కాస్త బ్రేక్ పడింది. ఈ సమయంలో కెప్టెన్ అయ్యర్(40), వైస్ కెప్టెన్ తిలక్ బాదుడు బాధ్యతను భుజానికెత్తుకున్నారు. వీరి దూకుడుతో ఆఖరి ఐదు ఓవర్లలో భారత్ ఏకంగా 80 పరుగులు రాబట్టింది.
2 టీ20ల్లో ఇది రెండో అత్యధిక లక్ష్య ఛేదన. 2023లో సౌతాఫ్రికా అత్యధికంగా 259 రన్స్ టార్గెట్ (విండీస్‌పై) ఛేజ్ చేసింది.
సంక్షిప్త స్కోర్లు
భారత్: 20 ఓవర్లకు 249/5 (శాంసన్ 82, తిలక్ 44నాటౌట్, ఛేజ్ 3/24);
వెస్టిండీస్: 18.3 ఓవర్లకు 252/4 (హోప్ 102 నాటౌట్, రూథర్‌ఫర్డ్ 84, మయాంక్ 3/36, కుల్దీప్ 1/53)
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

