Test Rankings | టెస్టు బౌలర్లలో టాప్-5లోకి బుమ్రా.. నాలుగు స్థానాలు పడిపోయిన కోహ్లీ
శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లాడు. బెంగళూరు టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో అదరగొట్టిన బుమ్రా.. రెండో ఇన్నింగ్సులో మూడు వికెట్లతో సత్తా చాటాడు. ఈ ప్రదర్శనతో టెస్టు బౌలర్లలో టాప్-5లోకి దూసుకొచ్చాడీ పేసర్.
ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఈ జాబితాలో అగ్రస్థానంలోనే ఉండగా.. టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. పాక్ స్టార్ పేసర్ షహీన్ షా అఫ్రిది ఒక స్థానం దిగజారి ఐదో స్థానంలో నిలిచాడు. బుమ్రా ఏకంగా ఆరు స్థానాలు ఎగబాకి నాలుగో ర్యాంకుకు చేరుకున్నాడు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టుల్లో రాణిస్తున్న విండీస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ మరోసారి టెస్టు ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. బెంగళూరు టెస్టులో ప్రభావం చూపలేకపోయిన జడ్డూ రెండో స్థానానికి పడిపోయాడు. అశ్విన్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇక బ్యాటర్ల విషయానికి వస్తే.. చివరగా ఐదో స్థానంలో నిలిచిన విరాట్ కోహ్లీ, బెంగళూరులో పేలవ ప్రదర్శన కారణంగా నాలుగు స్థానాలు దిగజారి 9వ ర్యాంకుకు పడిపోయాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆరో స్థానాన్ని కాపాడుకోగా.. భారత్‌పై వీరోచిత సెంచరీ సాధించిన శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే మూడు స్థానాలు మెరుగు పరుచుకొని ఐదో ర్యాంకుకు చేరుకున్నాడు. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ పదో స్థానంలో కొనసాగుతున్నాడు.
🔹 Jasprit Bumrah breaks into top 5 💪
🔹 Jason Holder reclaims top spot 🔝
🔹 Dimuth Karunaratne rises 📈Some big movements in the latest @MRFWorldwide ICC Men's Test Player Rankings 🔢
Details 👉 https://t.co/MQENhZlPP8 pic.twitter.com/8OClbDeDtS
— ICC (@ICC) March 16, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
Former Minister Talasani | ఓటరు నమోదు ముమ్మాటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి : మాజీ మంత్రి జరగాలని తలసాని
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

