వినీసియస్ గోల్.. గట్టెక్కిన బ్రెజిల్
ఫిఫా వరల్డ్ కప్‌లో టైటిల్ ఫేవరెట్ బ్రెజిల్‌కు తొలి మ్యాచ్‌లోనే గట్టి సవాల్ ఎదురైంది. శనివారం అర్ధరాత్రి మొరాకోతో జరిగిన గ్రూప్-సి మ్యాచ్‌లో వినీసియస్ జూనియర్ చేసిన అద్భుతమైన గోల్‌తో సాంబా టీమ్ ఓటమి తప్పించుకుంది.
ఈస్ట్ రూథర్‌ఫోర్డ్ (యూఎస్) : ఫిఫా వరల్డ్ కప్‌లో టైటిల్ ఫేవరెట్ బ్రెజిల్‌కు తొలి మ్యాచ్‌లోనే గట్టి సవాల్ ఎదురైంది. శనివారం అర్ధరాత్రి మొరాకోతో జరిగిన గ్రూప్-సి మ్యాచ్‌లో వినీసియస్ జూనియర్ చేసిన అద్భుతమైన గోల్‌తో సాంబా టీమ్ ఓటమి తప్పించుకుంది. టాప్-10 జట్ల మధ్య ఈ థ్రిల్లింగ్ ఫైట్ 1-1తో డ్రాగా ముగిసింది. 21 నిమిషంలోనే ఇస్మాయిల్ సైబారి కొట్టిన గోల్‌తో మొరాకో 1-0తో ఆధిక్యం అందుకుంది. దాంతో స్టేడియంలోని బ్రెజిల్ అభిమానులు ఒక్కసారిగా నిశ్శబ్దంలో మునిగిపోయారు. అయితే లెఫ్ట్ వింగర్ వినీసియస్ జూనియర్ ప్రత్యర్థి డిఫెన్స్‌లోకి చొచ్చుకెళ్లాడు. 32వ నిమిషంలో మొరాకో గోల్ కీపర్ యాసిన్ బౌనౌను దాటుకుంటూ బంతిని నెట్ లోకి పంపి స్కోరు 1-1తో సమం చేశాడు.
ఆ తర్వాత మరో గోల్ రాకపోవడంతో మ్యాచ్ డ్రా అయింది. ఇదే గ్రూప్ లో స్కాట్లాండ్ 1-0 తేడాతో హైతీపై విజయం సాధించగా..గ్రూప్-డిలో ఆస్ట్రేలియా 2-0తో తుర్కియే జట్టును ఓడించింది. మరోవైపు ప్రపంచకప్‌లో ఖతార్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. గ్రూప్-బి లో భాగంగా స్విట్జర్లాండ్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో ఆఖరి నిమిషంలో గోల్ కొట్టి 1-1తో డ్రా చేసుకుంది. తద్వారా ప్రపంచకప్ చరిత్రలో ఖతార్ తొలి పాయింట్ అందుకుంది. ఫస్టాఫ్‌లోనే లభించిన పెనాలీకి స్విస్ ప్లేయర్ బ్రీల్ ఎంబోలో గోల్ కొట్టాడు. నిర్ణీత సమయం ముగిసే వరకూ ఆధిక్యాన్ని కాపాడుకోవడంతో స్విస్ టీమ్ విజయం ఖాయం అనిపించింది. కానీ, ఇంజూరీ టైమ్ 94వ నిమిషంలో హోమామ్ అమిన్ అందించిన క్రాస్‌ను బౌలెం ఖౌఖి హెడర్ ద్వారా గోల్ పోస్ట్‌లోకి పంపి మ్యాచ్‌ను డ్రా చేశాడు.
వరల్డ్ కప్‌లో నేడు
స్వీడన్ x ట్యునీషియా ఉ. 7.30 నుంచి
స్పెయిన్ x కాబో వెర్డే రా. 9.30 నుంచి
బెల్జియం xఈజిప్ట్ రా.12.30 నుంచి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

