Vinesh Phogat | రెజ్లింగ్ సమాఖ్య నాపై కక్ష కట్టింది.. పునరాగమనానికి అడ్డుపడుతోంది.!
Vinesh Phogat : పారిస్ ఒలింపిక్స్ అనంతరం రెజ్లింగ్‌కు వీడ్కోలు పలికిన వినేశ్ ఫొగాట్(Vinesh Phogat) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) ఉద్దేశపూర్వకంగానే తనను కుస్తీ పోటీల్లో పాల్గొనకుండా అడ్డుపడుతుందని ఆరోపించింది.
Vinesh Phogat : పారిస్ ఒలింపిక్స్ అనంతరం రెజ్లింగ్‌కు వీడ్కోలు పలికిన వినేశ్ ఫొగాట్(Vinesh Phogat) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. రిటైర్మెంట్పై యూటర్న్ తీసుకున్న ఆమె… భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) ఉద్దేశపూర్వకంగానే తనను కుస్తీ పోటీల్లో పాల్గొనకుండా అడ్డుపడుతుందని ఆరోపించింది. ఆసియా క్రీడల ట్రయల్స్ కోసం ‘జాతీయ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్’లో పేరు నమోదు చేసుకోనివ్వకుండా డబ్ల్యూఎఫ్ఐ ఆటంకాలు సృష్టిస్తోందని ఫొగాట్ మండిపడింది.
ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందిస్తున్న వినేశ్ ఫొగాట్ రెజ్లింగ్‌కు వీడ్కోలు పలికి 20 నెలలు అవుతోంది. పారిస్ విశ్వక్రీడల్లో అధిక బరువు కారణంగా పతకం చేజార్చుకున్న ఆమె.. ఒలింపిక్స్ పతకం లక్ష్యంగా మళ్లీ కుస్తీ పోటీల్లో పాల్గొనాలని నిర్ణయించుకుంది. ఆసియా క్రీడలతో పునరాగమనం చేయాలని భావించిన ఆమెకు అడుగడుగునా ఆటంకాలు ఎదురువుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే తనకు భారత రెజ్లింగ్ సమాఖ్య అడ్డుపడుతోందని వినేశ్ అంటోంది.
‘నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌తో నేను పునరాగమనం చేయాలని ఆశిస్తున్నా. అందుకు రిజిస్ట్రేషన్ గడువు ఏప్రిల్ 30వ తేదీ వరకూ ఉంది. నేనే పేరు నమోదు చేసుకునేందుకు ప్రయత్నించగా వెబ్సైట్ పోర్టల్‌లో దరఖాస్తు ప్రక్రియ ముగిసింది అని చూపిస్తోంది. ఈ విషయమే రెజ్లింగ్ సమాఖ్య సిబ్బందిని సంప్రదించేందుకు పలుమార్లు ప్రయత్నించాను. కానీ, వారు నా ఫోన్ ఎత్తడం లేదు అని వినేశ్ ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంస్థతో తన గోడును వెళ్లబోసుకుంది. రెజ్లింగ్ సమాఖ్య నుంచి ఇలా తిరస్కారాలకు గుర్వవడం ఇదే మొదటిసారి కాదని, ఫెడరేషన్ కప్ సమయంలోనూ తనకు ఇదే పరిస్థితి ఎదురైందని వినేశ్ వాపోయింది.
“I am hoping to make a comeback at the National Open Ranking Tournament. The registration for it was open till April 30. However, when I tried to register, the portal says it is now closed”
“I have been trying to contact the administrative staff of the federation, but they… https://t.co/jp8bjm2BUI pic.twitter.com/MTdIrQSdl3
— The Khel India (@TheKhelIndia) April 28, 2026
‘ఫెడరేషన్ కప్‌లో నేను పోటీపడాలనుకున్నా. కానీ, ఆఖరి నిమిషంలో జట్టు ఎంపికలో మార్పులు చేశారు. కాబ్టటి నేను పాల్గొనలేకపోయాను. ఇప్పుడు ఆసియా క్రీడలకు సిద్ధమవ్వాలనుకున్న నన్ను నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో పేరు రిజిష్టర్ చేసుకోకుండా అడ్డుపడుతున్నారు. ఇదంతా ఉద్దేశపూర్వంగానే జరుగుతోంది. నేను పునరాగమనం చేయడం డబ్ల్యూఎఫ్ఐకి ఇష్టం లేదనిపిస్తోంది’ అని వినేశ్ ఫొగాటో పేర్కొంది.
Vinesh Phogat Accuses Wrestling Federation Of India Of Blocking Her Return To The Sporthttps://t.co/82n4IxXNjw
— NDTV Profit (@NDTVProfitIndia) April 28, 2026
ఎవరినీ అడ్డుకోము
రెజ్లింగ్ సమాఖ్య మాత్రం వినేశ్ ఫొగాట్ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. రిజిస్ట్రేషన్ సమయంలో వినేశ్ ఒక్కరే కాదు చాలామంది రెజ్లర్లు సమస్యలు ఎదుర్కొన్నారని డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్(Sanjay Singh) తెలిపాడు. ‘వినేశ్ మాదిరిగానే ఇతర రెజ్లర్ల నుంచి కూడా మాకు ఫిర్యాదులు వస్తున్నాయి. వారికి మా సిబ్బంది సహాయం చేసి వారి సమస్యకు పరిష్కారం చూపించారు. మేము పోటీలో పాల్గొనకుండా ఎవరినీ అడ్డుకోము. ఎందుకంటే.. ఈ టోర్నమెంట్లో అందరూ పోటీపడవచ్చు’ అని సంజయ్ సింగ్ వెల్లడించారు. ఆసియా క్రీడలు సెప్టెంబర్‌లో, అనంతరం అక్టోబర్‌లో వరల్డ్ ఛాంపియన్షిప్స్ ప్రారంభం కానున్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

