IND vs BAN | మీర్పూర్: బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా భారత మహిళల జట్టు బుధవారం రెండో వన్డే బరిలోకి దిగనుంది. గత మ్యాచ్‌లో బ్యాటర్ల వైఫల్యంతో పరాజయం పాలైన హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం.. ఈ మ్యాచ్‌లో సత్తాచాటి తిరిగి పుంజుకోవాలని చూస్తున్నది. స్టార్ ఓపెనర్ స్మృతి మందన, హర్మన్‌ప్రీత్, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, యష్తిక, హర్లీన్ సమిష్టిగా సత్తాచాటితే టీమ్ఇండియాకు తిరుగుండదు.