IND vs SL : భారత యంగ్ ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ రోజు రోజుకు రాటు దేలుతున్నాడు. శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో ఫాస్టెస్ట్ బంతి వేసి తన రికార్డును తానే తిరగ రాశాడు. ఈ మ్యాచ్‌లో ఉమ్రాన్ గంటకు 156 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించాడు. శ్రీలంకతో తొలి టీ20లో ఉమ్రాన్ 155.5 వేగంతో బంతి విసిరి రికార్డు క్రియేట్ చేశాడు. వన్డేల్లో వేగవంతమైన బంతి వేసిన భారత బౌలర్‌గా రికార్డు సాధించాడు. మొదటి వన్డేలో బుల్లెట్ వేగంతో బౌలింగ్ చేసిన ఈ స్పీడ్‌స్టర్ మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. ఓపెనర్ ప్రథుమ్ నిస్సంకా, చరిత అసలంక, దునిత్ వెల్లలగె వికెట్లు తీసి భారత విజయంలో ముఖ్య భూమిక పోషించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 రన్స్ చేసింది. కోహ్లీ (113)సెంచరీతో చెలరేగాడు. రోహిత్, శుభ్‌మన్ హాఫ్ సెంచరీతో రాణించారు. ఛేజింగ్‌లో శ్రీలంక 306 రన్స్‌కు పరిమితమైంది. చివర్లో ధాటిగా ఆడిన దసున్ షనక సెంచరీ (108) చేసినా జట్టుని గెలిపించలేకపోయాడు.