Mbappe | మేము మళ్లీ వస్తాం.. ప్రపంచ కప్ ఓటమి తర్వాత ఎంబాపే తొలి పోస్ట్
వరల్డ్ కప్ ఫైన్లలో హ్యాట్రిక్ గోల్స్ కొట్టిన రెండో ఆటగాడిగా ఎంబాపే
Mbappe: ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో షూటౌట్లో ఫ్రాన్స్ 2-4తో అర్జెంటీనాపై ఓడిపోయింది. మ్యాచ్ ఓడినా కూడా ఆ జట్టు అందరి మనసులు గెలుచుకుంది. అందుకు కారణం.. హ్యాట్రిక్ గోల్స్ చేసిన ఫ్రాన్స్ ఆటగాడు కైలియన్ ఎంబాపే. గోల్డెన్ బూట్ అందుకున్నప్పుడు కూడా ఈ 23 ఏళ్ల ప్లేయర్ కప్పు చేజారిందనే విచారంతోనే ఉండిపోయాడు. మ్యాచ్ అనంతరం మొదటిసారి అతను సోషల్‌మీడియాలో స్పందించాడు. గోల్డెన్ బూట్ పట్టుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ‘మేము మళ్లీ వస్తాం’ అని రాసుకొచ్చాడు. అతని పోస్టుకు బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ‘నువ్వు యోధుడివి. ఈసారి నీ టైమ్’ అంటూ కామెంట్ చేశాడు. ఇప్పటికే ఎంబాపే పోస్ట్‌ను 90 లక్షల మందికిపైగా లైక్ చేశారు.
రెండో అర్థభాగంలో ఎంబాపే రెండు నిమిషాల వ్యవధిలోనే 2 గోల్స్ గొట్టి స్కోర్ సమం చేశాడు. ఆ తర్వాత కూడా హ్యాట్రిక్ గోల్స్ జట్టుని విజయం అంచుల దాకా తీసుకెళ్లాడు. అంతేకాదు ఫెనాల్టీ షూట్లోనూ బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపాడు. కానీ మిగతా ఆటగాళ్లు విఫలం కావడంతో ఆ జట్టు ఓటమి పాలైంది. ఆ క్షణం ఈ యువ ఆటగాడి గుండె పగిలినంత పనైంది. దిగాలుగా ఉండిపోయిన ఎంబాపేను ఫ్రాన్స్ అధ్యక్షుడు మక్రాన్ ఓదార్చాడు. ఈ టోర్నీలో ఎంబాపే అత్యధికంగా 8 గోల్స్ చేశాడు. వరల్డ్ కప్ ఫైన్లలో హ్యాట్రిక్ గోల్స్ కొట్టిన రెండో ఆటగాడిగా ఎంబాపే చరిత్ర సృష్టించాడు. మొత్తంగా అతను ఫిఫా వరల్డ్ కప్‌లో 12 గోల్స్ సాధించాడు. ఫైనల్లో విజయంతో అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ తన వరల్డ్ కప్ కలను నెరవేర్చుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

