అసభ్యకర మెసేజ్‌లు.. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న టిమ్ పెయిన్

మెల్బోర్న్: ఆస్ట్రేలియా క్రికెటర్ టిమ్ పెయిన్.. టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలగినట్లు వెల్లడించారు. గతంలో తనతో పనిచేసిన ఓ సహోద్యోగినితో అతను అనుచిత రీతిలో ప్రవర్తించాడు. ఆమెకు తన మొబైల్ ద్వారా అసభ్యకర సంభాషణలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు హోబర్ట్‌లో జరిగిన మీడియా సమావేశంలో టిమ్ పెయిన్ తెలిపారు. 2018 మార్చిలో టిమ్ పెయిన్ ఆస్ట్రేలియా కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. అయితే 2017లో తనతో కలిసి పనిచేసిన ఓ మహిళా ఉద్యోగితో టిమ్ అసభ్యకర సంభాషణలు చేశాడు. దానికి సంబంధించిన వివరాలు లీకైన నేపథ్యంలో కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించాడు. తాను తీసుకున్న నిర్ణయం కఠినమైందని, కానీ తనకు, తన కుటుంబానికి, క్రికెట్‌కు ఇది మంచి నిర్ణయం అవుతుందని పెయిన్ తెలిపాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

