బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో ఘోర పరాజయం పాలైన వెస్టిండీస్.. రెండో టెస్టులో పోరాడుతున్నది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన విండీస్ గురువారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసింది.
జాషువా (79), కావెమ్ (71) అర్ధశతకాలు సాధించడంతో విండీస్ మంచి స్కోరు చేయగలిగింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ 4, హజిల్‌వుడ్ రెండు వికెట్లు పడగొట్టారు.