Raja Randhir Singh : భారత దిగ్గజ షూటర్ రాజా రణధీర్ సింగ్ (Raja Randhir Singh) కన్నూమూశారు. ఆసియా క్రీడల్లో దేశానికి తొలి స్వర్ణం అందించిన ఆయన 79 ఏళ్ల వయసులో మరణించారు. గత కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్న రణధీర్ బుధవారం స్వగృహంలో తుదిశ్వాస విడిచి వెళ్లారు. ఆరోగ్య సమస్యల కారణంగా ఈ మధ్యే ఆసియా ఒలింపిక్ మండలి అధ్యక్షుడి పదవి నుంచి వైదొలిగిన ఆయన మరణంపై షూటర్లు విచారం వ్యక్తం చేశారు.
పాటియాలోనే రాజ కుటుంబంలో జన్మించిన రాజా రణధీర్ సింగ్ కాలం చేశారు. 1978 ఆసియా క్రీడల్లో దేశానికి తొలి పసిడి అందించి రికార్డు నెలకొల్పిన ఆయన.. రెండు దశాబ్దాలపాటు పాలనాధికారిగా సేవలందించారు. 2004లో ఆసియా ఒలింపిక్ మండలి అధ్యక్షుడిగా ఎన్నికైన రణధీర్ నాలుగేళ్ల పదవీకాలం ముగియకుముందే ఆరోగ్య సమస్యలతో రాజీనామా చేశారు. వృద్ధాప్య సమస్యలు తీవ్రమవ్వడంతో ఆయన సొంతింటిలో కన్నుమూశారని భారత జాతీయ రైఫిల్ సంఘం వెల్లడించింది.
STORY | Veteran sports administrator Randhir Singh dies
Veteran sports administrator and India’s first shooting gold-medallist in Asian Games, Randhir Singh, died on Wednesday after battling age-related ailments.
He was 79 and had undergone hospitalisation for several days… pic.twitter.com/mTkzodx3RD
— Press Trust of India (@PTI_News) May 27, 2026
‘తీవ్రమైన బాధతో రాజా రణధీర్ సింగ్ చనిపోయారనే వార్తను తెలియజేస్తున్నాం. ఈ రోజు(మే 27 బుధవారం) ఆయన కాలం చేశారు. ఆయన ఒలింపిక్స్‌లో సత్తా చాటారు. అర్జున అవార్డు గ్రహీత అయిన రణధీర్ భారత క్రీడారంగంలోనే కాదు ఆసియాలోనూ అత్యంత గౌరవనీయులు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీలోనూ రణధీర్ విలువైన సేవలందించారు. షూటింగ్ అభివృద్ధికి, ఒలింపిక్ క్రీడాకారులను రాటుదేల్చడంలో రణధీర్ కృషి చేశారు’ అని ఎక్స్ పోస్ట్‌లో ఎన్ఆర్ఏఐ పేర్కొంది. రణధీర్‌కు భార్య వినితా, కూతుళ్లు మహిమా, సునైనా, రాజేశ్వరి ఉన్నారు.
STORY | Veteran sports administrator Randhir Singh dies
Veteran sports administrator and India’s first shooting gold-medallist in the Asian Games, Randhir Singh, died in New Delhi on Wednesday after battling age-related ailments, marking the end of an era in the country’s… pic.twitter.com/vqJGRIUWVv
— Press Trust of India (@PTI_News) May 27, 2026