SA Captain Temba Bavuma | ఆ రికార్డు బద్దలు కొడతాం: బవుమా
SA Captain Temba Bavuma | స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో పరాజయం ఎరగకుండా దూసుకెళ్తున్న భారత జట్టుకు.. ఓటమి రుచి చూపిస్తామని దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా పేర్కొన్నాడు.
SA Captain Temba Bavuma | ప్రతిష్ఠాత్మక వన్డే వరల్డ్‌కప్‌లో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి ఫుల్ జోష్‌లో ఉన్న టీమ్ఇండియాకు పరాజయం రుచి చూపిస్తామని దక్షిణాఫ్రికా జట్టు సారథి బవుమా అన్నాడు. మెగాటోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో ఆడిన తొలి మ్యాచ్‌లో ఘనవిజయం సాధించిన రోహిత్ సేన ఆ తర్వాత వరుసగా అఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంకపై విజయాలు సాధించి 14 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలువడంతో పాటు.. ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది.
టోర్నీలో భాగంగా ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు రోజు సఫారీ జట్టు సారథి బవుమా మాట్లాడుతూ.. ‘టోర్నీలో అపజయం లేకుండా సాగుతున్న భారత్ రికార్డును బ్రేక్ చేస్తాం. సొంతగడ్డపై ఆ జట్టు చాలా కఠిన ప్రత్యర్థి. అయినా.. మా దగ్గర తగిన వ్యూహాలు ఉన్నాయి. వాటిని మైదానంలో ఆచరణలో పెడతాం. తప్పక భారత్‌పై విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది’ అని అన్నాడు.
దాదాపు 80 వేల మంది అభిమానులు ఈ మ్యాచ్‌కు హాజరు కానుండగా.. ప్రేక్షకుల హోరుతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని బవుమా అన్నాడు. ‘భారీ జన సందోహం ముందు ఆడటం ఎవరికైనా ఇష్టమే. అందులో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకా చెప్పాలంటే అది మమ్మల్ని మరింత ఉత్సాహ పరుస్తుంది. స్టేడియం మొత్తం బ్లూ జెర్సీలు నిండిపోతాయని మాకు తెలుసు. అయినా మా ప్రణాళికలను అమలు చేస్తే తప్పక విజయం సాధిస్తాం. ఒక్కో ఆటగాడి కోసం ప్రత్యేకంగా వ్యూహాలు రచించాం’ అని బవుమా పేర్కొన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
Water Tankers | సిద్దిపేట జిల్లాలో ట్యాంకర్లతో పొలం పారిస్తున్న రైతన్న.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

