US Open : టెన్నిస్ లెజెండ్ వీనస్ విలియమ్స్(Venus Williams) మరోసారి తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. ఇటీవలే సిన్సినాటి ఓపెన్‌లో సోదరి సెరీనా విలియమ్స్(Serena Williams)తో కలిసి డబుల్స్ తొలి మ్యాచ్‌లోనే కంగుతిన్న వీనస్.. ఈసారి యూఎస్ ఓపెన్ (US Open 2026)లోనూ ఓటమి పాలైంది. అమెరికాకే చెందిన సోఫియా కెనిన్(Sofia Kenin) చేతిలో వరస సెట్లలో మట్టికరిచిందీ వెటరన్. దాంతో.. గ్రాండ్‌స్లామ్ టోర్నీలో 26వ మ్యాచ్‌తో రికార్డు నెలకొల్పిన తను అద్భుతం చేయలేకపోయింది. ఫలితంగా.. సింగిల్స్‌లో వరసగా 15వ పరాజయం మూటగట్టుకుందీ అమెరికా దిగ్గజం.
ఒకప్పుడు మహిళల టెన్నిస్‌లో సంచలన విజయాలతో అలరించిన వీనస్ విలియమ్స్ ఇప్పుడు నిరాశపరుస్తోంది. 46 ఏళ్ల వయసులో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో యూఎస్ ఓపెన్ బరిలో నిలిచిన ఆమె.. తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. రికార్డు స్థాయిలో ఈ మెగా ఈవెంట్లో 26వ మ్యాచ్ ఆడిన వీనస్.. అమెరికా ప్లేయర్ చేతిలో ఓటమి పాలైంది. దీంతో.. సింగిల్స్‌లో వరసగా 15వ పరాజయం చవిచూసింది తను.
It’s an all-American face-off in Ashe!
Sofia Kenin has a 76% likelihood to win over Venus Williams. Who do you think will take the W in their first-career meeting?@IBM | #USOpen pic.twitter.com/cMz4yTefo2
— US Open Tennis (@usopen) August 31, 2026
స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 12:13 గంటలకు జరిగిన మ్యాచ్‌లో వీనస్.. రెండు సెట్లలోనూ తేలిపోయింది. తొలి సెట్‌ను 2-6తో కోల్పోయిన ఆమె.. రెండో సెట్లో పోరాడినా సోఫియాను నిలువరించలేకపోయింది. ఒక్క పాయింట్ తేడాతో సెట్‌ను, మ్యాచ్‌ను దక్కించుకున్న కెనిన్.. రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. చివరిసారిగా యూఎస్ ఓపెన్‌లో 2025లో విజయం సాధించింది వీనస్. అయితే.. సింగిల్స్‌లో ఓడినా.. సోదరి సెరీనా విలియమ్స్‌తో కలిసి డబుల్స్‌లో సత్తా చాటేందుకు సిద్ధమవ్వనుంది టెన్నిస్ గ్రేట్.