పొడవు 7 అడుగుల 5 అంగుళాలు.. బాస్కెట్‌బాల్‌లో చైనా అమ్మాయి కొత్త రికార్డు

బీజింగ్: పైన ఉన్న ఫొటో చూశారుగా.. ఆ పొడవుగా ఉన్న అమ్మాయి పక్కన మిగతా వాళ్లంతా చిన్న పిల్లలైపోయారు. నిజానికి వాళ్లు కూడా ఆమె వయసు వాళ్లే. కానీ ఝాంగ్ జియు అనే ఈ 14 ఏళ్ల అమ్మాయి మాత్రం ఇప్పుడే ఏకంగా 7 అడుగుల 5 అంగుళాల పొడవు ఉంది. చైనా అండర్ 15 నేషనల్ బాస్కెట్‌బాల్ లీగ్‌లో ఈమె ఆట చూసి అందరూ విస్తుపోయారు. అప్పుడే చైనా లెజెండరీ ప్లేయర్ యావో మింగ్‌తో ఆమెను పోల్చడం మొదలుపెట్టారు. ఓ మ్యాచ్‌లో ఆమె ఆడుతున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అంత హైట్ ఉండటం బాస్కెట్‌బాల్‌లో చాలా అడ్వాంటేజ్. ఆ మ్యాచ్‌లో ఈ అమ్మాయి అదే చేసి చూపించింది. ప్రత్యర్థులను ఈజీగా బోల్తా కొట్టిస్తూ తన టీమ్‌కు పాయింట్ల మీద పాయింట్లు సాధించి పెట్టింది. హుబీ ప్రావిన్స్‌లోని జింగ్ఝౌ టీమ్ తరఫున ఆమె ఆడుతోంది. ఈమె యావో మింగ్ అంతటి ప్లేయర్ కావాలని కొందరు నెటిజన్లు ఆశించగా.. ఈమె మొత్తం హైట్ పెరిగిన తర్వాత ఇంకెలా ఉంటుందో చూడాలని మరికొందరు కామెంట్ చేశారు.
మహిళల బాస్కెట్‌బాల్‌లో రికార్డు
మహిళల బాస్కెట్‌బాల్‌లో ఝాంగ్ జియు కొత్త చరిత్ర సృష్టించబోతోంది. ఇప్పటి వరకూ మహిళల బాస్కెట్‌బాల్‌లో ఆడిన అత్యంత పొడవైన ప్లేయర్ పోలాండ్‌కు చెందిన మల్గోర్జటా డైడెక్. ఆమె 7 అడుగుల 2 అంగుళాల పొడవు ఉండేది. కానీ ఝాంగ్ మాత్రం 14 ఏళ్ల వయసులోనే అంతకన్నా ఎక్కువ హైట్ ఉండటం విశేషం.
ఝాంగ్ ఒకటో తరగతిలో ఉన్నప్పుడే 1.6 మీటర్లు, ఆరో తరగతిలో 2.1 మీటర్లు ఉందని చైనాకు చెందిన గ్లోబల్‌టైమ్స్ పత్రిక తెలిపింది. ఆమె పేరెంట్స్ ఇద్దరూ బాస్కెట్‌బాల్ ప్లేయర్సే. ఆమె తల్లి యు యింగ్ చైనీస్ నేషనల్ టీమ్‌కు కూడా ఆడింది. అయితే ఝాంగ్ ఇప్పటికే తండ్రి (2.13 మీటర్లు), తల్లి (1.98 మీటర్లు) కంటే కూడా ఎక్కువ హైట్ పెరిగింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI Died | శ్రీవారి మెట్టు నడక మార్గంలో గుండెపోటుతో ఎన్ఆర్ఐ భక్తుడు మృతి
‘మహిళా కండక్టర్ మృతికి కారణమైన వారిని శిక్షించాలి’
పలు కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శ
KTR | రేవంత్ రెడ్డి మియాపూర్‌లో బ్రహ్మాండంగా అమరవీరులకు ఇండ్లు కట్టించు : కేటీఆర్
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా జోరు వానలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

