Brazil Football Club | అందుకనే రొనాల్డోతో ఒప్పందం కుదరలేదు : బ్రెజిల్ ఫుట్‌బాల్ క్లబ్ అధ్యక్షుడు
రూ.17వేల కోట్లకు రొనాల్డోతో నస్రీ క్లబ్ ఒప్పందం
Brazil Football Club : పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోతో ఒప్పందం కుదుర్చుకునేందుకు చాలా క్లబ్స్ పోటీపడ్డాయి. అయితే.. చివరకు సౌదీ అరేబియాకు చెందిన అల్ నస్రీ క్లబ్ అతడిని భారీ ధరకు సొంతం చేసుకుంది. రొనాల్డోతో ఒప్పందం కుదరకపోవడంపై బ్రెజిల్‌కు చెందిన కొరింథియన్స్ క్లబ్ అధ్యక్షుడు డులియో మాంటెయిరో అల్వెస్ పెదవి విప్పాడు. ‘మాంచెస్టర్ యునైటెడ్‌తో ఒప్పందం రద్దయ్యాక మేము రొనాల్డోతో సంప్రదింపులు జరిపాం. ఆ క్లబ్లో అతడికి ఎంత ఇస్తున్నారో అంత సొమ్ము ఆఫర్ చేశాం. యూరప్‌కు చెందిన కొన్ని క్లబ్స్ రొనాల్డోను కొనేందుకు రెడీగా ఉన్నాయి. అయితే.. సౌదీ అరేబియా ఫుట్‌బాల్ క్లబ్ మాకంటే 20 రెట్లు ఎక్కువ డబ్బు ఆఫర్ చేసింది. దాంతో, అతడితో కాంట్రాక్ట్ కుదుర్చుకోలేక పోయాం’ అని అల్వెస్ వెల్లడించాడు.
సౌదీ అరేబియాకు చెందిన నస్రీ క్లబ్ గతవారం రొనాల్డోతో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. 200 మిలియన్ యూరోల (రూ.17వేల కోట్లు)కు అతడిని దక్కించుకుంది. ఈ స్టార్ ఆటగాడు 2025 వరకు ఆ క్లబ్‌తో కొనసాగనున్నాడు. పోయిన ఏడాది ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు పియర్స్ మోర్గాన్ అనే బ్రిటీష్ జర్నలిస్ట్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో రొనాల్డో మాంచెస్టర్ క్లబ్ పట్ల అసంతృప్తి వెళ్లగక్కాడు. దాంతో, ఆ క్లబ్ అతడితో కాంట్రాక్టు రద్దు చేసుకుంది. పోర్చుగల్‌ను విశ్వ విజేతగా నిలపాలనుకున్న రొనాల్డోకు వరల్డ్ కప్‌లో నిరాశే ఎదురైంది. కీలకమైన నాకౌట్ మ్యాచ్‌లకు అతడు బెంచ్‌కే పరిమితం అయ్యాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suriya | ‘రోలెక్స్’ సినిమా ఎప్పుడు వస్తుంది.. ఆయననే అడగాలంటూ సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు.. !
Raptadu | రాప్తాడు రంపం దాడి నిందితుడు హేమంత్ కుడికాలు తొలగింపు.. రెండో కాలు తొలగించాల్సిందేనా?
Cyclone Murasu | ఏపీ తీరాన్ని దాటిన తీవ్ర తుపాను ‘మురాసు’.. గంటకు 120 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
OTT Movies | ఓటీటీలో ఈ వారం ఏకంగా 24 సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ కానున్నాయి అంటే?
Tabu | నాగార్జున 100వ సినిమాలో టబు స్పెషల్ రోల్.. గ్లింప్స్ ఎప్పుడు విడుదల కానుంది అంటే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

