West Indies Squad | ‘గబ్బా టెస్టు హీరో’కు గాయం.. వెస్టిండీస్ స్క్వాడ్‌లో యువ ఆల్‌రౌండర్
West Indies Squad : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 పట్టికలో వెనకబడిన వెస్టిండీస్ (West Indies)కు గట్టి షాక్ తగిలింది. భారత పర్యటనలో రెండు టెస్టుల సిరీస్ గెలుపొందాలనుకున్న ఆ జట్టు యువ పేసర్ షమర్ జోసెఫ్ (Shamar Joseph) గాయపడ్డాడు.
West Indies Squad : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 పట్టికలో వెనకబడిన వెస్టిండీస్ (West Indies)కు గట్టి షాక్ తగిలింది. భారత పర్యటనలో రెండు టెస్టుల సిరీస్ గెలుపొందాలనుకున్న ఆ జట్టు యువ పేసర్ షమర్ జోసెఫ్ (Shamar Joseph) గాయపడ్డాడు. గబ్బా టెస్టులో ఆస్ట్రేలియా నడ్డివిరిచిన షమర్ జోసెఫ్ రెండు టెస్టు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా పోస్ట్ ద్వారా విండీస్ క్రికెట్ వెల్లడించింది. షమర్ స్థానంలో 22 ఏళ్ల ఆల్‌రౌండర్ జొహన్ లేనే (Johann Layne)ను స్క్వాడ్‌లోకి ఎంపిక చేశారు సెలెక్టర్లు. పేస్దళంలోని షమర్ గాయపడడంతో స్క్వాడ్‌లోకి వచ్చిన జొహన్ది కూడా బార్బడోస్.
పేస్ ఆల్‌రౌండర్ అయిన జొహన్కు భారత పర్యటనే తొలి అంతర్జాతీయ సిరీస్. ఇప్పటివరకూ 19 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడిన అతడు ఈ సిరీస్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడు. బ్యాటుతోనే కాదు బంతితోనూ చెలరేగిపోయే జొహన్ దేశవాళీలో 495 రన్స్ చేయడమే కాకుండా 66 వికెట్లతో అదరగొట్టాడు. ఇందులో నాలుగు పర్యాయాలు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడీ యంగ్‌స్టర్. దాంతో.. భావి తరగా ఎదుగుతున్న జొహన్కు భారత పర్యటన అద్భుత అవకాశం కానుంది.
Squad Update 🚨
Johann Layne has replaced Shamar Joseph in the squad for the test series against India.
Joseph has been ruled out due to an injury and will be re-evaluated ahead of the Bangladesh limited overs series.#INDvsWI | #MenInMaroon pic.twitter.com/2z5uiZSicu
— Windies Cricket (@windiescricket) September 26, 2025
ఇంగ్లండ్ పర్యటన తర్వాత స్వదేశంలో శుభ్‌మన్ గిల్ సేనకు ఇదే మొదటి టెస్టు సిరీస్. విండీస్, టీమిండియా మధ్య అక్టోబర్ 2న అహ్మదాబాద్‌లో తొలి టెస్టు మొదలవ్వనుంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పట్టికలో భారత జట్టు మూడో స్థానంలో ఉండగా.. కరీబియన్ టీమ్ ఆరో స్థానంలో ఉంది.
వెస్టిండీస్ స్క్వాడ్ : రోస్టన్ ఛేజ్(కెప్టెన్), జొమెల్ వర్రికన్(వైస్ కెప్టెన్), కెవ్లన్ అండర్సన్, అలిక్ అథనజే, జాన్ క్యాంప్‌బెల్, తగెనరైన్ చందర్‌పాల్, జస్టిన్ గ్రేవ్స్, షాయ్ హోప్, టెవిన్ ఇమ్లాచ్, అల్జారీ జోసెఫ్, జొహన్ లేనే, బ్రాండన్ కింగ్, అండరన్సర్ ఫిలిప్, ఖారీ ఫీఎర్రీ, జైడన్ సీల్స్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

