ఫార్ములా-ఈ చాంపియన్‌షిప్.. నేడు ప్రధాన రేసు
ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ ప్రపంచ రేసింగ్ చాంపియన్‌షిప్‌నకు అట్టహాసంగా తెరలేచింది. భారత్‌లో తొలిసారి హైదరాబాద్ వేదికగా జరుగుతున్న రేసింగ్‌లో ప్రపంచస్థాయి రేసర్లు అదరగొట్టారు.
- దుమ్ము రేపిన రేసర్లు
- హోరెత్తిన హుస్సేన్‌సాగర్ తీరం
ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ ప్రపంచ రేసింగ్ చాంపియన్‌షిప్‌నకు అట్టహాసంగా తెరలేచింది. భారత్‌లో తొలిసారి హైదరాబాద్ వేదికగా జరుగుతున్న రేసింగ్‌లో ప్రపంచస్థాయి రేసర్లు అదరగొట్టారు. ట్రాక్‌పై కార్లను వాయువేగంతో పరుగులు పెట్టించారు. శుక్రవారం ఫ్రీ ప్రాక్టీస్‌తో రేసర్లు చాంపియన్‌షిప్ ట్రైలర్ చూపెట్టగా, అసలు సిసలైన రేసు నేడు అభిమానులకు కనువిందు చేయనున్నది.
హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ ప్రపంచ చాంపియన్‌షిప్ అరంగేట్రం అదిరిపోయింది. నగరవాసులకు సరికొత్త అనుభూతిని పరిచయం చేస్తూ హుసేన్సాగర్ తీరప్రాంతం ఫార్ములా కార్లతో కొత్త కళను సంతరించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఫార్ములా-ఈ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తొలి అంకానికి శుక్రవారం తెరలేచింది. షేక్డౌన్తో ట్రాక్‌పై తొలిసారి అడుగుపెట్టిన రేసర్లు ఫ్రీ ప్రాక్టీస్ రేస్-1లో దుమ్ములేపారు. ప్రపంచ పేరెన్నికగన్న కార్లు రయ్య్‌మ్రంటూ దూసుకుపోతూ అభిమానులను మునివేళ్లపై నిలబడేలా చేశాయి.
30 నిమిషాల పాటు జరిగిన ప్రాక్టీస్ రేసులో పాస్కల్ వెర్లిన్ నడిపిన పోర్షె కారు ప్రమాదానికి గురికావడం కొంత ఆందోళన కల్గించినా.. మిగతా రేసు సాఫీగా సాగింది. నువ్వానేనా అన్నట్లు నరాలు తెగే ఉత్కంఠ మధ్య ఆఖరి వరకు రేసు హోరాహోరీని తలపించింది. శనివారం ప్రాక్టీస్, క్వాలిఫయింగ్, ప్రధాన రేసుతో హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్ మరింత హాట్ హాట్‌గా మారనుంది. ఓవైపు ట్రాక్‌పై కార్లు రివ్వున దూసుకుపోతుంటే.. సెలెబ్రిటీలు అభిమానులను కనువిందు చేయడం రేసుకు అదనపు అందాన్ని తీసుకొచ్చింది.
ఫార్ములా-ఈ ప్రపంచ చాంపియన్‌షిప్ భారత్‌లో తొలిసారి జరుగడం సంతోషంగా ఉంది. హైదరాబాద్‌కు ప్రతిష్ఠాత్మక రేసు ఆతిథ్య హోదా దక్కే విషయంలో మంత్రి కేటీఆర్ కృషి వెలకట్టలేనిది. అనుమతుల విషయంలో ఆయన అన్నీతానై వ్యవహరించారు. స్ట్రీట్ సర్క్యూట్ బేస్‌గా జరుగుతున్న రేసులో కొన్ని ప్రతిబంధకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తూ తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ముందుకెళుతున్నాం. ఈ విషయంలో అధికారులు పూర్తి సహకారం అందిస్తున్నారు. పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ కార్లతో రేసు నిర్వహించడం ద్వారా గొప్ప సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నాం. భవిష్యత్‌లోనూ ఈ సహకారంతో రేసులను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తాం. హైదరాబాద్ ట్రాక్ అద్భుతంగా ఉంది. ఈ సర్యూట్‌లో డ్రైవర్లు రేసింగ్‌ను ఆస్వాదిస్తున్నారు.
– అల్బెర్టో లాంగోఫార్ములా-ఈ కో ఫౌండర్
హైదరాబాద్, ఆట ప్రతినిధి: హ్యాపెనింగ్ హైదరాబాద్‌లో మరో చిరస్మరణీయ సందర్భం. కలకాలం గుర్తిండిపోయే క్షణం. ఇప్పటికే పలు ప్రతిష్ఠాత్మక టోర్నీలు, సదస్సులకు వేదికైన మన భాగ్యనగరం దేశంలో తొలిసారి ఫార్ములా-ఈ ప్రపంచ చాంపియన్‌షిప్‌నకు ఆతిథ్యమిచ్చి అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ అవిరళ కృషితో ఆవిష్కృతమైన ఈ చాంపియన్‌షిప్ అట్టహాసంగా జరుగుతున్నది. తొమ్మిదో సీజన్లో భాగంగా హైదరాబాద్‌లో జరుగుతున్న నాలుగో రేసులో తొలి ఘట్టం శుక్రవారం ముగిసింది. శనివారం ఫ్రీ ప్రాక్టీస్ రేసు, క్వాలిఫయింగ్, ప్రధాన రేసు జరుగనుంది.
2013లో ఫార్ములా-1 రేసు తర్వాత భారత్‌లో జరుగుతున్న తొలి రేసుకు మన హైదరాబాద్ వేదికైంది. దీనికి తోడు ఓవరాల్‌గా ఇప్పటి వరకు ఫార్ములా-ఈ రేసుకు ఆతిథ్యమిచ్చిన 27వ నగరంగా హైదరాబాద్ చోటు దక్కించుకుంది. హుసేన్సాగర్ తీరప్రాంతంలో 2.8కిలోమీటర్ల నిడివితో ప్రత్యేకంగా నిర్మించిన సర్క్యూట్‌పై మొత్తం 11 జట్లు, 22 మంది రేసర్లు తమ కార్లను పరుగులు పెట్టించారు. తొలిసారి ప్రవేశపెట్టిన అత్యాధునిక జెన్3 కార్లతో రేసర్లు దుమ్ములేపారు. రేసింగ్‌లో విదేశీ కంపెనీలు, రేసర్లదే హవా కాగా, భారత్ నుంచి మహీంద్ర రేసింగ్, టీసీఎస్ జాగ్వార్ బరిలోకి దిగడం గర్వంగా అనిపించింది.

హోరాహోరీగా ప్రాక్టీస్:
శుక్రవారం ప్రాక్టీస్ రేసు హోరాహోరీగా సాగింది. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 4.30 నుంచి 5 గంటల వరకు ప్రాక్టీస్ రేసు జరుగాల్సింది. కానీ అనుకోకుండా ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ప్రధాన ట్రాక్‌పై వాహనాలు రావడంతో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. అసలు ఏం జరుగుతుంది అనుకునే లోపే వాహనదారులు దర్జాగా ట్రాక్‌పై బండ్లు నడుపడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వెంటనే తేరుకున్న నిర్వహకులు వాహనదార్లను దారి మళ్లించి రోడ్డు క్లియర్ చేయడంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. దీంతో దాదాపు 45 నిమిషాలు ఆలస్యంగా ప్రాక్టీస్ జరిగింది. సెబాస్టియన్ బ్యూమి (ఎన్విజన్ రేసింగ్), స్టొఫెల్ వాన్డెర్నో (పెన్సె), సెర్గియో సెటె కమెరా (నియో 333 రేసింగ్) టాప్-3లో నిలిచారు.
పాస్కల్కు ప్రమాదం
గత రెండు రేసులలో అగ్రస్థానంలో నిలిచిన ట్యాగ్ హ్యుయర్ పోర్షె రేసర్ పాస్కల్ వెర్లిన్(జర్మనీ) ప్రమాదానికి గురయ్యాడు. ఫ్రీ ప్రాక్టీస్ రేసు మొదలైన కొద్దిసేపటికే పాస్కల్ నడుపుతున్న కారు 18వ మలుపు వద్ద గోడను బలంగా ఢీకొట్టింది. దీంతో కారు ముందు, వెనుక భాగం బాగా దెబ్బతిన్నది. వెంటనే అలర్ట్ అయిన రెస్యూ సిబ్బంది కారును పక్కకు తొలిగించారు. కారు నుంచి బయటికొచ్చిన పాస్కల్‌ను నిర్వాహకులు వెంటనే అక్కడి నుంచి గ్యారేజీ వైపు తీసుకెళ్లారు. ప్రమాదం జరిగిన తర్వాత మిగతా రేసర్లు ఒకింత సంయమనం పాటిస్తూ కార్లను నడిపించారు. రేసు సాగుతున్న కొద్ది జోరు పెంచి అభిమానుల్లో జోష్ నింపారు.
- ఫార్ములా-ఈ నేటి షెడ్యూల్
- ఉ: 8.10 నుంచి 8.40 వరకు ఫ్రీ ప్రాక్టీస్-2
- ఉ: 10.40 నుంచి 12.05 వరకు క్వాలిఫయింగ్ రేసు
- మ: 1.40 నుంచి 1.55 వరకు డ్రైవర్స్ పరేడ్
- మ: 3.04 నుంచి ప్రధాన రేసు
- సా: 4.35- మీడియా సమావేశం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

